Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Nov 20, 2018 | Last Updated 7:26 pm IST

Menu &Sections

Search

ప్రధానిగా ఐదో సంవత్సరం - నరెంద్ర మోడీకి కొత్త సర్వే పెద్ద ఝలక్

ప్రధానిగా ఐదో సంవత్సరం - నరెంద్ర మోడీకి కొత్త సర్వే పెద్ద ఝలక్
ప్రధానిగా ఐదో సంవత్సరం - నరెంద్ర మోడీకి కొత్త సర్వే పెద్ద ఝలక్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

 2014 ఎన్నిక‌లు ఒక క‌ల. అస‌లు 2000 త‌ర్వాత ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి అయిన వ్య‌క్తి అన‌తి కాలం లోనే ఊహాతీతంగా రాజకీయ మహాప్రస్థానంలో సొంత మెజారిటీతో ఎదిగి అధికారంలోకి రావ‌డం ఒక ఊహాతీత ప‌రిణామ‌మే. అయితే ఎలాంటి ప‌రిస్థితులనైనా త‌న‌కు అనుకూలంగా డ్రైవ్ చేసి సానుకూలంగా మార్చుకోవ‌డంలో నరెంద్ర మోడీ వ్యూహం అనితర సాధ్యం.

india-news-modi-four-years-in-power 

అయితే, నరెంద్ర మోడీ అంతరాల్లో ప‌ద‌వి తెచ్చిన అహంకార‌మో, స్వల్పకాలంలోనే సునాయాసంగా దక్కిన అధికార‌మధమో తెలియదు గాని, ఎదిగినంత వేగంగా పతన మౌతున్న ఇమేజ్ తో మోడీ తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో నరెంద్ర మోడీ ఏం చేసినా థ్రిల్లింగ్ గా ఉండేది. కానీ ఇపుడు జ‌నం ఆయన ఏ పథకం తెస్తున్నా ముందుగానే భయపడుతున్నారు. అంతే కాదు అత‌డి భ‌విష్య‌త్తు చ‌ర్య‌ల‌ను అతి సులువుగా ఊహించగలుగు తున్నారు. 

india-news-modi-four-years-in-power 

అయితే, రోజు రోజుకు సాధారణ మీడియాలో అంటే పత్రికల్లో వివిధ చానళ్ళలో అలాగే  సామాజిక మాద్యమాల్లో తేడా లేకుండా మోడీ పై జనవ్య‌తిరేక‌త పెరుగుతుండ‌టంతో ఇది నిజ‌మేనా? లేక ప్ర‌చార‌మా? అని ఏబీపీ న్యూస్‌-సీఎస్‌డీఎస్ ఒక స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో అనేక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విష‌యాలు వెలుగుచూశాయి. మోడీపై వ్య‌తిరేక‌త ఒక ప్ర‌చారం కాదు, నిజం అని చెప్పిందా స‌ర్వే.

 india-news-modi-four-years-in-power

హైలెట్స్ ఆఫ్ ది స‌ర్వే  మూడ్ ఆఫ్ ది నేషన్ 

 

1. మోడీకి 274 సీట్లు వ‌స్తాయి కానీ ఓట్లు మాత్రం 37% మాత్రమే.


2. కాంగ్రెస్ అంచనాలకు మించి పుంజుకుంది. కాంగ్రెస్‌కు 31% ఓట్లు-164 సీట్లు, ఇత‌రుల‌కు 32% ఓట్లు వ‌చ్చే అవ‌కాశం. 

3. ద‌క్షిణ భార‌తం లోని 132 సీట్ల‌లో మోడీ 22 కు మించి గెలిచే అవ‌కాశ‌మే లేదు.

4. రాహుల్ గాంధీ పాపులారిటీ గ‌తంతో పోలిస్తే 8 శాతం పెరిగింది మ‌రో ఏడాదిలో ఇంకా పెరిగే అవ‌కాశ‌మూ ఉంది.

5. ఉత్త‌ర భార‌తంలో నరెంద్ర మోడీ కంటే కూడా ఇత‌ర పార్టీల‌కే ఓట్లు ఎక్కువ రావచ్చు.

6. రాజ‌స్థాన్‌లో ఎన్డీయే పవనాలు వీచట్లేదు ఓడినా ఆశ్చర్య పడనవసరం లేదు.

7. బీఎస్పీ-ఎస్పీ కూట‌మి ఉత్త‌రప్ర‌దేశ్‌లో బీజేపీని మ‌ట్టి క‌రిపిస్తుంద‌ట‌.

8. వాయవ్య భార‌తంలో మాత్రం లోక్‌స‌భలో మోడీ ప్ర‌భావం ఇంకా స్ట్రాంగ్ గానే ఉందంటున్నారు.

9. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ విప‌రీతంగా పుంజుకుని 49% ఓట్లు సంపాదించే స్థాయికి వచ్చింది. 

10. బీహార్‌, ప‌శ్చిమ బెంగాల్‌లో కూడా స్థానిక పార్టీల‌దే బీజేపీ మీద పైచేయిగా ఉంది. 

 

ఈ స‌ర్వేలో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే, రాష్ట్రాలను విడి విడిగా చూసి అంచ‌నా వేస్తే నరెంద్ర మోడీ ఇమేజ్ భారీగా దెబ్బ‌తిన్న‌ట్టు క‌నిపిస్తోంది. కానీ ఈరోజు ఎన్నిక‌లు జ‌రిగితే నరెంద్ర మోడీ బొటా బొటి మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని అంటున్నారు. కానీ ప్రాంతీయ పార్టీల కూట‌మి ఈ సారి దేశ వ్యాప్తంగా భారీగా ఏర్పాట‌వుతున్న నేప‌థ్యంలో మోడీకి క‌చ్చితంగా అశుభసంకేతాలు మొద‌ల‌య్యాయ‌ని చెప్పొచ్చు.

 india-news-modi-four-years-in-power

నేటికి నరెంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి పాలన ప్రారంభమైన్ సరిగ్గా నాలుగేళ్ళు పూర్తయింది. నరెంద్ర మోడి బృందానికి ఏపి హెరాల్డ్ శుభాకాంక్షలు.

india-news-modi-four-years-in-power

india-news-modi-four-years-in-power
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
మహాకూటమిలో మహామాయ - బాగస్వామ్య పక్షాలకు కాంగ్రెస్ - టిడిపి మార్క్ వెన్నుపోటు!
జాబితాలో పేరు లేకున్నా ఓటరుగా నమోదై ఉన్నవారు ఓటు వేయవచ్చు! ఎలా అంటే!
భారత్ చైనాకు గుణపాఠం - మాల్దీవ్స్ లో ప్రజాస్వామ్య ప్రతిస్ఠాపన
తారస్థాయికి చేరిన రాష్ట్ర అవినీతి: మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ కల్లం తదితరుల ఆవేదన
టిడిపి జోకర్ల నిలయమౌతుందా! అల్లుణ్ణి మించిన మామ కథ!
న్యాయ వ్యవస్థకు మకిల పట్టించారు! ఇక ఎన్నికల్తో కడిగెయ్యటమనా?
శబరిమల ప్రవేశం కంటే మహిళలకు ముఖ్య సమస్యలు లేవా? బంగ్లా రచయిత్రి తస్లిమ నస్రీన్
జగన్ హత్యాయత్నం వెనకున్నది సాక్షాత్తు ముఖ్యమంత్రే!
సన్నీ లియోన్ స్టెప్స్ - సిల్వర్ స్క్రీన్ షేక్స్
చంద్రబాబు క్లీన్ బౌల్డ్ – ఇక నందమూరి కుటుంబం మాత్రమే టిడిపికి శ్రీరామరక్ష
దేశ వ్యాప్తంగా "సిబీఐకి నో ఎంట్రీ" యేనా?  ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నిర్ణయం
చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం తప్పే: మాజీ జేడీ లక్ష్మీనారాయణ
చంద్రబాబు నమ్మక ద్రోహి-రాజకీయం అంటే ప్రతిపక్షాన్ని అంతం చేయటం కాదు: రోజా భర్త
ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు “రాష్ట్రపతి పాలన” కు దారి తీస్తున్నాయా?
ఆయనకు వ్యూహాలు రాజకీయాలే ఊపిరి! చంద్రబాబు పడగనీడలో తెలంగాణా!
చంద్రబాబు కుటుంబ రాజకీయం - అదే లేకపోతే ఆయన ఏమైపోతారో?
ఆంధ్రప్రదేశ్ లో సీబీఐ కి ప్రవేశం నిషేధం: జి.ఓ ఒక టిష్యూ పేపర్
రకుల్..ప్రీత్..సింగ్  అందాలు ఆరబోస్తూ  అవకాశాలు అందిపుచ్చుకుంటూ ఆల్-వుడ్స్ లో దూసుకెళ్తూ.....
అనుపమ పరమేశ్వరన్ లైంగిక వేదింపును ఎలా పరిణితి తో ఎదుర్కుందో తెలుసా?
ప్రధాని మోడీపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఇన్-ఫోసిస్ నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు
చంద్రబాబు సింగిల్ గా ఎప్పుడైనా గెలిచాడా? తెలంగాణా అపద్ధర్మ మంత్రి కేటీఆర్
About the author