నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల కారణంగా, తమ మొండి బాకీలు ఇక తిరిగి రావని వదిలేసుకున్న రూ.83000 కోట్ల ఋణాలు తిరిగి బ్యాంకులకు వచ్చాయి. ప్రభుత్వం తమ సంస్థలపై చర్యలు తీసుకోవటానికి, ఆస్తులను వేలం వేయించటానికి సమాయత్తమవుతున్నట్లు గమనించిన 2100 కంపెనీ లు గతంలో తాము తీసుకున్న ఋణాలను “సెటిల్మెంట్” చేసుకునేందుకు ఆఘమేఘాల మీద ప్రయత్నాలు జరిపి, తిరిగి చెల్లింపులు చేస్తున్నాయి. ఇదంతా మోడీ ప్రభుత్వం సాధించిన విజయమే అంటున్నారు ఆర్థిక నిపుణులు. కేంద్రం ఇటీవల కొత్త "దివాలా చట్టం –ఐబీసీ" (ఇన్సాల్వెన్సీ అండ్ బాంక్రప్సీ కోడ్) అమలు లోకి తెచ్చింది. 

New IBC bad debt recovery in India కోసం చిత్ర ఫలితం


ఐబీసీ  ప్రభావంతో గతంలో ఋణాలు ఎగవేసి చొధ్యం చూస్తున్న పలు కంపెనీలు ఋణాలు చెల్లించాయి. ఈ చట్టం ఋణ ఎగవేతదారులపై (డిఫాల్టర్లపై) చాలా ప్రభావం చూపింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం, మొత్తం 2,100 కంపెనీలు తమ ఋణాలను చెల్లించాయి. ఐబీసీ చట్టంలో మార్పుల అనంతరం,  దీని ప్రకారం నిరర్ధక ఆస్థులు (ఎన్పీఏ) గా బ్యాంకులు ప్రకటించిన వారి ఆస్తులపై ఆ సంస్థల ప్రమోటర్లకు ఎటువంటి హక్కులూ ఉండవు.


Total amount recovered after New IBC కోసం చిత్ర ఫలితం

ఇదే సమయంలో 90రోజుల పాటు ఋణ చెల్లింపు ఆగిపోతే ఆ ఋణాన్ని, ఋణం పొందేందుకు తనఖా పెట్టిన ఆస్తిని నిరర్థక ఆస్తి కింద ప్రకటించి తదుపరి చర్యలకు ఉపక్రమించవచ్చని కొత్త చట్టం చెబుతోంది. ప్రభుత్వం చట్టాన్ని మార్చిన అనంతరం పలు కంపెనీలు, కంపెనీల ప్రమోటర్ల కుటుంబాల నుంచి ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. అయినా ప్రభుత్వం తగ్గలేదు. ఋణ ఎగవేతదార్లపై ఒత్తిడి తీవ్రంగా పెరిగిందని, వారు ఋణాలను తిరిగి చెల్లిస్తున్నారని, కేంద్రం ప్రభుత్వం తీసుకు వచ్చిన ఐబీసీ వల్లనే ఇదంతా సాధ్యమైందని ప్రభుత్వాధికారులు చెబుతున్నారు.

 New IBC bad debt recovery in India  కోసం చిత్ర ఫలితం

మరింత సమాచారం తెలుసుకోండి: