వైసీపీ అధినేత ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్ర కి రోజు రోజు ప్రజలలో ఆదరణ మరింత పెరుగుతుంది. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా నిర్వహిస్తున్న సభలకు వస్తున్న జనం చూస్తుంటే అధికారపక్ష పార్టీ తెలుగుదేశం నేతలకు దిమ్మ తిరిగిపోతుంది. అంతేకాకుండా ఆ సభలలో జనం చంద్రబాబు ఏవిధంగా తమని మోసం చేశారో వారి మాటలను చూస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం పై ప్రజలలో భయంకరమైన వ్యతిరేకత నెలకొంది అని అర్థమవుతుంది. ఈ నేపద్యంలో చాలామంది ఇతర పార్టీలకు సంబంధించిన రాజకీయ నాయకులు వైసీపీలోకి రావడానికి తెగ ఉత్సాహపడుతున్నారు..ఇప్పటికే ఆయా జిల్లాలలో చాలామంది ప్రముఖ నేతలు పార్టీ లోకి రావడం జరిగింది.
Image may contain: 13 people, people walking, crowd and outdoor
అయితే ఇటీవల కృష్ణా జిల్లాలో కొనసాగించినా పాదయాత్రలో జగన్ ఆ జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టడం జరుగుతుందని ఇది వరకే తెలియజేశారు అది మనకి కూడా తెలుసు. ఇప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప పాదయాత్ర చేస్తున్న జగన్ అక్కడ భారీ బహిరంగసభలో పశ్చిమగోదావరి జిల్లా గురించి షాకింగ్ కామెంట్స్ చేసరు.
Image may contain: 1 person, crowd and outdoor
వైసీపీ అధికారంలోకి వస్తే పశ్చిమగోదావరి జిల్లాకు ఆనాడు బ్రిటిష్ వారితో పోరాడిన స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడతానని ప్రకటించారు. ‘‘స్వాతంత్ర్య సమరంలో భాగంగా బ్రిటిష్‌ వారితో వీరోచితంగా పోరాడిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజును ఇప్పటివరకు ప్రభుత్వాలేవీ సరైన విధంగా గౌరవించలేదు. పాదయాత్ర చేస్తోన్న నా దగ్గరికి వచ్చిన క్షత్రియ కులస్తులు ఇదే విషయాన్ని గుర్తుచేశారు. రేప్పొద్దున దేవుడు ఆశీర్వదించి మన ప్రభుత్వం వస్తే పశ్చిమ గోదావరి జిల్లాకు అల్లూరి సీతారామరాజు పేరు పెడతాం..’’ అని జగన్‌ చెప్పారు.
Image may contain: 6 people, people standing, outdoor, water and nature
ఈ ప్రకటనతో తెలుగుదేశం పార్టీ నాయకులలో కొంత అలజడి మొదలైంది. జగన్ కి ఇటువంటి ఆలోచనలు ఎలా వస్తాయి అని  వారిలోవారు మాట్లాడుకుంటున్నారట. మరోవైపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కి గుండెల్లో గుబులు పుట్టుకుంది...జగన్ ఏ జిల్లాకు వెళితే ఆ జిల్లాను ఆకట్టుకునే విధంగా ప్రకటనలు చేయడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ఇటీవల తన మామగారు ఎన్టీరామారావు పుట్టిన కృష్ణ జిల్లాలో తనకే రాని ఆలోచనను జగన్ కి రావడంతో బాబు గారికి మతి పోయిందట. ఈ పరిస్థితులన్నీ చూస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు అధినేతకు వచ్చే ఎన్నికలలో ఇంటికి వెళ్లిపోయే పరిస్థితులు ఉన్నాయా అని తమలోతాము అనుకుంటున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: