ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేపాల్ పర్యటనకు వెళ్లిన సమయంలో తాను చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తడంతో తన తప్పు ఏంటో తెలిసిందని అందుకు తనను మన్నించాలని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కోరారు. నేపాల్ లోని జనక్ పూర్ లో ప్రధాని పర్యటిస్తున్న వేళ, అక్కడున్న లక్షలాదిమంది భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారంటూ ఆమె తన ట్విట్టర్ లో పేర్కొనడంపై దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే.
Image result for modi nepal tour
కాగా జనక్ పూర్ లో మోదీ నేపాలీలతో మాట్లాడారే తప్ప, భారతీయులతో కాదని నేపాల్‌ రాజకీయ నాయకులు విమర్శలు గుప్పించారు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్ తన ట్విట్టర్ ఖాతాలో "ఈ పొరపాటు నా వల్లే జరిగింది. అందుకు నేను మనస్పూర్తిగా క్షమాపణ కోరుతున్నాను" అని ఆమె అన్నారు. నాడు మోదీ గురించి తాను మాట్లాడిన అంశంపై ఓ చిన్న వీడియోను సైతం ఆమె పోస్టు చేశారు.
మోదీ ఎక్కడికి వెళ్లినా భారతీయులను తక్కువ చేసి మాట్లాడరని..భారతీయుల ఔన్నత్యాన్ని ఎంతో గొప్పగా మాట్లాడుతారని అన్నారు.

అంతే కాదు అమెరికాలోని మాడిసన్ స్క్వేర్ నుంచి మొదలు పెట్టి, నేపాల్‌ లోని జనక్‌ పూర్ వరకూ, లక్షలాది మంది భారతీయులను కలుసుకుని మాట్లాడిన తొలి ప్రధాని నరేంద్ర మోదీ అని ఆమె అన్నారు. ఈ వ్యాఖ్యలు తమ దేశ సార్వభౌమత్వాన్ని చాలా సాధారణంగా తీసిపారేస్తున్నట్టు ఉన్నాయని ఆ దేశ నేతల నుంచి విమర్శలు వచ్చాయి.




మరింత సమాచారం తెలుసుకోండి: