“నమ్మి వెంట ఉన్నందుకు చంద్రబాబు నన్ను మోసం చేశాడు. పార్టీకి దూరం చేసి బలి చేశాడు. నాకు గవర్నర్‌ పదవి ఇప్పిస్తానని మాట తప్పాడు. ఒక్కో రాజ్యసభ సీటును రూ.100 కోట్లకు అమ్ముకున్నాడు’’  అని తెలుగు దేశం పార్టీ   అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పై ఆ పార్టీ సీనియర్‌ నేత మూడు దశాబ్ధాలకు పైగా రాజకీయ జీవితమున్న మోత్కుపల్లి నర్సింహులు మండి పడ్డారు. టీడీపీ జెండాను ఎన్టీఆర్‌ నుంచి గుంజుకున్న దొంగ చంద్రబాబు అని దుయ్యబట్టారు.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. నేడు (మంగళవారం) మీడియా సమావేశంలో ఆయన తీవ్రమైన ఆరోపణలు చేశారు.

Image result for NTR Motkupalli

చంద్రబాబు చేసిన కుట్రల వల్లే ఎన్టీఆర్‌ చనిపోయారని మోత్కుపల్లి చెప్పారు. ‘‘ఎన్టీరామారావు గారి దయ, ఆశీర్వాదం వల్ల నాలాంటి పేదవాడు రాజకీయాల్లో ఉండ గలుగుతున్నారు. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లని ఆయన పార్టీపెట్టారు. పార్టీ పేదోళ్ల కోసమే కానీ, పెత్తందార్ల కోసం కాదనిచెప్పాడు. అలాంటి పార్టీకి నన్ను దూరం చేశారు. ఇప్పుడు నా రాజకీయ జీవితాన్ని బలి తీసుకున్నారు. చంద్రబాబు కుట్రలకు ఎన్టీఆర్‌ బలైపోయారు. ఆయన పేరును రాజకీయాల కోసం వాడుకుంటున్నారే తప్ప మరోటి లేదు.


చివరి వరకు నేను ఎన్టీఆర్‌తోనే ఉన్నా. ఆయన చేయి పట్టుకుని ఉన్నా, చనిపోయేటప్పుడు రాత్రి 8గంటల వరకు కూడా నేనున్నా. నాతో పాటు ఇంద్రారెడ్డి, దామోదర్‌ రెడ్డి, బుచ్చయ్య చౌదరి, ముద్దు కృష్ణమ నాయుడు ఉన్నారు. "తమ్ముళ్లూ! నా జెండా గుంజుకున్నాడు. నా పార్టీని గుంజుకున్నాడు. బ్యాంకులో ఉన్న డబ్బు కూడా నాకు రాకుండా చేశాడు. నేనేం చేయాలి" అని ఎన్టీఆర్‌ ఆవేదన చెందారు

Image result for NTR Motkupalli

"ఆత్మను అమ్ముకునే నీచుడు" చంద్రబాబు అంటూ, కమ్మకులస్తులారా ఒక్కసారైనా చంద్రబాబును ఓడించండని ఆయన పిలుపునిచ్చారు. చంద్రబాబును ఓడించి ఎన్టీఆర్ ఆత్మకు శాంతిని చేకూర్చాలని ఏడుకొండలవాడిని వెేడుకుంటున్నానని అన్నారు. తెలుగు దేశం పార్టీలో తాను నారా చంద్రబాబు నాయుడి కన్నా సీనియర్ నని అన్నారు. తాను 1982 లోనే టీడీపి లోకి వచ్చానని అన్నారు.


కేసిఆర్ 'లాట్' కొడితే అమరావతిలో పడ్డాడని ఆయన వ్యాఖ్యానించారు. 'ఓటుకు నోటు కేసు' నుంచి బయటపడ్డానికి ప్రధాని మోడీ, కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్ జైట్లీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసిఆర్ పాదాలు పట్టు కున్నారని వ్యాఖ్యానించారు.

Motkupalli Narasimhulu Strikes Again On TDP Chief Chandrababu Naidu - Sakshi

చంద్రబాబు అంటేనే నమ్మకద్రోహి అని అన్నారు. చంద్రబాబు పిరికిపంద అని వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసు లో నిన్ను, నీ అనుచరుడు రేవంత్ రెడ్డిని దొంగను పట్టుకున్నట్లు పట్టుకున్నారని అన్నారు. ఓటుకు నోటు కేసు లోని ఆడియోలో వాయిస్ నీది కాదని చెప్పగలవా? అని ప్రశ్నించాడు. చంద్రబాబు తన దుర్బుద్ధిని బయట పెట్టుకున్నాడని ఆయన అన్నారు.


ఎవరైనా దళితులుగా పుట్టాలని అనుకుంటారా? అని సభలో ప్రశ్నించి దళిత జాతినే అవమానించాడు. దళితులంటే చంద్రబాబుకు చిన్న చూపు అని, దళితులెవరు చంద్రబాబుకు ఓటేయవద్దని అన్నారు. ఆత్మను అమ్ముకున్న నీచుడు తనను బహిష్కరించి తన కుటిల బుద్ధిని మరోసారి బయట పెట్టు కున్నారని ఆయన అన్నారు. ఒక్కమాట చెప్తే తాను మహానాడుకు వెళ్లేవాడిని అని అన్నారు.

Image result for NTR Motkupalli

‘‘చంద్రబాబుకు మాల మాదిగల ఓట్లు కావాలి. ఓసారి మాదిగోళ్లు, ఇంకోసారి మాలోళ్లు కావాలి. చెండాలపు కులంలో ఎవరు పుట్టాలని కోరుకుంటారని చెప్పిన ఈయన పేదల కోసం పనిచేస్తున్నానని చెప్పుకునే నటనా చక్రవర్తి’’ అని మోత్కుపల్లి అన్నారు. ‘‘దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారంటూ ఏ సీఎం అయినా ఈ దేశంలో మాట్లాడిండా?  బీసీలకు, కాపులకు మధ్య కుట్ర చేస్తుండు. కాపులను ఓ పక్క, బీసీలను మరో పక్క ఎగేస్తున్నాడు. కాపులకు రిజర్వేషన్లు సాధ్యమా? ఈయన చేతుల్లో ఉందా? చివరకు బ్రాహ్మణుల మధ్య కూడా చిచ్చుపెడుతున్నాడు.


టీడీపి జెండా చంద్రబాబు ది కాదని, ఎన్టీఆర్ దని అన్నారు. చంద్రబాబు బ్రతుకంతా కుట్రలు, కుతంత్రాల తోనే నిండి ఉందని అన్నారు. ఓటుకు నోటు కేసులో నిన్ను, రేవంత్ రెడ్డిని పట్టుకుంటే నువ్వు కాళ్లబేరానికి వచ్చావని ఆయన చంద్రబాబు నుద్దేశించి అన్నారు. హైదరాబాదు వదిలి అమరావతికి ఎందుకు పారిపోయావని ఆయన చంద్రబాబును అడిగారు.

Image result for NTR Motkupalli

దమ్మున్న మగాడివైతే సొంత జెండా & ఎజెండాతో రావాలని ఆయన చంద్రబాబు ను సవాల్ చేసారు. కేసీఆర్ గురించి మాట్లాడాలంటే గజగజ వణుకుతున్నారని ఆయన చంద్రబాబును ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ను వెన్నుపోటుతో చంపి టిడిపిని దోచుకెళ్ళావని అన్నారు. తాను లేకపోతే ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి చంద్రబాబు దని, పనికి మాలిన వాళ్లతో తనను తిట్టిస్తున్నాడని అన్నారు. రేవంత్ రెడ్డిని కాంగ్రెసులోకి పంపించారని అన్నారు.


జగన్‌ ఓ జెండా పెట్టుకున్నడు మొగోడు!  పవన్‌ కల్యాణ్‌ ఓ జెండా పెట్టుకున్నాడు మొగోడు! కానీ నువ్వు గుంజుకున్నవ్‌! ఈ జెండా, ఎన్టీఆర్‌ జెండా దొంగతనం చేసిన దొంగవు నువ్వు. మహానాడు లో ఎన్టీఆర్‌ పేరు ఉచ్ఛరించడానికీ నీకు అర్హత లేదు. జగన్‌, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడతా! అన్నడు. నీకు సిగ్గులేదా! పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్‌ చరిత్ర పెట్టాలని అడిగినా పెట్టవు. నీకు ఎన్టీఆర్‌ అంటే ఈర్ష్య, ద్వేషం. ఆయన బొమ్మ ఎక్కడా ఉండొద్దు. మాసి పోయిన బాబు మొహం తప్ప ఎవరి మొహం కనిపించొద్దు’’ అని అన్నారు.

Image result for NTR Motkupalli

దళారీ నేత రేవంత్ రెడ్డి బాగానే ఉన్నాడని, రేవంత్ రెడ్డి పై ఎందుకు చర్యలు తీసుకోలేదని, తాను దళితుడిని కాబట్టే తనపై చర్యలు తీసుకున్నారని అన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు అనుకున్నారని అన్నారు. పదేళ్లు అధికారంలో లేకున్నా చంద్రబాబు పక్కన తాను నిలబడ్డానని అన్నారు. చంద్రబాబు పై సిబిఐ దర్యాప్తునకు ఆదేశించాలని ఆయన కేంద్రప్రభుత్వాన్ని కోరారు. తన వెనక ఎవరూ లేరని, తానే ఉన్నానని మోత్కుపల్లి అన్నారు. చంద్రబాబుకు వెట్టి చాకిరీ చేస్తేటందుకు ఎవరూ లేరని అన్నారు. ఎపి ప్రజలు చంద్రబాబును రాజకీయంగా బొంద పెడుతారని అన్నారు. చంద్రబాబు తనకు అన్యాయం చేశారని, మాదిగ బిడ్డను కాబట్టే అన్యాయం చేశారని అన్నారు. తెలంగాణలో పార్టీని చంద్రబాబు సర్వనాశనం చేశారని, తెలంగాణ ప్రజలు చంద్రబాబును సస్పెండ్ చేశారని అన్నారు. 


ఎవరైనా దళితుడిగా పుట్టాలని అనుకుంటాడా? అని సిగ్గులేకుంటా చంద్రబాబు మాట్లాడారని అన్నారు. నువ్వు నీచుడవని నువ్వే నిరూపించుకున్నావని అన్నారు. మాల మాదిగల ఉసురు చంద్రబాబుకు తగులుతుందని అన్నారు. కులాల మధ్య, వర్గాల మధ్య, ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని అన్నారు.

'టీడీపీని నంద‌మూరి వార‌సుల‌కు అప్ప‌గించాలి'

చంద్రబాబు లాంటి నీతిమాలిన మనిషి మరొకరు లేరని అన్నారు. రేవంత్ రెడ్డి నిన్ను, నీ పార్టీని బజారున పడేశాడని, అయినా చర్యలు తీసుకోలేదని అన్నారు. రేవంత్ ని ఏమీ అనవద్దని రమణ తనకు చెప్పాడని అన్నారు. దళతజాతిని మోసంచేసి చంద్రబాబు బతుకుతున్నాడని అన్నారు. తనకు దేవుడుతోడుగా ఉంటాడని అన్నారు. ఒక్క నాయకుడిని ఓడించడానికి మరో నాయకుడి చంద్రబాబు ప్రేరేపిస్తాడని అన్నారు.


దుర్మార్గుడైనా, నీచుడైనా, పాపాత్ముడైనా చంద్రబాబు పక్కన ఉన్నానని, ఉమా మాధవరెడ్డికి మద్దతు కోసం పార్టీలోకి రావాలంటే వచ్చానని ఆయన అన్నారు చంద్ర బాబు అబద్ధాలు మాట్లాడితే ఎవరు నమ్ముతారని అన్నారు. చంద్రబాబుకు కులపిచ్చి అని అన్నారు. హైదరాబాదులో రెండు భవనాలు కట్టితానే అభివృద్ధి చేశానని చంద్రబాబు అంటారని, అమరావతిలో రెండు భవనాలు కట్టారని ఆయన అన్నారు. హైదరాబాదును అభివృద్ధి చేయడానికి వందల ఏళ్లు పట్టిందని ఆయన చెప్పారు.

Image result for NTR Motkupalli

తిరుపతి లడ్డు, శాలువాలతో మోడీ వద్దకు చంద్రబాబు వెళ్లాడని, ప్రత్యేక హోదా కోసం వెళ్లలేదని, కేసిఆర్ పెట్టిన కేసు నుంచి బయటపడడానికి వెళ్లాడని అన్నారు. దమ్ముందా! సిగ్గుందా! నీ వాయిస్ కాదని చెప్పగలవా? సెబాస్టియన్ తో మాట్లాడావా?  లేదా? మొగోడివైతే మాట్లాడానని చెప్పవచ్చు కదా! అని అన్నారు. ఆ వాయిస్ విన్నవాడు నోట్లో ఊంచుతాడని అన్నారు.


బ్రోతల్ హౌస్ మాదిరిగా చంద్రబాబు రాజకీయాలను నడుపుతున్నాడని అన్నారు. కేసిఆర్ దెబ్బ చంద్ర బాబు పారిపోయాడని అన్నారు. తాను ఎమ్మెల్యేగా ఆరు సార్లు గెలిచానని, చంద్రబాబు ఏడు సార్లు గెలిచాడని, తాను ఏమీ లేకున్నా గెలిచానని అన్నారు. చంద్రబాబు తనకు పదవి ఇవ్వలేదని, ఎన్టీఆర్ ఇచ్చాడని అన్నారు. పార్టీని ముందుకు తీసుకుని వెళ్లినప్పుడు చంద్రబాబు ఎక్కుడున్నాడని అడిగారు.

Image result for NTR Motkupalli

చంద్రబాబు! నీ జీవితమే అవినీతి కుట్రల మయం అని అన్నారు. తెలంగాణ ప్రజలు చంద్రబాబు ను ఎప్పుడో సస్పెండ్ చేశారని అన్నారు. 'ఓటుకు నోటు కేసు' పెట్టి నప్పుడు టీడీపిని టీఆర్ఎస్ లో చంద్రబాబు విలీనం చేశారని అన్నారు. పిరికిపందలా పారిపోయావని ఆయన చంద్రబాబును అన్నారు. గాలి ముద్దుకృష్ణమ నాయుడు చంద్రబాబు చిత్రహింసలకు మరణించారని అన్నారు.


ప్రత్యేక హోదాపై మాట మార్చింది చంద్రబాబే అని అన్నారు. జగన్ ప్రత్యేక హోదా తెస్తారని అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేసి మోడీని చంద్రబాబు పొగిడారని, ప్రత్యేక హోదా రాదని చెప్పిన దళారి అని అన్నారు. చంద్రబాబు వల్లనే రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టిందని అన్నారు. ప్రత్యేక హోదా బ్రహ్మపదార్థం కాదని అన్నారు. ఎన్టీఆర్ కుటుంబాన్ని చంద్రబాబు వాడుకున్నారని, చచ్చిన తర్వాత కూడా ఎన్టీఆర్ ను చంపుతున్నాడని అన్నారు. ఆంధ్ర ప్రజలు చంద్రబాబును బొంద పెడుతారని, టీడీపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రాదని అన్నారు.

Image result for NTR Motkupalli

నువ్వు ఎన్ని కోట్లు సంపాదించావో తెలియదా? బ్లాక్ మనీ హెరిటేజ్ లో పెట్టి లాభాలను చూపిస్తున్నావని ఆయన చంద్రబాబుపై ఆరోపణ చేశారు. సుద్ద పూసల మని చెప్పుకుంటాడని అన్నారు. "చంద్రబాబును నాశనం చేయమని వేంకటేశ్వరస్వామిని మొక్కుకుంటా. మోకాళ్లమీద తిరుమలకు నడుచుకుంటూ వెళతా. మెట్లమీద నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. దేవుడు నా ప్రార్థన వింటే చాలు. ఎన్టీఆర్‌ ఆశయాలకు తూట్లు పొడుస్తున్న చంద్రబాబును బొందపెట్టాల్సిందే’’ అని మోత్కుపల్లి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: