Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Tue, Sep 25, 2018 | Last Updated 8:17 am IST

Menu &Sections

Search

సీక్రెట్‌ స‌ర్వే ఫ‌లితాల‌తో ఏపీ నేత‌ల్లో టెన్ష‌న్ టెన్ష‌న్‌

సీక్రెట్‌ స‌ర్వే ఫ‌లితాల‌తో ఏపీ నేత‌ల్లో టెన్ష‌న్ టెన్ష‌న్‌
సీక్రెట్‌ స‌ర్వే ఫ‌లితాల‌తో ఏపీ నేత‌ల్లో టెన్ష‌న్ టెన్ష‌న్‌
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
2019లో అధికారం మాదే.. నాలుగేళ్ల‌లో చేసిన అభివృద్ధే మాకు ప్ర‌ధాన అస్త్రంగా ప‌నిచేస్తుంది. మ‌రోపక్క బీజేపీ-జ‌న‌సేన‌-వైసీపీ జ‌ట్టు క‌ట్టార‌నే ప్ర‌చారం కూడా త‌మ‌కు మ‌రింత ల‌బ్ధి చేకూర్చుతుంది` అని టీడీపీ అధినేత చంద్ర బాబుతో పాటు నేత‌లు కూడా ధీమాగా ఉన్నారు. `ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త మాకు పూర్తిగా అనుకూలంగా ఉంది. గ‌త ఎన్నికల్లో ఒక‌డుగు దూరంలో అధికారానికి దూర‌మ‌య్యాం. కానీ ఈసారి అలా కాదు. అధికారం మాదే` అని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్‌సీపీ నేత‌లు మ‌రింద న‌మ్మ‌కంతో ఉన్నారు. `క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ఫ‌లితాల‌లానే ఏపీలోన‌నూ ప‌రిస్థితులు మార‌తాయి. కింగ్ మేక‌ర్ అవుతాం` అని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆశాభావంతో ఉన్నారు. ఇక బీజేపీ ప‌రిస్థితి తెలిసిందే! మ‌రి ఎన్నిక‌ల‌కు ఏడాది ఉన్న స‌మ‌యంలో నాయ‌కుల ఆశ‌లు ఇలా ఉంటే.. ఇప్పుడు సర్వే మాత్రం వీరి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లేలా ఉంద‌ట‌. వీరి అభిప్రాయాల‌కు భిన్నంగా స‌ర్వే ఫ‌లితాలు వెలువ‌డటంతో ఆందోళ‌న నెల‌కొంది.

election-serve-tdp-bjp-congress-ysrcp-jenasena-ap-

ఏపీలో రాజ‌కీయ పార్టీలు స‌ర్వేల బాట ప‌డుతున్నాయి. ఇటీవల కర్ణాటక ఎన్నికల సర్వే కోసం ఢిల్లీ నుంచి వచ్చిన ఓ సర్వే సంస్థ దక్షిణాది రాష్ట్రాల్లో ప్రజల మూడ్‌ ఎలా ఉందో తెలుసుకునేం దుకు ఆంధ్రప్రదేశ్‌లో సర్వే నిర్వహించింది. ఇందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయట! ముఖ్య మంత్రి చంద్రబాబు పనితీరుకు మంచి మార్కులే ప‌డ్డాయ‌ట‌. చంద్రబాబు బాగా కష్టపడుతున్నారని భావిస్తున్నార‌ట‌. రాజధాని నిర్మాణం ఇంకా ప్రారంభం కాకపోవడంపై ప్ర‌జ‌ల్లో అసంతృప్తి ఉంద‌ట‌. ఇక ఎమ్మెల్యేల అవినీతిపై చాలా మంది పెదవి విరిచారు. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చకచకా జరిగే వని.. ప్రస్తుతం పనులు జరగకపోగా.. అవినీతి పెరిగిపోయిందని నిరసన వ్యక్తం చేశారు. కొన్ని ప్రధాన నగరాల్లో ప్రజా ప్రతినిధుల పనితీరుపై సర్వేలో అసంతృప్తి వ్యక్తమైందట‌.
election-serve-tdp-bjp-congress-ysrcp-jenasena-ap-
ఇక‌ ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించడాన్ని చాలామంది తప్పుపట్టారట‌. జగన్‌ పాదయాత్ర నిర్వహించిన మార్గాల్లోనూ సర్వే జరిపింది. తాను అధికారంలోకి వస్తే పెన్షన్లు పెంచుతానని, అర్హత వయసును 45 ఏళ్లుగా చేస్తానని జగన్‌ చెప్పిన మాటలు పేదవర్గాల్లోకి వెళ్లాయని సర్వేలో తేలింది. బీజేపీతో క‌లిసి ముందుకెళ‌తార‌న్న ప్ర‌చారం నేప‌థ్యంలో జగన్‌కు గత ఎన్నికల్లో మద్దతు ఇచ్చిన వర్గాల్లో ముఖ్యంగా ముస్లింలలో కొంత మార్పు కనిపిస్తుందని స్పష్టమైంద‌ట‌. హోదా కోసం జగన్ చేస్తున్న పోరాటం గురించి ప్రస్తావించగా.. అందరూ చేస్తున్నారుగా అన్న సమాధానం వచ్చిందట! ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న వారు మాత్రం ప్రస్తుత పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నార‌ట‌. జగన్‌ పాదయాత్రలో స్థానిక సమస్యలను ప్రస్తావించకుండా చంద్రబాబును తిట్టేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని పలువురు వ్యాఖ్యానించినట్టు సర్వే చెబుతోంది.

election-serve-tdp-bjp-congress-ysrcp-jenasena-ap-

ఇక‌ జనసేనపార్టీ గురించి ప్రస్తావించగా.. పవన్‌ ఇంకా పూర్తిస్థాయిలో రాలేదు కదా అని కొందరు.. ఆయన ఇంకా ప్రశ్నించాలని మరికొందరు వ్యాఖ్యానించారు. సర్వే జరిగిన సమయానికి పవన్‌ బస్సుయాత్ర ఇంకా ప్రారంభం కాలేదు. కేంద్రంపై ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర వ్యతిరేకత ఉందని సర్వేలో తేలింది. ఈ సర్వే ఫలితాలు బయటికి రాకపోయినప్పటికీ, రెండు పార్టీల్లో ఉన్న కొంతమంది అగ్రనేతలకు మాత్రం తెలిసింద‌ట‌. కొంతమంది ఎమ్మెల్యేల అవినీతి, ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిపై తెలుగుదేశంపార్టీ నేతలకు తెలిసినా నిమ్మ‌కుండిపోతున్నార‌ట‌. చంద్రబాబుపై ఉన్న సానుకూలత తమను కాపాడుతుందని నేతలు భావిస్తున్నారట‌. ప్ర‌స్తుతం ఈ స‌ర్వే అన్ని పార్టీల నేత‌ల‌ను టెన్ష‌న్ పెడుతోంద‌ట‌. 


election-serve-tdp-bjp-congress-ysrcp-jenasena-ap-
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
అధికార లాంఛనాలతో..కిడారి, సోమ అంత్యక్రియలు పూర్తి..!
‘థగ్స్ ఆఫ్ హిందోస్థాన్’ఫిరంగీగా అమీర్ ఖాన్!
చంద్రుడిలో..సాయినాథుడు..ఫోటో వైరల్!
త్వరలో ఘంటసాల బయోపిక్!
ప్రజల ఆశిస్సులే..నా బలం! : వైఎస్ జగన్
కన్నడ హీరో అరెస్ట్..రచ్చ చేస్తున్న ఇద్దరు భార్యలు!
జగ్గారెడ్డికి  బెయిల్ మంజూరు!
హిమాచల్ లో వరద బీభత్సం..వరదల్లో కొట్టుకుపోయిన బస్సు!
ప్రణయ్ విగ్రహ ఏర్పాటు చేయాలి..లేదంటే నిరసన చేస్తా!
అమీర్ పేట - ఎల్బీ నగర్ మెట్రో పరుగులకు సిద్దం!
ప్రణయ్ విగ్రహా ఏర్పాటు పై వెల్లువెత్తిన నిరసనలు!
సిక్స్ ప్యాక్ తో అఖిల్..ఎవరి కోసమే తెలుసా!
హాలీడే ట్రిప్ కి వెళ్లిన సమంత జంట!
జుట్టురాలుట - తెల్లజుట్టు - చుండ్రు నివారణకు ఉపాయం
వెరైటీ మొగల్ పాలక్ పన్నీర్
ఫ్లిప్ కార్ట్ వినియోగదారులకు శుభవార్త..!
 శాంసంగ్ నుండి అద్భుతమైన ఫీచర్లతో..ఫీచర్లతో రెండు స్మార్ట్ ఫోన్ లను విడుదల!
ఎమ్మెల్యేలపై జేసీ సంచలన వ్యాఖ్యలు!
బిగ్ బాస్ 2:సారి ఎవరికి మూడిందో!
టీఆర్ఎస్ ఎదురు దెబ్బలు షురూ..!
జేసీకి డబ్బు ఇవ్వనందుకే ఇలా చేస్తున్నారు..ప్రభోదానందస్వామి ఆరోపణ!
మాలీవుడ్ స్టార్ హీరో తండ్రికాబోతున్నాడట!
తమిళ టివి నటి ఆత్మహత్యాయత్నం!
బిగ్ బాస్ కి షాక్ ఇచ్చిన కౌశల్!
మంచి మనసు చాటుకున్న బాలీవుడ్ హీరో!
సుమంత్ లుక్ చూసి షాక్ తిన్నా : వెంకటేష్
మాధవి తండ్రి మనోహరాచారి అప్పట్లో పెద్ద ఫ్యాక్షనిస్టు!
About the author

DESIGNING IS MY PASSION AND I LIVE MY PASSION EVERYDAY.