వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత జగన్ చేస్తున్న పాదయాత్రకు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు నీరాజనాలు పడుతున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన అబద్ధపు హామీలతో ప్రజలను మోసం చేయడంతో ప్రజలు జగన్ ని ఎంతగానో నమ్ముతున్నారు ఇచ్చిన మాట మీద నిలబడే నాయకుడు అంటూ ప్రజలు జగన్ గురించి మాట్లాడుతున్నారు. అయితే మరోపక్క చంద్రబాబు చేసిన మోసాలను జగన్కి వివరిస్తూ వచ్చే ఎన్నికలలో కచ్చితంగా చంద్రబాబుకి తగిన బుద్ధి చెబుతామని అంటున్నారు ప్రజలు.
Image may contain: 9 people, outdoor
మరో పక్క రాష్ట్రంలో వైసీపీకి కలుగుతున్నా ప్రజాదరణ చూసి  చాలామంది ప్రముఖ రాజకీయ నాయకులు మాజీ నాయకులు వైసీపీ పార్టీలోకి జాయిన్ అవడానికి తెగ ఉత్సాహం చూపుతున్నారు. అలాగే అధికార పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వైసీపీలోకి రావడానికి ఇప్పటికే చాలామంది ఉన్నట్లు వైసీపీ నాయకులు చెబుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల విజయసాయిరెడ్డి మంత్రి గంటా శ్రీనివాసరావు తమకి టచ్ లో ఉన్నట్లు త్వరలో పార్టీలోకి రాబోతున్నట్లు సంచలన కామెంట్ చేశారు.
Image may contain: 9 people, people standing and outdoor
ఇదిలావుండగా ప్ర‌స్తుత టీడీపీ ఎమ్మెల్యేలు కూడా జ‌గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు సిద్ద‌మ‌య్యార‌ని తెలుస్తోంది. అయితే ఈ వ‌రుస‌లో క‌ర్నూల్ జిల్లా బ‌న‌గాన‌ప‌ల్లెకు చెందిన బీసీ జ‌నార్థ‌న రెడ్డి ముందంజ‌లో ఉన్నారు. ఈయ‌న 2014లో టీడీపీ త‌ర‌పున పోటీ చేసి గెలిచినా కూడా పార్టీ త‌ర‌పున చంద్ర‌బాబు ఎలాంటి గుర్తింపు ఇవ్వ‌లేదు. దీంతో బీసీ జ‌నార్థ‌న రెడ్డి, చంద్ర‌బాబుపై అసంతృప్తితో ఉన్నారు.
Image result for tdp ysrcp
అందుకే  చంద్ర‌బాబు నిర్వ‌హించిన మినీ మ‌హానాడు స‌భ‌ను కూడా ఈ నియోజ‌కవర్గంలో ఇంత వ‌ర‌కూ ఏర్పాటు చేయ‌లేదు. ఈయన కాక ఇంకా చాలామంది అసంతృప్తి నేతలు అలాగే రాజకీయంగా ఎదగాలి అని అనుకుంటున్నా చాలా మంది టీడీపీ నాయకులు వైసీపీలోకి రావడానికి రెడీగా ఉన్నారట అయితే జగన్ సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం అని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: