తమ బాధలు కష్టాలు తెలియజేస్తున్న ప్రజలపై పోలీస్ జులుం ఇంత ఘోరంగా ఉందా..తూత్తుకుడిలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన  రజనీకాంత్ ఆగ్రహంగా మాట్లాడిన మాటలు ఇవి.  తూత్తుకుడిలో బాధిత కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన  రజనీకాంత్. పోలీసుల కాల్పులను తీవ్రంగా ఖండించిన రజనీకాంత్. బాధితులకు తాను అండగా ఉంటానని చెప్పిన రజనీ, 'కాలా' ప్రమోషన్ నిమిత్తం ముందుగా అనుకున్న హైదరాబాద్, ముంబై టూర్ ను రద్దు చేసుకున్నారు. 
Image result for తూత్తుకుడి రజినీ
'స్టెరిలైట్‌ ఆందోళనకు రాజకీయాల్ని కలిపి, ప్రభుత్వం ఇంటలిజెన్స్‌‌ డిపార్ట్‌మెంట్‌ను దుర్వినియోగం చేసింది. భద్రతా బలగాలు క్రూరంగా ప్రవర్తించడాన్ని నేను ఖండిస్తున్నా. తమ ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా' అని రజనీ పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియోను ట్విట్టర్‌లో స్పందించారు.   కాగా, తూత్తుకుడిలో స్టెరిలైట్‌ కాపర్‌ కర్మాగారంతో పరిసరాల్లో జలాలు కలుషితం అవుతున్నాయని, దీన్ని మూసివేయాలని గత కొన్ని రోజులుగా స్థానికులు ఆందోళనలు చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో మంగళవారం చుట్టుపక్కల ఉన్న దాదాపు 20 గ్రామాలకు చెందిన సుమారు 20 వేల మంది ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపుతప్పేలా కనిపించడంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. అనంతరం పోలీసులు కాల్పులు జరపగా 12 మంది మృతి చెందారు. మరో 60 మందికిపైగా గాయడాపడ్డారు.

అయితే తుత్తుకూడి ఘటన బాధితులను పరామర్శించడానికి వెళ్లిన స్టెరిలైట్‌ ఆందోళనలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మక్కల్‌ నీధి మయ్యమ్‌ పార్టీ అధినేత, తమిళ నటుడు కమల్‌హాసన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 144 సెక్షన్‌ అమల్లో ఉండగా.. నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కమల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: