పవన కళ్యాణ్ పోరాట యాత్రలో భాగంగా చేసిన కామెంట్స్ నిజంగా జనాలకు నవ్వే తెప్పించే విధంగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ మరియు కాంగ్రెస్ కలిసి పోటీ చేయబోతోందని అన్నాడు. అస్సలు ఈ రెండు పార్టీ లు కకలిసి పోటీ చేయడం ఏంటి ఎవరికీ అర్ధం కాలేదు. ఇందులో మర్మమేమిటో పవన్ గారికే తెలియాలి. ప్రజలకు అర్ధం కాక అయోమయం లో పడిపోయారు. 

Image result for pavan an dlokesh

ఎంత తను అధికారంలోకి వస్తాను అనే కాన్ఫిడెన్స్‌తో ఉంటే మాత్రం.. తనను ఎదుర్కొనడానికి ఆ పార్టీలన్నీ కలిసిపోతున్నాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించడం ఏమిటో. పవన్ కల్యాణ్ బొత్తిగా ప్లాన్ లేకుండా జనాల్లోకి పోతున్నాడని.. కొంతమంది అంటుంటే ఏమో అనుకున్నాం కానీ, ఈ మాటలు వింటుంటే మాత్రం పవన్ ఏం చెప్పదలుచుకున్నాడో ఆయనకు కూడా క్లారిటీ లేదని అనుకోవాల్సి వస్తోంది.

Image result for pavan an dlokesh

లేకపోతే... తెలుగుదేశం, వైసీపీలు కలిసి పోటీ చేస్తాయని అనడం ఏమిటో, కాంగ్రెస్ కూడా వారితో కలుస్తుందని అనడం ఏమిటో! పవన్ అలా నవ్వించింది చాలదన్నట్టుగా లోకేష్ బాబు మహానాడు వేదిక మీద తానున్నాను అని చేతులెత్తాడు. వచ్చే ఎన్నికల్లో వైకాపాను కాదు.. ఏపీలో బీజేపీని ఎదుర్కొందాం అని లోకేష్ పిలుపునిచ్చాడు. ఈ మేరకు సన్నద్ధం కావాలని తన శ్రేణులకు ఉద్బోదించాడు లోకేష్ బాబు. అవతల చంద్రబాబేమో బీజేపీకి ఏపీలో ఒక్క శాతం ఓటు బ్యాంకు లేదని అదే మహానాడు వేదిక మీద అన్నాడు. లోకేష్ బాబేమో వైకాపా కాదు బీజేపీనే ప్రధానప్రత్యర్థి అంటున్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: