రాయలసీమ లో జగన్ కు తిరుగులేని ఓటు బ్యాంకు ఉంది. అది ఎవరు కాదనలేని సత్యం రాయలసీమ మొత్తం క్లీన్ స్వీప్ చేయగల సత్తా ఉన్న నాయకుడు అయితే కోస్తా లో కొంచెం ఓట్ల బలం తక్కువగా ఉందని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ రంగం లోకి దిగడం తో కోస్తా లో ఎక్కువగా ఉన్న సామాజిక వర్గం అతనికి ప్లస్ గా మారనున్నది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో కాపు ఓట్లు పడే అవకాశం ఉంది. 

Image result for jagan and pavan and chandra babu

అయితే పవన్ కు ఇప్పుడిప్పుడే పవన్ కు కాపుల మద్దతు అవసరం క్లియర్ అవుతున్నట్లు కనిపిస్తోంది. తను ఓ బలమైన నిర్ణయాత్మక శక్తిగా ఎదగడం అవసరం. పవన్ అలా ఎదగాలి అంటే మిగిలిన సామాజిక వర్గాల మద్దతు కూడా కావాలి. కానీ అంతకు ముందుగా స్వంత సామాజిక వర్గ దన్ను కావాలి. అది గమనించినట్లున్నారు. ప్రసంగాల్లో ఆ తేడా కనిపిస్తోంది ఇప్పుడు. కర్ణాటకలో ఎన్నికల ఫలితాల తరువాత పవన్ తన రాజకీయ స్ట్రాటజీలు మార్చుకున్నట్లు కనిపిస్తోంది.

Image result for jagan and pavan and chandra babu

మొత్తం ఆంధ్రప్రదేశ్ మీద కాన్సన్ ట్రేట్ చేయడం కన్నా, కోస్తా బెల్ట్ మీద దృష్టి పెట్టడం అవసరం అన్నట్లు కనిపిస్తోంది. దీని వల్ల రెండు ప్రయోజనాలు నెరవేరుతాయి. ఒకటి కాపు సామాజిక వర్గం ఎక్కువగా వున్న చోట్లా దృష్టి పెట్టడం, రెండవది చంద్రబాబుకు బలంగా వున్న చోట్ల, ఢీకొట్టి ఆయన విజయావకాశాలు కొంతయినా దెబ్బతీయడం. రాయలసీమలో జగన్ కాస్తయినా బలంగా వున్నారు. కోస్తా జిల్లాలతో పోల్చుకుంటే. ఇప్పుడు కోస్తాలో పవన్ దృష్టి పెట్టారు. అంటే చంద్రబాబు అటు సీమలో జగన్ ను, ఇటు ఆంధ్రలో పవన్ ను ఎదుర్కోవలసి వస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: