మాజీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తిరుమల తిరుపతి దేవస్థానంపై ఇటీవల వచ్చిన వార్తలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో దివంగత నేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆలయాలకు అర్చకులకు ఎంతో ప్రాధాన్యతనిచ్చేవారని పేర్కొన్నారు. ఈ క్రమంలో అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన కామెంట్ల గురించి వివరిస్తూ...తిరుమల కు చెందిన ఏడు కొండల్లో రెండు కొండలను YS చర్చి కి ఇచ్చేసాడు అని ప్రచారం చేసారు బాబు మనుషులు.
Image result for undavalli arun kumar
దానితో అసలు నేను చర్చికి ఇవ్వడం ఏమిటి అని మొదటిసారిగా YS రాజశేఖర్ రెడ్డి ఏడు కొండలు వెంకటేశ్వర స్వామికే చెందుతాయి అని GO ఇచ్చి బాబు నోరు మూయించాడు , అంతకుముందు అలాంటి GO లు లేవు. అంతేకాకుండా ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు చెప్పినట్టుగా వంటశాలలో తవ్వకాలు జరిపిన ఫోటోలను చాల మంది నాకు వాట్సాప్ ద్వారా పంపారు, సిబిఐ విచారణ జరిగితే నిజాలు బయటకి వస్తాయి అని అన్నారు.
Related image
ఇంకా ఆయన చంద్రబాబుపై ఆయన అనుసరిస్తున్న ధోరణి పై మండిపడ్డారు. రాష్ట్రంలో చేస్తున్న అవినీతి కార్యక్రమాలపై కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబు ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
Related image
జీవనాడి ప్రాజెక్టు అయిన పోలవరం విషయంలో పనులు జరగకముందే బిల్లు పెట్టి డబ్బులు ధోచేశారని అన్నారు ఉండవల్లి. మరియు అదేవిధంగా రాబోయే ఎన్నికలలో పోటీచేసే రాజకీయ నేతలు కచ్చితంగా పోలవరం ప్రాజెక్టును  ఎవరు పూర్తి చేస్తానంటారో వారు ఎన్నికల ముందే లికిత పూర్వమైన స్పష్టమైన హామీ ఇవ్వాలని అన్నారు ఉండవల్లి.


మరింత సమాచారం తెలుసుకోండి: