జేసీ దివాకర్ రెడ్డి ఎక్కడుంటే అక్కడ ఒక ప్రత్యేకమైన వాతావరణం ఉంటుంది. ఆయన ఏం చెప్పినా కుండబద్దలు కొట్టినట్టు చెప్తుంటారు. చిన్నవాడైనా, పెద్దవారైనా ఆయన తీరు మాత్రం మారదు. తప్పుంటే తప్పని, ఒప్పయితే ఒప్పని అందరి ముందూ ఓపెన్ గా చెప్పేస్తుంటారు. ఆయన మాటలు కొంతమంది ఇబ్బంది కలిగించినా ఆయనేం పట్టించుకోరు. తప్పు జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకోవడం కరెక్ట్ కాదనేది జేసీ పద్ధతి.


          విజయవాడలో జరిగిన మహానాడులో జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మూడోరోజు చివర్లో మాట్లాడిన జేసీ.. స్టార్ ఆఫ్ మహానాడుగా మిగిలిపోయారు. చంద్రబాబు తప్పొప్పులను వేదికపై బాహాటంగా ప్రకటించిన జేసీ.. టాక్ ఆఫ్ స్టేట్ గా మారారు. చంద్రబాబు పాలనలో తప్పొప్పులపై ఓపెన్ గా చర్చించేంత ధైర్యం ఎవరికీ ఉండదు. కానీ జేసీకి ఆ ధైర్యముంది. అందుకే మైక్ అందుకోగానే ప్రతిపక్షం మొదలు అధికారపక్షం వరకూ ఎవర్నీ వదలకుండా దుమ్ము దులిపేశారు. జగన్ పై ఎప్పుడూ అంతెత్తుకు లేచే జేసీ.. ఈసారి కూడా మావాడు మావాడు అంటూ కడిగిపారేశారు. అదే సమయంలో చంద్రబాబు పాలనలోని లోటుపాట్లను కూడా జేసీ ఎత్తి చూపారు.

Image result for jc diwakar reddy

          జేసీ ప్రధానంగా ప్రస్తావించిన అంశం జన్మభూమి కమిటీలు. జన్మభూమి కమిటీలవల్ల పార్టీ ప్రతిష్ట మంటగలుస్తోందని, పల్లెల్లో ఈ కమిటీలు చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావని జేసీ కుంటబద్దలు కొట్టారు. వెంటనే ఈ కమిటీలను రద్దు చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అంతేకాదు.. టెలికాన్ఫరెన్స్ లను కలెక్టర్లకు మాత్రమే పరిమితం చేసుకోవాలని సూచించారు. చిన్న అధికారులతో కూడా మీరే టెలికాన్ఫరెన్స్ లు నిర్వహించడం సరికాదన్నారు. అంతేకాదు.. మీ లోటుపాట్లను మనోళ్లు ఎవరూ మీ దృష్టికి తీసుకు రావడం లేదన్నారు. అందరూ చప్పట్లు కొట్టేవారేనన్నారు. అయితే అవి నిజమైన చప్పట్లు కాదని హెచ్చరించారు. జేసీ మాటలతో చంద్రబాబు కూడా ఏకీభివంచినట్లే తెలుస్తోంది.

Image result for jc diwakar reddy

          జేసీ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకున్న చంద్రబాబు.. వెంటనే చర్యలకు ఉపక్రమించారు. ఇకపై వీడియో కాన్ఫరెన్స్ లను వారానికోసారి మాత్రమే నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. ఇక జన్మభూమి కమిటీల పాత్రను పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల లబ్దిదారుల ఎంపిక నుంచి జన్మిభూమి కమిటీలను తప్పిస్తున్నట్టు ప్రకటించారు. దీంతో జేసీ సూచన పాటించినట్లయింది. వాస్తవానికి జన్మభూమి కమిటీలపై చాలాకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో ఓడిపోతే జన్మభూమి కమిటీలదే ఆ బాధ్యత అని చాలామంది చెప్తూ వస్తున్నారు. కనీసం ఇప్పటికైనా చంద్రబాబు మేల్కోవడం కాస్త ఊరట కలిగించే అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: