దేశంలోని 4పార్లమెంట్, 11అసెంబ్లీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉపేన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు నేడు (గురువారం) కొనసాగుతోంది. నాలుగు పార్లమెంట్ స్థానా ల్లో ఒకే ఒక్క స్థానంలో బిజెపి ఆధిక్యంలో ఉండగా, మిగిలిన మూడు స్థానాల్లో ఆర్ఎల్డీ, ఎన్‌డిపిపి, ఎన్సీపీ ఆధిక్యంలో నిలిచారు. 


ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని కైరానా పార్లమెంట్ స్థానంలో బిజెపికి షాకిస్తూ ఆర్‌ఎల్డీ అభ్యర్ధి 60000 ఓట్ల  ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.  ఆర్‌ఎల్డీ అభ్యర్ధి తబస్సుమ్‌ హసన్‌ తన సమీప బిజెపి అభ్యర్ధిపై అతిపెద్ద ఆధిక్యత ప్రదర్శిస్తున్నారు.
Image result for by elections kairana

మహారాష్ట్రలోని భండారా-గోండియాలో బీజేపీ-ఎన్సీపీ మధ్య హోరా హోరా పోటీ నడుస్తుంది. ప్రస్తుతం ఎన్సీపీ ఆధిక్యంలో ఉంది

11అసెంబ్లీ స్థానాల్లో 2స్థానాల్లో మాత్రమే బిజెపి ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 4స్థానాల్లో, ఇతరులు 5స్థానాల్లో ఆదిక్యంలో ఉన్నారు. మేఘాలయ రాష్ట్రంలోని అంపటి స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్ధి విజయం సాధించారు. 

పశ్చిమ బెంగాల్ లోని మహేస్థల లో టీఎంసీ విజయం సాధించింది. సీపీఎంను నెట్టివేసి బిజెపి రెండో స్థానంలో నిలిచింది. మహరాష్ట్ర లోని పాలస్-కడేగావ్ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది. కర్ణాటక లోని రాజరాజేశ్వరీనగర్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.కేరళ రాష్ట్రంలోని చెంగన్నూరు లో సీపీఎం విజయం సాధించింది.

ఎంపీ స్థానాల్లో ఆధిక్యంలో ఉన్న పార్టీలు

కైరానా (యూపీ): ఆర్‌ఎల్డీ
పాల్ఘడ్(మహరాష్ట్ర): బిజెపి
భండారా-గోండియా(మహారాష్ట్ర): ఎన్‌సీపీ
నాగాలాండ్(నాగాలాండ్): ఎన్‌డిపిపి

అసెంబ్లీ స్థానాల్లో అధిక్యంలో ఉన్నపార్టీలు

రాజరాజేశ్వరి నగర్ (కర్ణాటక): కాంగ్రెస్ విజయం
నూర్పూర్(యూపీ): సమాజ్‌వాదీ పార్టీ
మహేస్థల(బెంగాల్): టీఎంసీ విజయం
పాలస్ కడేగావ్(:మహారాష్ట్ర) కాంగ్రెస్ విజయం
చెంగన్నూర్(కేరళ): సీపీఎం విజయం
ఆంపటి(మేఘాలయ): కాంగ్రెస్ విజయం
షాకోట్(పంజాబ్):కాంగ్రెస్ విజయం
జోకిహట్(బీహార్): ఆర్జేడీ
గోమియా(జార్ఖండ్) ; బిజెపి
సిల్లీ(జార్ఖండ్):ఎజెఎస్‌యూ
తరలి(ఉత్తరాఖండ్):కాంగ్రెస్

Image result for by elections kairana

మరింత సమాచారం తెలుసుకోండి: