నిన్న వెలువడ్డ దేశ వ్యాప్త ఉపేన్నికల పలితాలు బిజెపి గుండెల్లో రైళ్ళు పరుగెత్తించేవే. ముఖ్యంగా 56అంగుళాల విస్తృత చాతీ ఉన్న భారత ప్రధాని నరెంద్ర మోడీ బయట గంభీరత ప్రదర్శించినా అంతరాంతరాల్లో అగ్నికీలలు చెలరేగుతూ ఉండవచ్చు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కరలేదు. నరెంద్రమోదీ ప్రభంజనంతో 2014 లోక్‌సభ ఎన్నికల్లో స్వయంగా 282 స్థానాలతో పటిష్టంగా కనిపించిన భారతీయ జనతా పార్టీ 2018 వచ్చేసరికి తన స్వంత స్థానాలను 271 పరిమితం చేసుకుంది. 
Image result for karnataka government formation
ఊత్తరప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు యోగి ఆదిత్యనాథ్, ఉపముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరిం చేందుకు కేశవ్ ప్రసాద్ మౌర్య తమ లోక్-సభ సభ్యత్వాలకు  (ఎంపి పదవులకు) రాజీనామాలు చేశారు. ఆ తర్వాత ఆ స్థానాల లో ఆరునెలల కాలంలోనే ఓటమి పొంది పరువు పోగొట్టుకున్నారు. ఆ స్థానాలను తిరిగి నిల బెట్టుకోలేకపోయారు.వినోద్ ఖన్నా  మరణించడంతో ఖాళీ అయిన లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ స్వంతం చేసుకొంది. ఇలా వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన పది లోక్‌సభ స్థానాలను బీజేపీ కోల్పోవడం ఆ పార్టీ శ్రేణులను కలవరపరుస్తోంది. కేంద్రంలో ఉన్నది బిజెపి నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కావడంతో నరెంద్ర మోదీ ప్రభుత్వానికి ఇప్పటికిప్పుడు వచ్చిన గండం ఏమీలేదు.  కానీ బిజెపి స్వంత బలం  మ్యాజిక్ మార్క్ కిందకు దిగజారటం కమలనాథులకు ధారుణ మానసిక సంక్షోభానికి కారణం కావచ్చు. 
Image result for united opposition of all regional parties to check modi sweep
మరోవైపు నరెంద్ర మోదీని కాస్త బలంగానే “ఢీ” కొట్టేందుకు ముఖ్యంగా ప్రాంతీయ ప్రతిపక్షాలన్నీ కాంగ్రెస్ ను కలుపుకొని ఐఖ్యమవటంతో రాజకీయ సమీకరణాలు శరవేగం గా రూపాంతరం చెందుతూ పూర్తిగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికల్లో మోదీని “ఢీ” కొట్టేందుకు ప్రాంతీయ పార్టీలు, కాంగ్రెస్, వామపక్షశక్తులు భారీ నుంచి అతి భారీ ప్రణాళిక రచిస్తున్నాయి. ఇందులో వారు కర్ణాటకలో విజయం సాధించారు. నేడు ఉత్తరప్రదేశ్ కైరానా నియోజక వర్గంలో కాంగ్రెస్ తో కలిసి ప్రాంతీయ పార్టీలు నిలబెట్టిన రాష్ట్రీయ జనత దళ్ అభ్యర్ధి తబస్సుం హసన్ దాదాపు 60000 ఓట్ల ఆధిఖ్యతతో గెలవటం బిజెపి గుండెల్లో పిడుగు పడేసింది.  
Image result for kairana bypoll
తాజా ఉపఎన్నికల్లో ఫలితాలు ప్రతిపక్షాల ఐక్యత అవసరం ఎంతో తెలుపుతూ,  దానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. యూపీ సహా అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ, స్థానిక ప్రాంతీయ పార్టీలు కూటమిగా ఏర్పడటం లేదా స్థానికంగా సర్దుబాటు చేసుకోవడం ద్వారా 2019లో నరెంద్ర మోదీ ప్రభుత్వ ఏర్పాటును ఎదుర్కోవాలని ప్రాంతీయపార్టీలతో కూడిన ప్రతిపక్షాలు మరియు కాంగ్రెస్ తో కలసి యోచిస్తున్నాయి. 
Image result for kairana bypoll
ఇదే జరిగితే బీజేపీకి గట్టి సవాలు ఎదురైనట్లే.  2014లో నరెంద్ర మోదీ ప్రభంజన ప్రభావంతో ఉత్తరాదిలోని అనేక రాష్ట్రాల్లో బీజేపీ నూరు శాతం లోక్ సభ స్థానాలు దక్కించు కుంది. ప్రాంతీయ పార్టీల సమాఖ్య లేదా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుచెస్తే త్రిముఖ చతుర్ముఖ పోటీలనునివారించి 2019లో అలాంటి పరిస్థితులు ఏర్పడకుండా చూడొచ్చని ప్రతిపక్షాలు తాజా "కైరానా" ఉపఎన్నికతో  నిరూపించాయి. ఎన్నికల గణాంకాల్లో ఆరితేరిన నరెంద్రమోదీ, అమిత్ షా ప్రతిపక్షాల ఐక్య చాలంజ్ ను ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

Image result for united opposition of all regional parties to check modi sweep

మరింత సమాచారం తెలుసుకోండి: