జనసేన పార్టీ 175 స్థానాల్లో పోటీ చేస్తుందని పవన్ కళ్యాణ్ ఇది వరకే ప్రకటించింది. అయితే 175 స్థానాల్లో పోటీ చేయడానికి అస్సలు అభ్యర్థులు  దొరుకుతారా అన్నదే ప్రశ్న..! ఇప్పటికే టీడిపి మరియు వైసిపి రూపం లో బలమైన పార్టీలు.  ఆ పార్టీల నేతలను తట్టుకొని గెలవడం అంటే అంత ఈజీ వ్యవహారం కాదు. అయితే కొత్త వారికి పార్టీ టికెట్ ఇస్తే మొదటికే మోసం వస్తుంది. 

Image result for pavan kalyan janasena]

ఇదిలా ఉంటే, అస‌లు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్క‌డి నుంచి పోటీ చేస్తాడ‌న్నది కూడా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కు అర్థం కావ‌డం లేదు.గ‌తంలో ప‌వ‌న్ చెప్పిన‌ట్లుగా అనంత‌పురం జిల్లా నుంచి పోటీ చేస్తాడా లేక ఉద్ధానం బాధితుల కోసం పోరాడుతున్నందున శ్రీకాకుళం జిల్లా నుంచి బ‌రిలో దిగుతాడా అన్న‌ది తేలాల్సి ఉంది.అయితే మొన్న‌టివ‌ర‌కు ప‌వ‌న్ అనంత జిల్లా నుంచి పోటీ చేయాల‌నుకున్నాడు కానీ, ఇప్పుడు ఆయ‌న నిర్ణ‌యం మారింద‌ని, శ్రీకాకుళం జిల్లా నుంచే పోటీ చేసే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని ఆ పార్టీ నేత‌లు చెప్తున్నారు.

Image result for pavan kalyan janasena]

అవ‌స‌ర‌మైతే, గ‌తంలో చిరంజీవి మాదిరి ప‌వ‌న్ కూడా రెండుచోట్ల పోటీ చేస్తార‌ని అంటున్నారు. అదే జ‌రిగితే ముందు చెప్పిన‌ట్లుగా అనంత‌పురంతో పాటు శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా బ‌రిలో దిగొచ్చ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు. ఇంత‌కాలం ప‌ద‌వితో ప‌నిలేదు, ప్ర‌శ్నించ‌డ‌మే త‌న‌ప‌ని అంటూ ప‌దేప‌దే చెప్పిన ప‌వ‌న్ ఇప్పుడు ప్ర‌జాపోరాట యాత్ర‌తో త‌న పంథా మార్చిన‌ట్లే క‌నిపిస్తుంది. తాను కూడా జ‌గ‌న్ మాదిరి అధికారం ఉంటేనే ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ చేయొచ్చ‌ని నమ్ముతున్న‌ట్లు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: