దేశవ్యాప్తంగా అప్రతిహత విజయాలు నమోదు చేసుకుంటూ వస్తున్న బీజేపీకి ఉపఎన్నికలు గట్టి షాక్ నే ఇచ్చాయి. ముఖ్యంగా ఉప ఎన్నికల ఫలితాలు మహరాష్ట్ర రాజకీయల్ని ఓ కుదుపు కదిపేశాయి. ఇప్పటికే ఉప్పు, నిప్పులా ఉన్న  బిజేపీ.. శివసేన మధ్య విబేధాల్ని మరింత పెంచేశాయి.  మహరాష్ట్రలో రెండు ఎంపీ సీట్లకు పోటీ జరిగింది. ఈ రెండు సీట్లు బిజేపీవే. అయితే ఒక్క సీటును మాత్రమే బిజేపీ గెల్చుకుంది. మరొకటి ఎన్సీపీ ఎగరేసుకుపోయింది. ఈ ఎన్నికల బరిలో శివసేన, బిజేపీలు విడివిడిగా పోటీ చేశాయి. ఒక చోట బిజేపీ, శివసేనల మధ్యే పోటీ నడిచింది. దీంతో ఈ రెండు పార్టీల మధ్య విబేధాలు తరాస్థాయికి చేరాయి.

Image result for maharashtra electionImage result for maharashtra election

మహరాష్ట్రలో జరిగిన  రెండు పార్లమెంట్ స్థానాల ఉప ఎన్నికల ఫలితాలు.. అక్కడి రాజకీయ సమీకరణాల్ని మార్చేస్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. బిజేపీ, శివసేనల కుమ్ములాటను ఎన్సీపీ బాగానే సొమ్ము చేసుకుంది.  మరోవైపు బిజేపీ, శివసేనల మధ్య విభేదాలు తీవ్ర స్థాయి చేరుకున్నాయి.  ఈ ఎన్నిలక ఫలితాలు బిజేపీకి ఎదురుదెబ్బే. ముఖ్యంగా మహరాష్ట్ర ముఖ్యమంత్రి  దేవేంద్రఫడ్నవీస్ ను ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. మహరాష్ట్రలో రెండు ఎంపీ సీట్లకు ఉపఎన్నికలు జరిగాయి. నిజానికి ఈ రెండు సీట్లు బిజేపీవే. బీజేపీ భండార గొండియాలో ఒడిపోయింది. పాల్ఘర్ ను దక్కించుకుంది.  పాల్ఘర్ విజేత రాజేందర్ మాట్లాడుతూ మోడీ ప్రభుత్వ అభివృద్దే తనను గెలిపించిందన్నారు.

Image result for maharashtra election

2014 ఎన్నికల్లో బిజేపీ, శివసేన కలిసి పోటీ చేశాయి. అప్పట్లో ఈ రెండు స్థానాలను బిజేపీ సొంతం చేసుకుంది. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. బిజేపీ, శివసేనల మధ్య పోటీ తీవ్రం కావటడంతో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఇద్దరి కుమ్ములాట ఫలితంగా ఎన్సీపీ భండార గోండియా స్థానాన్ని సులభంగా గెల్చుకుంది. పాల్ఘర్ లో బిజేపీ, శివసేనల మధ్యే ప్రధానంగా పోటీ నడిచింది. అక్కడ ఓటమిని శివసేన ఏమాత్రం జీర్ణించుకోలేకపోతోంది. ఈవీఎంలలో లోపాల వల్లే తాము ఓడిపోయమని.. దీని వెనుక బిజేపీ కుట్ర ఉందని ఆ పార్టీ అగ్రనేత ఉద్దవ్ ఠాక్రే ఆరోపిస్తున్నారు. పాల్ఘర్ లో బిజేపీని ఓడించి.. తన సత్తా చాటుకోవాలని శివసేన తీవ్ర ప్రయత్నాలే చేసింది. కానీ ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఈ ఆక్రోషం భరించలేక  శివసేన బీజేపీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తోంది. నిజానికి 1989 నుంచి.. బిజేపీ, శివసేనలు మిత్రపక్షాలే. హిందుత్వవాదంతో  మహరాష్ట్రలో తమ ఉనికి చాటుకున్నాయి. ఆ బంధం దాదాపు 25 ఏళ్ల పాటు కొనసాగింది.  2014 ఎన్నికల్లో కూడా ఈ రెండు పార్టీలు కలిసే పోటీ చేశాయి.

Image result for maharashtra election

2016 మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  సీట్ల పంపకాల విషయంలో ఈ రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ  ఎన్నికల్లోనే ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి.  ఆ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి స్థాయి మెజార్టీ రాలేదు. బిజేపీ అతిపెద్ద పార్టీగా, శివసేన రెండో అతిపెద్ద పార్టీగాను అవతరించాయి.  ఈ రెండు పార్టీలు కలిసే ప్రభుత్వాన్ని ఏర్పరిచాయి. ఒకప్పుడు మహరాష్ట్రలో పెద్ద పార్టీగా శివసేన పెత్తనం చెలాయిస్తే.. బిజేపీ దాని జూనియర్ గా అధికారం పంచుకుంది. అయితే 2016లో సీన్ రివర్స్ అయింది. అప్పటి నుంచి ఈ రెండు పార్టీల విభేదాలు అంతకతంతకూ పెరుగుతునే ఉన్నాయి. తాజా ఉప ఎన్నికలతో అవి తారస్థాయికి చేరుకున్నాయి.  అయితే మహరాష్ట్ర ప్రభుత్వంలో శివసేనది కీలక పాత్ర.. శివసేన ప్రభుత్వం నుంచి తప్పుకుంటే అక్కడి సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు బీజేపీ.. ఎన్సీపీ మద్దతు కోసం ఎదురుచూడాల్సి ఉంటుంది. 2016లో  బిజేపీకి మద్దతు ఇచ్చేందుకు ఎన్సీపీ సిద్ధమైంది. అయితే శివసేన.. బీజేపీ బాటలోకి రావటంతో ఆ అవసరం లేకుండా పోయింది. మరి మున్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి..!

మరింత సమాచారం తెలుసుకోండి: