జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలలోకి వచ్చేశారు ఈ క్రమంలో ప్రజాపోరాట యాత్ర అంటూ శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టి రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీ రాజకీయ నేతలపై తనదైనశైలిలో విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా గత ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి అనవసరంగా మద్దతు తెలిపాను అని పశ్చాతాప పడుతున్నారు.

Image may contain: 1 person

తాజాగా పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లాలో పర్యటన ముగించుకుని విజయనగరం జిల్లాలో అడుగుపెట్టిన నేపధ్యంలో పవన్ కళ్యాణ్ అభిమానుల వ్యవహరించిన తీరు అతనికి తలనొప్పిగా మారింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకుంటున్న హోటల్ సమీపంలో పవన్ అభిమానులు వచ్చి నానా రచ్చ చేశారు. .పవన్ కల్యాణ్ బయటకు రావాలంటూ అరుపులు కేకలతో అక్కడున్న ప్రాంతాన్ని హోరెత్తించారు….దీంతో పీకే ఒకసారి వారిని పలకరించి వెళ్లాడు. దూరం నుంచి చేతులు ఊపుతూ వెళ్లాడు…. అయితే అంతటితో అభిమానులు వెనక్కు తగ్గలేదు.

Image may contain: 1 person

పవన్ కల్యాణ్ మళ్లీ రావాలంటూ పట్టుబట్టారు. ఈ సమయంలో ఒక అభిమాని అయితే గోడకు తన తలను కొట్టుకుని నిరసన తెలిపాడు. పవన్ కల్యాణ్ బయటకు వచ్చే వరకూ తన తలను గోడకేసి బాదుకుంటానని అతడు ఆ పని చేశాడు. చివరకు పోలీసులు వారించి అతడిని అక్కడ నుంచి పంపించి వేశారు. అయితే ఇటువంటి సంఘటనలు పవన్ కళ్యాణ్ ప్రతిచోటా ఎదురవుతుండటంతో పవన్..తన అభిమానుల పట్ల కొంత అసహనం చెందినట్లు తెలుస్తుంది.

Image may contain: 2 people, people standing, crowd and outdoor

మరిముఖ్యంగా సామాన్య ప్రజలు తమ గోడును పవన్ కళ్యాణ్ కి చెబుతున్న సమయంలో పవన్ అభిమానులు వ్యవహరిస్తున్న అత్యుత్సాహం జనసేన నాయకులతో పాటు సామాన్య ప్రజానికానికి కూడా చిరాకు పుట్టుకొచ్చింది అని తెలుస్తోంది...ఎంతో కొంత మంది సామాన్య ప్రజలు ఇతడు ఇంకా సినిమా హీరోయేన... రాజకీయనాయకుడు కాదా అని తమలో తాము ప్రశ్నించుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: