సంప్రదాయ నృత్యం సాకుతో ఓ స్కూల్‌ యాజమాన్యం చేసిన పని దక్షిణాఫ్రికాలో తీవ్ర దుమారాన్ని లేపుతోంది. విద్యార్థినులతో నగ్నంగా నృత్యం చేయించిన స్కూల్ యాజమాన్యంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ సిగ్గుమాలిన సంఘటన వల్ల  ప్రతిపక్షాలు అక్కడి ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఘటనతో సీరియస్ అయిన అక్కడి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


వివరాల్లోకి వెళితే దక్షిణాఫ్రికాలోని కేప్‌ ప్రొవిన్స్‌లో గల ఓ స్కూల్‌లో నిన్నటి వారం చోయిర్‌ పోటీలు జరిగాయి. ఈ పోటీలకు ఆ స్కూలు విద్యార్థినులు అందరూ హాజరయ్యారు. ఈ పోటీల్లో పాల్గొన్న విద్యార్థినులు సాంప్రదాయిక ఖ్సోసా నృత్యం చేయడం పలు విమర్శలకు దారితీస్తుంది. నృత్యమే కదా ఇందులో ఏముంది అని అనుకుంటే పొరబాటే! ఖ్సోసా డ్యాన్స్ ప్రకారం అర్ధనగ్నంగా మారి  డప్పులు వాయించుతుంటే వాటికి తగ్గట్టుగా డ్యాన్స్ వేయాలి. 


ఇక వారు నృత్యం చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేమి స్కూలు రా నాయనో అంటూ స్కూలు యజమాన్యంపై ఫైర్ అయ్యారు. అసలే ఆడవారిపై అత్యాచారాలు జరుగుతున్నాయని ఇలాంటి వాటిని నిషేధించింది అక్కడి ప్రభుత్వం. ఇలాంటి సమయంలో ఈ సంఘటన జరగడం ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీంతో ప్రభుత్వం విచారణకు అదేశించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: