Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jan 24, 2019 | Last Updated 5:39 am IST

Menu &Sections

Search

ఎడిటోరియ‌ల్ః వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి, జ‌న‌సేన‌ క‌లుస్తాయా ? కార‌ణ‌మ‌దేనా ?

ఎడిటోరియ‌ల్ః వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి, జ‌న‌సేన‌ క‌లుస్తాయా ?  కార‌ణ‌మ‌దేనా ?
ఎడిటోరియ‌ల్ః వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి, జ‌న‌సేన‌ క‌లుస్తాయా ? కార‌ణ‌మ‌దేనా ?
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
వ‌చ్చే ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీ-జ‌న‌సేన క‌లిసి పోటీ చేస్తాయా ? క్షేత్ర‌స్ధాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తుంటే అంద‌రిలోనూ అవే అనుమానాలు మొద‌ల‌య్యాయి. తాజాగా బిజెపి ఎంఎల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్య‌లు కూడా అంద‌రి అనుమానాల‌కు ఊత‌మిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బిజెపి, జ‌న‌సేన‌లు క‌లిసి పోటీ చేసే అంశం కాల‌మే నిర్ణ‌యిస్తుంద‌న్నారు. అంతేకాకుండా పోయిన ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌ల్లే తెలుగుదేశంపార్టీ చాలా స్ధానాల్లో గెలిచిందంటూ చెప్ప‌టం గ‌మ‌నార్హం. వీర్రాజు మాట‌లు విన్న వారికి వ‌చ్చే ఎన్నిక‌ల్లో రెండు పార్టీల మ‌ధ్య పొత్తుపై క్లారిటీ వ‌స్తోంద‌నే చెప్పాలి. దానికి తోడు చంద్ర‌బాబునాయుడు పై రెండు పార్టీల‌కు కామ‌న్ శ‌తృవ‌న్న విష‌యం గ‌మ‌నించాలి. అందుకే ఇటు బిజెపి నేత‌లు అటు ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌తిరోజు చంద్ర‌బాబుపై ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌ల‌తో హోరెత్తించేస్తున్నారు. 

2019-elections-bjp-pawan-kalyan-alliance-chandraba

చంద్ర‌బాబుకు వ్య‌తిరేకం
రెండు అంశాలు బిజెపి-ప‌వ‌న్ ను ఏకం చేసే అవ‌కాశాలు ఎక్కువుగా ఉన్న‌ట్లు స‌మాచారం. ఒక‌టి రెండు పార్టీల‌కు చంద్ర‌బాబు కామ‌న్ శ‌తృవైతే రెండో అంశం కాపుల ఓట్ల‌లో చీలిక‌ను నివారించ‌టం. మొద‌టి అంశంపై రాష్ట్రంలోని బిజెపి నేత‌లు స్వ‌యంగా ఎప్ప‌టి నుండో యాక్టివ్ గా ఉన్నారు. ఇక, రెండో అంశం మాత్రం బిజెపి జాతీయ నాయ‌క‌త్వం చూసుకుంటుందని స‌మాచారం. అదే విష‌యాన్ని రాష్ట్ర అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా స్ప‌ష్టంగా చెప్పార‌ట‌. కాబ‌ట్టి ప‌వ‌న్ తో పొత్తుల విష‌యాన్ని మాట్లాడాల్సిన అవ‌స‌రం రాష్ట్రంలోని బిజెపి నేత‌ల‌కు లేదు. కాక‌పోతే ప‌వ‌న్ గురించి అన‌వ‌స‌ర‌మైన మాట‌లు, వ్యాఖ్య‌లు చేయ‌కుండా ఉంటే చాలు. జాతీయ నాయ‌క‌త్వం ఆదేశాల ప్ర‌కార‌మే బిజెపి నేత‌లెవ‌రూ ప‌వ‌న్ పై వ్యాఖ్య‌లు చేయ‌టం లేదు. పైగా వీర్రాజు లాంటి నేత‌లు ప‌వ‌న్ కు అనుకూలంగా వ్యాఖ్య‌లు చేయ‌టం కూడా భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకునే అన్న విష‌యం అర్ధ‌మైపోతోంది. 

2019-elections-bjp-pawan-kalyan-alliance-chandraba

ఓట్ల చీలిక నివార‌ణ ల‌క్ష్యం
రెండో అంశ‌మైన కాపుల ఓట్లు చీల‌క చాలా ప్ర‌ధాన‌మైన‌ది. ఎందుకంటే, కాపుల ఓట్ల‌పైనే ప‌వ‌న్ క‌ల్యాణ్ భ‌విష్య‌త్ ఆధార‌డి ఉంటుంది.  ప‌వ‌న్ కు మైన‌స్సైనా ప్ల‌స్సైనా అదే అంశం అన్న విష‌యంలో ఎటువంటి అనుమానం లేదు. మిగిలిన సామాజిక వ‌ర్గాల నుండి ప‌వ‌న్ ఏ మేర‌కు ఓట్లు తెచ్చుకుంటార‌న్న‌ది అనుమాన‌మే. అలాగ‌ని, కాపు సామాజిక‌వ‌ర్గం ఓట్లంతా ప‌వ‌న్ కు గంప‌గుత్త‌గా ప‌డ‌తాయ‌న‌టానికి ఆధారమూ లేదు. కాక‌పోతే అటు టిడిపి ఇటు వైసిపితో పోల్చుకుంటే కాపుల ఓట్లు జ‌న‌సేన‌కు ఎక్కువ ప‌డేందుకు అవ‌కాశాలున్నాయ‌ని అనుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో బిజెపి రాష్ట్ర అధ్య‌క్షునిగా క‌న్నాను ఎంపిక చేయ‌టం వెనుక కాపు నేత అన్న పాయింటే ప్ర‌ధానం. ఎందుకైనా మంచిద‌ని కాపుల ఓట్ల‌లో చీలిక నివారించే ప్ర‌య‌త్నాలు కూడా బిజెపి త‌ర‌పున మొద‌లైంద‌ని స‌మాచారం. 
అయితే, క‌న్నా ఏ మేర‌కు కాపుల ఓట్ల‌ను బిజెపికి మ‌ళ్ళించ‌గ‌ల‌రో కాల‌మే చెప్పాలి. 

2019-elections-bjp-pawan-kalyan-alliance-chandraba

ముద్ర‌గ‌డ పాత్రేంటి ?
వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాపుల‌కు ఎక్కువ సీట్లు సాధించ‌టమే ల‌క్ష్యంగా కాపు ఉద్య‌మ నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం వ్యూహాలు మొద‌లుపెట్టారు. అందులో భాగంగానే తాను మాత్రం పోటీకి దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్నారని స‌మాచారం. క‌న్నా-ముద్ర‌గ‌డ మ‌ధ్య ఉన్న సంబంధాల వ‌ల్ల బిజెపిలో కాపుల‌కు ఎక్కువ సీట్లు సాధించుకునేందుకు ముద్ర‌గ‌డ ప్ర‌య‌త్నిస్తున్నారు. అదే విధంగా కాపుల ఓట్లు బిజెపి వైపు మ‌ళ్ళించటంలో కృషి చేస్తాన‌ని క‌న్నాకు ముద్ర‌గ‌డ హామీ ఇచ్చార‌ట‌.దానికితోడు జ‌న‌సేన కూడా బిజెపితో చేతులు క‌లిపితే అప్పుడు,  క‌న్నా, ప‌వ‌న్, ముద్ర‌గ‌డ ఏక‌మ‌వుతారని బిజెపి వ‌ర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి బిజెపి, ప‌వ‌న్ ల‌ను క‌ల‌ప‌టానికి ప్ర‌య‌త్నాలైతే మొద‌ల‌య్యాయని అర్ధ‌మ‌వుతోంది. కాక‌పోతే ఆ ముహూర్తం ఎప్పుడ‌న్న‌దే స‌స్పెన్స్ ?

2019-elections-bjp-pawan-kalyan-alliance-chandraba


2019-elections-bjp-pawan-kalyan-alliance-chandraba
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
లోకేష్  గాలి తీసేసిన నాగుబాబు పొలిటికల్ సెటైర్లు
టిడిపి, జనసేన పొత్తు ఫైనల్.. మార్చిలో సీట్లపై చర్చలు
ఎడిటోరియల్ : బికాంలో ఫిజిక్స్ కు మొండిచెయ్యి..ఓవర్ యాక్షనే కారణమా ?
ఎడిటోరియల్ : చంద్రబాబు పై కాపుల వ్యతిరేక ప్రచారం..జ్ఞానోదయమైందా ?
వైసిపిలో చేరిన టిడిపి ఎంఎల్ఏ..మేడా సస్పెన్షన్
హోదాకు సంతకాలు తీసుకోగలరా ?
అగ్రవర్ణాల మధ్య చంద్రబాబు చిచ్చు
ఎడిటోరియల్ :  రిజర్వేషన్లపై చంద్రబాబు సరికొత్త మోసం
ఎడిటోరియల్ : జగన్ పై విషం చిమ్ముతున్న మంత్రులు
ఎడిటోరియల్ : వంగవీటికి అంత సీన్ ఉందా ?
ఎడిటోరియల్ : రాధా రాజీనామా ఎఫెక్ట్..బోండాలో టెన్షన్
ఎన్ఐఏ విచారణే..తేల్చేసిన హై కోర్టు
ఎన్ఐఏ విచారణను వ్యతిరేకిస్తు పిటీషన్
వైసిపికి వంగవీటి రాజీనామా
ఎన్ఐఏ కేసులో చంద్రబాబుకు షాక్
 ‘యాత్ర’ బయోపిక్ లో జగన్ ?
సత్తెనపల్లిలో అంబటికి పొగ పెడుతున్నారా ?
‘బ్రీఫింగ్’ తర్వాతే విచారణకు హాజరయ్యారా ?
ఎడిటోరియల్ : ఎన్నికల్లోపు టిడిపిలో కీలక మార్పులు
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.