Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Mon, Sep 24, 2018 | Last Updated 5:19 pm IST

Menu &Sections

Search

మోడీ కి మరో షాక్!

మోడీ కి మరో షాక్!
మోడీ కి మరో షాక్!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com

ప్రజాస్వామ్య ప్రియులెవరూ నియంతృత్వాన్ని భరించలేరు. వెను వెంటనే వరుస వరుసగా ఎన్డీయేలో జరుగుతున్న పరిణామాలు ఋజువు చేస్తున్నాయి. ఆ అలయన్స్ నుండి వైదొలగిన తొలి భాగస్వామి టిడిపి కాగా ఇప్పుడు మ‌రో ముఖ్య భాగ‌స్వామి దూర‌మ‌వనున్నారా?  అయన ఇప్పటికే మోడీ వ్యూహంలో చిక్కుకొని శ్లేష్మంలో పడ్ద ఈగ లాగా కొట్టుకుంటున్నారా? అస‌లు మొదటకే మోసం జరిగిందని గుర్తించారా?

national-news-narendra-modi-chandrababu-naidu-niti

త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం మరెదైనా కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా?

కొద్ది రోజులుగా ఆయ‌న మృదువైన స్వ‌రంలో కరకుదనం హెచ్చినట్లు కనిపిస్తుంది ఆ మార్పులోని అసలు  ఆంత‌ర్య‌మేమిటి?

చూస్తుంటే టీడీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు నడచిన దారిలోనే ఆయ‌న కూడా నడవటానికి సిద్ధమవుతున్నారా?  న‌డుస్తున్నారా?

అంటే ఇటీవ‌ల ఆయ‌న‌ మాట్లాడుతున్న తీరు,  విధానం చూస్తుంటే మాత్రం పరిస్థితులు అలాగే ఉన్నట్లు స‌మాధానం వ‌స్తుంది.

ఇప్పుడు నరెంద్ర మోడీ ఆధిపత్యాన్ని సహించలేక పోతున్నారా? భ‌రించ‌లేక‌పోతున్నారా?

ఇంత‌కీ నరెంద్ర మోడీకి దూర‌మ‌వుతున్న ఆస్నేహితుడెవ‌ర‌ని ఆలోచిస్తున్నారా?

అయితే ఎవ‌రో కాదు, జేడీయూ నేత‌, బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్‌కుమార్‌. నరెంద్ర మోడీకి సమవుజ్జీగా గతంలో ప్రధాని పదవికి పోటీగా ప్రచారంలో నిలిచిన నేటి  బీహార్ ముఖ్యమంత్రి. ముఖ్యంగా ఈయన రాజకీయాలు ఒక పద్దతి ప్రకారం ఉంటాయి. పెడ దొరణులు తక్కువ. అసలే లాలు కుటుం అవినీతి ప్రభుత్వానికి కాన్సర్ లాగా తగులు కునే సమయంలో ఆయన మోడీ తో జతకట్టవలసి వచ్చింది.  ఈ విషయం ప్రధానంగా రాజకీయ విశ్లేషకులకు ఆసక్తి కలిగిస్తుంది.

national-news-narendra-modi-chandrababu-naidu-niti

బిహార్ లో కొంతకాలం క్రితం 'బీజేపీ, జేడీయూల సంకీర్ణం' ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. గత 2014ఎన్నికల్లో 'ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్ మహాకూటమి' గా ఏర్పడి పోటీ చేసి విజయం సాధించి అక్కడ నితీష్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే లాలు ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని ఆర్జేడీ అవినీతిని తట్టుకోలేక నితీష్ కుమార్ చివరకు బిజెపి మాయావలయం లో చిక్కుకున్నారు.  బిజెపి - జెడియు ఒక నాటి మిత్రులే. ఎన్నిక‌ల సంద‌ర్భంగా నరెంద్ర మోడీ బీహార్ ప్ర‌జ‌ల‌కు అనేక హామీలు ఇచ్చారు. వెన‌క‌బ‌డిన బీహార్ స‌మ‌గ్రాభివృద్ధికి ల‌క్ష‌ల‌కోట్లు కేటాయిస్తాన‌ని ఆయ‌న చెప్పారు.

national-news-narendra-modi-chandrababu-naidu-niti

కానీ, నాలుగేళ్లు గ‌డిచినా ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చ‌డంలో ప్ర‌ధాని పూర్తిగా విఫ‌లం చెందార‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చిప‌డుతున్నాయి. కొద్దిరోజుల క్రితం శివ‌సేన ప‌త్రిక 'సామ్నా' లో ఇదే విష‌యంపై ఘాటుగా వ్యాసాలు రాసి స్పందించింది. బీహారీల‌కు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నరెంద్ర మోడీ నెర‌వేర్చ‌లేద‌ని విమ‌ర్శించింది. ఈ క్ర‌మంలోనే నరెంద్ర మోడీ వ్య‌వ‌హార‌శైలిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న‌ట్లు తెలిపింది. ఆయ‌న క్ర‌మంగా కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.


national-news-narendra-modi-chandrababu-naidu-niti

మోడీ ప్ర‌భుత్వం విప్లవాత్మకంగా తీసుకు రాబోతున్న "పౌరసత్వ లేదా సిటిజెన్-షిప్‌ బిల్లు" పై కూడా నితీష్ కుమార్ మండిప‌డ్డారు. ఒక‌వేళ‌ ఈ బిల్లు పార్ల‌మెంటులో చ‌ర్చ‌కు వ‌స్తే వ్య‌తిరేకంగా ఓటు వేసేందుకు తను తన జేడీయూ సిద్ధంగా ఉన్న‌ట్టు మే 17న త‌న‌ను క‌లిసిన‌ 'ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియ‌న్' నేత‌ల‌కు నితీశ్‌కుమార్‌ హామీ ఇచ్చారు. అదేవిధంగా మే 26న ఓ కార్య‌క్ర‌మంలో నితీశ్‌ మాట్లాడుతూ, మొద‌ట‌ 'పెద్ద‌నోట్ల ర‌ద్దు' నిర్ణ‌యాన్ని కూడా త‌ప్పుబ‌ట్టారు. బ‌డాబాబులు ఒక చోటి నుంచి మ‌రో చోటిని డ‌బ్బు ర‌వాణా చేసుకున్నారని, పాత నోట్ల‌ను కొత్త‌గా మార్చుకున్నార‌నీ, పేద‌లు మాత్ర‌మే ఇబ్బందులు ప‌డ్డార‌ని ఆయ‌న‌ వ్యాఖ్యానించారు. ఆ మ‌రునాడే, మే 27న నితీశ్‌కు కేంద్రం షాక్ ఇచ్చింది. తుఫాను బాధితుల స‌హాయం కోసం కేంద్రం ఇస్తామ‌ని చెప్పిన‌ రూ. 1750 కోట్ల‌లో, రూ.500 కోట్ల‌ను త‌గ్గించింది.

national-news-narendra-modi-chandrababu-naidu-niti

ఈ దెబ్బ‌తో మోడీ నితీశ్‌ కుమార్లో అసంతృప్తి మరింతగా రగులుకుంది. అదే క్ర‌మంలో మే 29న బీహార్ కి 'ప్ర‌త్యేక హోదా' కావాలంటూ ఆయ‌న స్వరంలో ఘాటు పెంచుతూ పాత డిమాండ్ నే మ‌ళ్లీ వ్యక్తం చేశారు. గ‌తంలో ఆయ‌న ఈ డిమాండ్ చేసినా, ఎన్డీయేతో మైత్రితో మ‌రిచిపోయారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న మ‌ళ్లీ ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ ను ముందుకు తెచ్చారు. వెన‌కబ‌డిన రాష్ట్రాల‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

national-news-narendra-modi-chandrababu-naidu-niti

ఇప్ప‌టికే ఎన్డీయే నుంచి శివ‌సేన బయటకు వచ్చినట్లే వాకిట్లో నిలబడి ఉంది. టీడీపీ ఎన్టీఏ నుంచి తప్పుకుంది. ఈ రెండు పార్టీలూ నరెంద్ర మోడీ తీరుపై భ‌గ్గుమంటు న్నాయి. ఇదే స‌మ‌యంలో బీజేపీ యేతర పార్టీలన్నీ జాతీయ స్థాయిలో ఏక‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే బీహార్ ముఖ్య‌మంత్రి నితీశ్ కుమార్ కూడా తన జెడియూతో సహా బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు సిద్దమౌతున్నట్లు సమాచారం.

 national-news-narendra-modi-chandrababu-naidu-niti

national-news-narendra-modi-chandrababu-naidu-niti
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
ఆంధ్రప్రదెశ్ లో టిడిపి ఓటమికి బలమైన రాజకీయ వ్యూహం:  BJP రాం మాధవ్
నిజమా? చంద్రబాబు వెళ్ళేది యుఎన్ అసెంబ్లికి కాదా!  ఏమిటీ తమాషా? మరి ఎందుకీ బూటకాల నాటకాలు?
ఇంటి పేరుతో పబ్బం గడుపుతున్న రాహుల్ అంతకు మించి ఎలాంటి అర్హత సామర్ధ్యం లేవు!
నరేంద్ర మోడీ రాజకీయ వ్యక్తిగత జీవితంపై రాఫేల్ అవినీతి మరక !
భారత్ - పాక్ రాజకీయమైనా, సినిమాలైనా చివరకు క్రీడలైనా - ఇది దాయాది పోరు కదా!!!
‘ఓటు కు నోటు కేసు’ ఈడీ  ఉచ్చు  బిగిస్తుందా?
చంద్రబాబు స్వంత భవనాల నిర్వహణ సిసిటివీలు, కెమెరాల భారం ఉభయ రాష్ట్రాల ఆర్ధిక వ్యవస్థలకే తలనొప్పా?
చంద్రబాబుకు షాక్!  మీకెవరికి స్పెషల్ ట్రీట్మెంట్లు ఉండవు: ధర్మాబాద్ కోర్ట్
టిఆరెస్ ఒటమికి కాంగ్రెస్ పాదాల చెంత మోకరిల్లటానికి టిడిపి సిద్దమౌతుంది : 10 సీట్లు చాలు టిడిపి
చింతమనేని టిడిపికి మోహం - కాని - తెలుగు జాతికి శిరోభారం
మంత్రి లోకెష్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం - పెయిడ్ ఆహ్వానం ఖర్చు తడిసి మోపెడు? ప్రయోజనం?
మన టాలీవుడ్ హీరోల సామాజిక బాధ్యత సృహ లో హాస్యం రసవత్తరం
గోదావరి పుష్కరాల్లో జనహననంపై - రిటైర్డ్ జడ్జ్ సోమయాజులు నివేదిక రాసిందెవరు?
డిల్లీలో నరెంద్ర మోడీ దెబ్బ - గోల్కొండలో ఒవైసీలు అబ్బా!
About the author