ఎన్నిచట్టలు చేసినా, పెద్ద నోట్లు రద్దు చేసినా, బినామీ చట్తం తెచ్చినా భారత్ లో నరనరాన జీర్ణించుకున్న నల్లధన వ్యామోహం తగ్గేలా లేదు. ఎక్కడ చూసినా నల్లధన వ్యాపారమే. భారత ఎన్నికలు, రాజకీయాలన్ని నల్లధనం మకిల పట్టగా అవినీతి ధుమారంలో కొట్టుకుపోతున్నాయి. అయితే ప్రత్యక్ష పన్నుల బోర్డ్ నల్లధన నివారణకు ప్రత్యేక పథకాలు రూపొందిస్తుంది.  
Image result for under CBDT scanner
బ్లాక్ మార్కెటీర్స్ అదే నల్ల కుబేరుల భరతం పట్టేందుకు ఆదాయ పన్ను విభాగం భారత ప్రజలకు ఒక బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. బ్లాక్‌మనీ, బినామీ లావాదేవీల గురించి సరైన సమాచారమిచ్చే వారికి రూ.కోటి నుంచి రూ.5కోట్ల దాకా పారితోషికం ఇవ్వనుంది. దేశ, విదేశాల్లోని ఆస్తులు, ఆదాయాలపై పన్నుల ఎగవేతకు సంబంధించి సమగ్ర సరైన  వివరాలు ఇచ్చే వారికి రూ. 50లక్షల దాకా బహుమానం అందించనుంది.
Image result for under CBDT scanner
ఈ దిశగా "కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు-సీబీడీటీ, బినామీ లావాదేవీల సమాచారమిచ్చే వారికి పారితోషిక పథకం 2018 ని శుక్రవారం ఆవిష్కరించింది. దీని ప్రకారం బినామీ లావాదేవీ లు, ఆస్తుల గురించి ఆదాయ పన్ను విభాగానికి సమాచారం అందించే వారికి రూ.కోటి దాకా పారితోషికం లభిస్తుంది. అదే, లెక్కల్లో చూపకుండా విదేశాల్లో దాచిన నల్లధనం గురించి ఉప్పందించిన వారికి రూ.5కోట్ల దాకా బహుమతి లభిస్తుంది. విదేశీ వేగులకు కూడా ఇది వర్తిస్తుంది. బినామీ లావాదేవీల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకోతగిన లావాదేవీలు, ఆస్తులకు సంబంధించిన సమాచారాన్ని జాయింట్‌ లేదా అడిషనల్‌ కమిషనర్‌ స్థాయి అధికారులకు అందించవచ్చు.
Related image
బినామీ లావాదేవీలు, ఆస్తులు వాటిపై ఆదాయాన్ని అందుకునే పెట్టుబడిదారులు, లబ్ధిదారుల గురించి సమాచారమిచ్చేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఈ పథకాన్ని రూపొందించినట్లు సీబీడీటీ పేర్కొంది. "బినామీ లావాదేవీల సమాచారమిచ్చే ఇన్ఫార్మర్‌ పారితోషిక పథకం" కింద బినామీ లావాదేవీలు, ఆస్తులతో పాటు వాటిపై వచ్చే ఆదాయాలు అందుకుంటున్న వారి గురించి నిర్దిష్ట ఫార్మాట్‌లో, ఆదాయ పన్ను విభాగం ఇన్వెస్టిగేషన్‌ డైరెక్టరేట్స్‌ లోని బినామీ నిరోధక యూనిట్లలో జాయింట్‌ లేదా అడి షనల్‌ కమిషనర్స్‌కి సమాచారమిస్తే వారికి కోటి రూపాయల దాకా పారితోషికం లభిస్తుంది‘ అని సీబీడీటీ తెలిపింది.
Image result for rewards to CBDT secret informants
బినామీ లావాదేవీలు, ఆస్తుల గురించి సమాచారమిచ్చే ఇన్ఫార్మర్ల వివరాలను రహస్యంగా ఉంచుతామని సీబీడీటీ పేర్కొంది. బ్లాక్‌ మనీ చట్టం కింద, లెక్కల్లో చూపకుండా విదేశాల్లో దాచిన నల్ల ధనం వివరాలు తెలియజేస్తే రూ.5 కోట్ల దాకా రివార్డు లభిస్తుందని సీబీడీటీ వివరించింది. మరొకరి పేరుపై నల్లధనాన్ని ప్రాపర్టీల్లో ఇన్వెస్ట్‌ చేస్తున్న సందర్భాలు అనేకం ఉంటు న్నాయని సీబీడీటీ తెలియజేసింది.

ఆయా ఆస్తులు, లావాదేవీలు బినామీల పేరుపై జరిగినా ప్రయోజనాలన్నీ కూడా చాటుగా ఇన్వెస్టర్‌కే చేరుతున్నాయని పేర్కొంది. పన్ను రిటర్నుల్లో ఇలాంటివి కనిపించ కుండా వారు జాగ్రత్త పడుతున్నారని వివరించింది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన చట్టాన్ని మరింత పటిష్టంగా చేసే క్రమంలో బినామీ లావాదేవీలను నిరోధించేలా చట్టాన్ని సవరించారు. 

Image result for rewards to CBDT secret informants

మరింత సమాచారం తెలుసుకోండి: