"యూజ్ అండ్ థ్రో పాలసి" ఫాలో అయ్యేవాళ్ళకి, వారి దారిలో సరైనోళ్ళు తిరగబడితే, పరిస్థితులు తలకిందులవ్వటమే కాదు, దిక్కు తెలియని పరిస్థితులు చుట్టుముడ తాయి. అలా దెబ్బతిన్నవారు ఇద్దరుండి వారిద్దరు కలసి ఒకరికొకరు దగ్గరైతే (వారే ముద్రగడ ఒకరు మరొకరు మోత్కుపల్లి) వీరిద్దరి మద్య "పొలిటికల్ శాండ్విచ్" అయ్యేది టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు.
Image result for mudragada motkupalli chandrababu
తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత మోత్కుపల్లి నరసింహులు రాజకీయంగా అడుగులు ఎటువేయబోతున్నది అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. టీడీపీ పోలిట్  బ్యూరో సభ్యుడి గా ఉన్న ఆయన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేయడంతో పార్టీ నుంచి బహిష్కరణకు గురవయ్యారు. అయితే, టీఆర్ఎస్ లో చేరాలన్న ఉద్దెశ్యంతోనే మోత్కుపల్లి ఈ విధంగా వ్యాఖ్యలు చేశారని అంతా భావించారు. 

చంద్రబాబుపై ఆయన విమర్శల తీవ్రత చూస్తే మోత్కుపల్లి ఇంకేమైనా వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఉన్నారా? అనే అనుమానాలు జనాల్లో వస్తున్నాయి. దీనికి తోడు శుక్రవారం మోత్కుపల్లి ని ఏపీ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కలవడం కొత్త ఊహాగానాలకు తెరతీస్తోంది. తెలుగుదేశం పార్టీ అత్యంత ఘనంగా జరుపుకునే మహానాడు సమయంలోనే మోత్కుపల్లి పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. చంద్రబాబును విమర్శించారు. అయితే, పార్టీ నుంచి బహిష్కరించిన తర్వాత ఈ విమర్శ లకు మరింత పదును పెట్టి,  ఏకాయకీ చంద్రబాబు పరువు ప్రతిష్ట ను డ్యామేజ్ చేసేలా మాటలదాడి చేశారు. 
Image result for mudragada motkupalli chandrababu
చంద్రబాబు వ్యక్తిత్వం గురించి నేరుగా కామెంట్స్ చేశారు. చంద్రబాబు నరహంతకుడని, ఎన్టీఆర్ చావుకి కారకుడని, టీడీపీ జెండాను దొంగలించాడని తీవ్రంగా ఆరోపణలు చేశారు. జగన్, పవన్ లపై ప్రశంసలు కురిపించారు. ఇవన్నీ చూస్తే చంద్రబాబుపై ఆయన పగ పెంచుకున్నారని అర్థమవుతోంది. ముద్రగడ పద్మనాభం, మోత్కుపల్లి నరసింహులు  భేటీ కావడం కూడా ఈ సందేహాలకు బలం చేకూరుస్తోంది. వీరిద్దరి పూర్వాశ్రమం టీడీపీనే. ముద్రగడ పద్మనాభం కూడా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. 
Image result for mudragada motkupally chandrababu
కాపు ఉద్యమం సమయంలో ఆయనను తీవ్ర నిర్భందంలో ఉంచడం, ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు దూషించడం వంటి పరిణామాల నేపథ్యంలో ముద్రగడ - చంద్రబాబుపై కోపంతో ఉన్నారనేది తెలిసిన విషయమే. మోత్కుపల్లి నర్సింహులును కలిసిన ముద్రగడ తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి రావాలని కూడా ఆహ్వానించారని తెలిస్తోంది. అయితే, ఆంధ్రప్రదేశ్  రాష్ట్రానికి ఆహ్వానించడం వెనక ఆయన  వ్యూహం ఏంటీ? అనేది తెలియడం లేదు. చంద్రబాబుపై వ్యక్తిగత పగ ఉన్న వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయనున్నారా? ఒకవేళ అదే వీరిద్దరి  లక్ష్యమైతే తెలంగాణకు చెందిన మోత్కుపల్లి మాటలను, ఆరోపణలను ఆంధ్రప్రదేశ్  ప్రజలు పట్టించుకుంటారా?  అనేది అసలు ప్రశ్న. దళితనేత అయిన మోత్కుపల్లి దళితుల్లో చంద్రబాబును విలన్ గా చేసేందుకు మాత్రం కొంత అవకాశం ఉంది.
Image result for mudragada motkupally chandrababu
చంద్రబాబు నాలుగేళ్ళ పాలనలో వివక్షతకు గురైన కాపులు, దళితులు ఒకటైతే ఆ పార్టీల ఓట్లపైనే కోటలు కట్టుకున్న తెలుగుదేశం పునాదులు బలహీన మవటం తధ్యం. ఆపై ఉభయ రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ మనుగడ కష్టమే నని విశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు తెలుగు దేశం పార్టీలో బాగా వివక్షకు గురై నిర్లక్ష్య పీడితుడు దలిటనాయకుడు మోత్కుపల్లి నరసింహులు మాత్రమే. చంద్రబాబు కంటే ముందే టిడిపిలో ప్రవేసించి ఇంతవరకు పార్టీపై ఎలాంటి ప్రమాదకర ఆరోపణలు చేయకుండా పార్టీకి కాపుకాసిన వ్యక్తిగా మొత్కుపల్లికి పేరుంది.  
 Image result for mudragada motkupally chandrababu

మరింత సమాచారం తెలుసుకోండి: