తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ మాటతీరు గురించి పెద్దగా చెప్పనవసరంలేదు. కేవలం ఆయన మాటతీరు వల్ల ప్రపంచ మేధావి గూగుల్ కూడా లోకేష్ గారికి మంచి బిరుదు ఇచ్చింది రాష్ట్రం తరఫున. ఇదిలా ఉండగా గతంలో చంద్రబాబు నేను వేసిన రోడ్లమీద నడవకూడదు అంటూ ఏదో తన జేబులో డబ్బు తీసి రోడ్లు వేసినట్లు మాట్లాడటం జరిగింది...దీంతో చంద్రబాబు చేసిన కామెంట్లపై జాతీయ స్థాయిలోనే పెద్ద రచ్చ జరిగింది. 
Image result for lokesh
అయితే తాజాగా ఇదే తరహాలో చిన్న బాబు గారు అయిన లోకేష్ ప్రతిపక్షనేత జగన్, పవన్ యాత్ర ఫై షాకింగ్ కామెంట్స్ చేసారు.  తాము వేసిన రోడ్లపై జగన్ పాదయాత్ర చేస్తున్నాడు. జనసేన పార్టీ కవాతులు చేస్తోందని లోకేష్ అనడం దుమారానికి కారణం అవుతోంది. అనాలోచితంగా మాట్లాడటంలో ముందుంటాడు లోకేష్ బాబు. ఈ మాటలతో అదే విషయాన్ని మరోసారి నిరూపించుకున్నాడు.
Related image
రోడ్లు అనేవి గత మూడేళ్లలో వేసినవి ఏమీ కావు. బ్రిటీష్ కాలం నుంచి, రాజుల కాలం నుంచి రోడ్లున్నాయి. వాటికి చిన్న చిన్న రిపేర్లు, తార్లు వేయడం వంటివి అందరూ చేస్తూ ఉంటారు. ఆ మాత్రం దానికే తాము వేసిన రోడ్లు అని ప్రకటించుకోవడం మూర్ఖత్వం. అలాంటి మూర్ఖత్వాన్నే ప్రదర్శించాడు లోకేష్. అయితే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు పాదయాత్ర చేశారు.
Image result for lokesh pawan
ఆ సమయంలో రోడ్లు వేసినది కాంగ్రెస్ ప్రభుత్వం ..దీనిబట్టి చూస్తే కాంగ్రెస్ వేసిన రోడ్లపై చంద్రబాబు పాదయాత్రలు చేయలేద?...ఆ సమయంలో ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ...లోకేష్ మాటలు బట్టి అయితే తన తండ్రి వేసిన రోడ్లపైనే జగన్ పాదయాత్ర చేస్తున్నాడు అంటూ సోషల్ మీడియాలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కి సెటైర్లు వేస్తున్నారు నెటిజన్లు.


మరింత సమాచారం తెలుసుకోండి: