తెలంగాణ ఆవిర్భావానికి నాలుగేళ్లు.! నాలుగేళ్లలో 40 ఏళ్ల అభివృద్ధి అంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం పెద్దఎత్తున చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో అభివృద్ధి కొత్తపుంతలు తొక్కిందని అధికారపక్షం ప్రచారం చేసుకుంటూ ఉంటే.. అదంతా ఆర్భాటమే తప్ప అమల్లో ఎక్కడా లేదనేది విపక్షాలు చెప్తున్న మాట. ఏదైతేనేం.. సొంత పాలనలో తెలంగాణ వడివడిగా అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది. మరి ఈ నాలుగేళ్లలో తెలంగాణలో జరిగిన మార్పులేంటో ఓసారి పరిశీలిద్దాం..

Image result for telangana development

నీళ్లు, నిధులు, నియామకాల విష‌యంలో అన్యాయం జ‌రిగిందంటూ ప్ర‌త్యేక రాష్ట్రం కోసం పోరాడిన తెలంగాణ ప్రజలు.. ఎట్టకేలకు రాష్ట్రాన్ని సాధించుకున్నారు. అప్పటి నుంచి ఆ రాష్ట్రంపై అభివృద్ధి వైపు పయనిస్తోంది. 2011-12 వార్షిక సంవ‌త్స‌రంలో 5.5గా ఉన్న జీడిపి.. ఈ నాలుగేళలో గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం 9.2 శాతం సాధించినట్టు ప్రభుత్వం చెప్తోంది. 2010-11లో త‌ల‌స‌రి ఆదాయం 90వేలుండగా.. 2016-17నాటికి 73శాతం పెరిగి ల‌క్షా 58వేల‌కు చేరుకుంది. ఇక ఖజానాకు ఏటా నిధుల వరద పారుతోంది.

Image result for telangana development

          తెలంగాణలో రైతులకోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది. పెట్టుబడి సాయం కింద ఇటీవలే రైతుబంధు పథకం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చింది మొదలు ఇప్పటి వరకూ రైతు సంక్షేమానికి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. అధికారంలోకి రాగానే లక్షలోపు రుణాలున్నవారికి మాఫీ చేసింది. దీని ద్వారా 35 ల‌క్ష‌ల మంది లబ్ది పొందారు. అనంతరం.. ల‌క్ష‌ నుంచి మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు రుణాలు తీసుకొనే రైతుకు కేవలం 25 పైస‌లు వ‌డ్డీకే రుణాలందిస్తోంది. స‌బ్సిడీతో వ్యవసాయ పనిముట్లు అందిస్తోంది. నకిలీ విత్తనదారులపై ఉక్కుపాదం మోపింది. గిట్టుబాటు ధరకోసం ప్రభుత్వమే ప్రత్యేక కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. పంట వేసేందుకు అప్పులు చేసుకోవాల్సిన అవసరం లేకుండా రైతు బంధు స్కీం ద్వారా ఎకరాకు 8వేల రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. అంతేకాక.. ప్రతిరైతుకు 5 లక్షల జీవిత బీమా కల్పిస్తోంది.

Image result for telangana development

          ఇక ప్రజా సంక్షేమానికి కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారు. ఏటా 45వేల కోట్ల రూపాయలను సంక్షేమం కోసం కోటాయిస్తున్నారు. ముఖ్యంగా ఆస‌రా పెన్షన్లు ఆదరణ పొందాయి. దీని ద్వారా 41 లక్షల మంది లబ్ది పొందుతున్నారు. ఇక బీడీ కార్మికులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున భృతి కల్పిస్తున్నారు. దివ్యాంగుల‌కు వివాహం చేసుకొంటే ల‌క్ష రూపాయ‌ల ఆర్థిక స‌హాయంతో పాటు ఉచిత బ‌స్ పాస్ సౌక‌ర్యాన్ని కల్పించింది. ఇక ముస్లింలకు షాది ముబారక్ స్కీం కింద పేదింటి ఆడపిల్లలకు ల‌క్ష 116 రూపాయ‌ల ఆర్థిక స‌హాయం చేస్తోంది. అందిస్తోంది. ఇక పేదకుటుంబంలో ఒక్కొక్కరికి రూపాయి చొప్పున 6 కిలోల సన్నబియ్యం అందిస్తోంది. గీత, మ‌త్స్య‌ కార్మికుల‌కు 5 ల‌క్ష‌ల ప్ర‌మాద బీ అందిస్తోంది. దీపం ప‌థ‌కం కింద కొత్త‌గా 5ల‌క్ష‌ల గ్యాస్ కనెక్ష‌న్లు మంజూరు చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సాయం కోసం అమ్మఒడి ప‌థ‌కం ప్రారంభించారు.

Image result for telangana development

ఇక విద్యుత్ సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటి తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు 24 గంటలూ కరెంటు అందుతోంది. ఇక ఐటిలో తెలంగాణకు తిరుగులేదు. దేశంలో ఐటీరంగంలో అగ్రస్థానాన హైదరాబాద్ ఉంది. పారిశ్రామిక రంగం తెలంగాణకు తలమానిక. టీఎస్ ఐపాస్ ద్వారా కొత్తతరం పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు కల్పిస్తోంది. కొత్త పరిశ్రమల రాకతో లక్షలాది మందికి ఉద్యోగాలు లభించాయి. టిహబ్ సరికొత్త ఆవిష్కరణలకు వేదికగా నిలుస్తోంది. ప్రతిఎకరాకూ సాగునీరు అందించే లక్ష్యంతో మిషన్ కాకతీయకు కేసీఆర్ సర్కార్ శ్రీకారం చుట్టింది. దీని ద్వారా చెరువుల్లో జలకళ నింపేందుకు ప్రయత్నిస్తున్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు అందించే బృహత్ కార్యాన్ని చేపట్టింది. వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికీ తాగునీరు అందించకపోతే ఓటు అడగనని కేసీఆర్ శపథం చేశారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటే బంగారు భవిష్యత్ ఉంటుందంటా కేసీఆర్ చేసిన ప్రచారానికి అనుగుణంగా రాష్ట్రాన్ని ఆ దిశగా పరుగులు పెట్టిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: