సాధారణంగా ఆపరేషన్ థియేటర్లో ఎంతో సైలెన్స్..సిరియస్ వాతావరణం కనిపిస్తుంది.  రోగికి ఎలాంటి ప్రమాదం రాకుండా డాక్టర్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ..ఎంతో జాగ్రత్తగా ఆపరేషన్ ముగిస్తారు.  కొన్ని సమయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోగిని బతికించలేని పరిస్థితులు కూడా ఉంటాయి.  కానీ ఓ డాక్టర్ మాత్రం రోకి డ్యాన్స్ చేస్తూ మరి ఆపరేషన్ చేయడం ఇప్పుడు ఆమె కెరీర్ కే మచ్చతెచ్చే పరిస్థితి నెలకొంది.  వివరాల్లోకి వెళితే.. అట్లాంటా ఏరియా బోర్టు నుంచి డెర్మటాలజిస్టుగా సర్టిఫైడ్ అయిన డాక్టర్ విండేల్ బోట్టే ఆపరేషన్ థియేటర్లో డ్యాన్స్ చేస్తూనే రోగి శరీరానికి కోతపెట్టింది.

శరీరంలో కత్తిని అలానే ఉంచి స్టెప్పులేసింది. ఆమెతో పాటు ఆపరేషన్ థియేటర్ లోని వారంతా డ్యాన్స్ చేశారు. అక్కడే ఉన్న ఓ నర్సు ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీయగా, అదేదో ఘనకార్యం అయినట్టు, యూట్యూబ్ లో పోస్టు చేసింది. ఈ విడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో ఆమెపై కఠిన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. గతంలో నాలుగుసార్లు ఆమె ఇలాగే డ్యాన్స్ చేస్తూ ఆపరేషన్లు చేశారని, ఆమెపై నాలుగు కేసులు విచారణ దశలో ఉన్నాయని అధికారులు అంటున్నారు.

ఒక ఆపరేషన్ థియేటర్లో ఎంతో సిన్సియర్ గా జాగ్రత్తాగా ఉండాల్సిన డాక్టర్ ఇలాంటి పనులు చేస్తే..రోగులకు అపనమ్మకం కలుగుతుందని అధికారులు భావిస్తూ ఆమెపై చర్యలు తీసుకోవడానికి ఉపక్రమించారు. ఆమె శస్త్రచికిత్స సమయంలో పాటించాల్సిన కనీస నియమాలను పాటించలేదని అట్లాంటా హెల్త్ బోర్డు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: