ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు ఇచ్చిన మాట ఏ ఒక్కటీ నెరవేర్చలేదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ శ్రీకాకుళం పర్యటనలో చెబుతూ వస్తున్నారు.  ప్రస్తుతం ఆయన విజయనగరం జిల్లాలో పర్యటిస్తోన్నారు.  ఈ సందర్భంగా అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.  తాజాగా పవన్ చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించిన ఆంధ్రప్రదేశ్‌ మంత్రి సుజనకృష్ణ మీడియాతో మాట్లాడుతూ..పవన్‌ కల్యాణ్ ఎవరో చెప్పింది చదవడం మానేసి, వాస్తవాలు గ్రహించాలని అన్నారు.

అధికార పార్టీ చేస్తున్న తప్పులు నీకు ఇప్పుడు కపినిస్తున్నాయా..గతంలో కలిసి పనిచేసినపుడు ఏ తప్పూ కనిపించలేదా అని ప్రశ్నించారు. ఓ వైపు ప్రత్యేక హోదా కోసం సీఎం చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని, మరి పవన్‌ ఈ నాలుగేళ్లు అందుకోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. విజయనగరంలో మైనింగ్‌, ఇసుక మాఫియాలు లేవని అన్నారు. 

రాష్ట్రాభివృద్ది కోసం ముఖ్యమంత్రి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు..విదేశీ పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు పోనివ్వకుండా మన రాష్ట్రానికి వచ్చేలా కృషి చేస్తున్నారు. రాజధాని అభివృద్ది చేస్తే లక్షల్లో ఉద్యోగావకాశాలు వస్తాయని తాపత్రయ పడుతున్నారు.  రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోసం తమ ప్రభుత్వం ప్రకటించిన భృతిని కూడా పవన్‌ తప్పుపడుతున్నారని, ఇది ఆయన అవివేకమేనని విమర్శించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: