ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడికి రాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రీ చుల‌క‌నై పోయిన‌ట్లున్నారు. తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మోడి శ‌నివారం చేసిన రెండు ట్వీట్ల‌ను చూస్తే ఆ విష‌యం స్ప‌ష్టంగా అర్ధ‌మైపోతుంది. 2014 జూన్ 2వ తేదీన నాటి యుపిఏ ప్ర‌భుత్వం స‌మైక్యాంధ్ర‌ప్ర‌దేశ్ ను విడ‌దీసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.  అడ్డుగోలుగా జ‌రిగిన రాష్ట్ర విభ‌జ‌నతో ఏపి తీవ్రంగా న‌ష్ట‌పోయింది. రాజ‌ధాని హైద‌రాబాద్ తో కూడిన తెలంగాణా మిగులు బ‌డ్జెట్ తో ప్రారంభం అవ్వ‌గా, రాజ‌ధాని లేకుండా మొద‌లైన ఏపి ప్ర‌స్ధానం రూ. 16,500 కోట్ల‌తో మొద‌లైంది. దానికితోడు చంద్ర‌బాబు అడ్డ‌దిడ్డ‌మైన పాల‌నతో రాష్ట్రం మ‌రింత క‌ష్టాల్లో కూరుకుపోయింది. అడ్డుగోలు విభ‌జ‌న‌తో కాంగ్రెస్ ప్ర‌జ‌ల‌ను దెబ్బ‌కొడితే, నాలుగేళ్ళ అధికారంలో ఉన్న బిజెపి, టిడిపి ప్ర‌భుత్వం విభ‌జ‌న హామీల‌ను అమ‌లు చేయ‌కుండా  ప్ర‌జ‌ల‌ను మ‌రింత మోసం చేసింది. 

Image result for narendra modi

ట్వీట్లో ఏముందంటే ?
ప్ర‌స్తుతం  విష‌యానికి వ‌స్తే, తెలుగు రాష్ట్రాల ప్రజలకు మోదీ శుభాకాక్షంలు తెలియజేశారు. సింగపూర్‌ పర్యటనలో ఉన్న భారత ప్రధాని సోషల్ మీడియా వేదికగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ప్రజానికానికి శుభాకాంక్షలు తెలిపారు. తొలి ట్వీట్‌లో తెలంగాణ ప్రజలను ఉద్దేశిస్తూ ‘‘రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు. చెప్పారు. అలాగే భవిష్యత్‌తో రాష్ట్ర ప్రజల కలలు, ఆంకాంక్షలు నెరవేరాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...’’ అని ట్వీట్ చేశారు. అదే ఏపి విష‌యానికి వ‌చ్చేస‌రికి  రెండో ట్వీట్‌లో ఆంధ్ర ప్రజలకు  శుభాకాంక్ష‌లు చెబుతూ ‘ఆంధ్రప్రదేశ్‌‌లోని నా సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలంతా సుసంపన్నత, సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను’ అంటూ ట్వీట్ చేశారు. 
అగ్నికి ఆజ్యం పోసిన మోడి
తెలంగాణా విష‌యంలో ఏమో ప్ర‌జ‌ల క‌ల‌లు, ఆకాంక్ష‌లు నెర‌వేరాల‌ని చెప్పిన మోడి ఏపి విష‌యంలో మాత్రం
వెన‌క‌బ‌డ్డ అభివృద్ధి అంశాన్ని కానీ, పోల‌వ‌రం, రాజ‌ధాని నిర్మాణం, విశాఖ‌ప‌ట్నం ప్ర‌త్యేక రైల్వేజోన్ లాంటి కీల‌క అంశాల ఊసే ఎత్త‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం. ఒక వైపు చంద్ర‌బాబు ఈరోజు నుండి న‌వ‌నిర్మాణ దీక్ష‌లు మొద‌లుపెడితే ప్ర‌ధాన‌మంత్రి కూడా దీక్ష‌ల‌పై ఆజ్యం పోసిన‌ట్లు ట్వీట్ చేయ‌టం గ‌మ‌నార్హం.



మరింత సమాచారం తెలుసుకోండి: