2014 లో జగన్ ముఖ్యమంత్రి అవుతాడని అందరు భావించారు. జాతీయ స్థాయిలో అన్ని సర్వే లు బల్ల గుద్ది చెప్పాయి. కానీ చివరికి టీడిపి అధికారం కైవసం చేసుకున్నది. అయితే టీడిపి బీజేపీ మరియు పవన్ కళ్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్లనే చంద్ర బాబు అధికారం లోకి వచ్చాడు అన్న సంగతి వేరే చెప్పాల్సిన పనిలేదు. అయితే అప్పుడు కానీ టీడీపీ ఒంటరిగిగా బరిలో దిగి ఉంటె టీడిపి కి 50-56 సీట్లు వచ్చేవి అని జనసేన  ఆరోపిస్తున్నారు.

Image result for chandra babu and jagan

ఇదిలా ఉంటే, జ‌న‌సేన పార్టీ వ్యూహాత్మ‌కంగా 2019 వైపు అడుగులు వేస్తుంది.అన్ని పార్టీల మాదిరి ఆర్భాటాల‌కు పోకుండా చాప‌కింద నీరులా రాష్ట్రవ్యాప్తంగా త‌మ క్యాడ‌ర్ ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది.ప్ర‌జాపోరాట యాత్ర పేరుతో శ్రీకాకుళం జిల్లాలో ప‌ర్య‌టించిన ప‌వ‌న్,ఉద్ధానం స‌మ‌స్య‌పై గ‌ట్టిగానే ఫైర్ అయ్యారు.నిరాహ‌ర‌దీక్ష‌తో అక్క‌డి ప్ర‌జ‌ల‌కు చేరువ‌య్యాడు.24 గంట‌ల్లో త‌న డిమాండ్లు ప‌రిష్కరించాలంటూ ప్ర‌క‌టించి స‌త్తా చాటాడు.

Image result for janasena pawan kalyan

తాజాగా ఆ పార్టీకి సంబంధించిన సోష‌ల్ మీడియా పేజ్ లో ఓ వాస్త‌వాన్ని పోస్ట్ చేసారు.గ‌త 2014 ఎన్నిక‌ల్లో వైసీపీనే అధికారంలోకి వ‌చ్చేద‌ని, ఆ పార్టీ 127 సీట్ల‌తో గెలిచేద‌ని,జ‌గ‌న్ ముఖ్య‌మంత్రి అయ్యేవాడ‌ని తెలిపింది జ‌న‌సేన సోష‌ల్ మీడియా విభాగం. ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిగా పోటీ చేసి ఉంటే 39 నుంచి 56 సీట్లు మాత్ర‌మే వ‌చ్చేవ‌ని,దీంతో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయ్యేవాడే కాద‌ని, టీడీపీ దారుణంగా ఓడిపోయేదని ఆ పోస్ట్ లో వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: