తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు తాజాగా జరిగిన నవనిర్మాణదీక్ష పాల్గొని సిబిఐ మాజీ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు.  మొన్నటివరకు జగన్ పవన్ పైన ఆరోపణలు చేసిన చంద్రబాబు తాజాగా జేడీ లక్ష్మీనారాయణపై కామెంట్ చేయడంతో ఆంధ్ర రాజకీయాలలో రాజకీయం మరింత వేడెక్కింది.  గతంలో జగన్ కేసులను విచారిస్తున్న సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిబిఐ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణను పొగడ్తలతో ముంచెత్తారు.
Image result for jd lakshmi narayana
అయితే తాజాగా జెడి లక్ష్మినారాయణ రాజకీయ అరగేంట్రం చేయబోతున్నాడని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కొంత మంది జనసేన అని, కొంత మంది టిడిపి అని పలు వ్యాఖ్యలు వినిపించాయి. కానీ ఇప్పుడు కొత్తగా జెడి బిజెపి పార్టీలో చేరుతున్నాడని, వచ్చే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా బిజెపి తరుపున నిలబడతాడని, అందుకే బాబు ఈ విధముగా విమర్శలు చేసాడని అంటున్నారు.  
Image result for cbi jd lakshmi chandrababu
ఇందుమూలంగా నే జెడి లక్ష్మీనారాయణ ముందుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలను మనలను పొందడానికి తెలివిగా రాష్ట్ర వ్యాప్తంగా పల్లెలలో తన పర్యటనలు నిర్వహిస్తున్నారు అని అంటున్నారు కొంతమంది రాజకీయ నాయకులు.
Related image
అయితే తాజాగా చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే జేడీ లక్ష్మీనారాయణ రాజకీయాలలోకి రానంత వరకే ఏ పార్టీకి అయినా మనవాడు, ఒక్కసరి ప్రత్యేర్ధి పార్టీలో చేరితే విమర్శల దాడి చేయాల్సిందే అన్నట్టుగా ఉంది...అంటున్నారు రాజకీయ మేధావులు. మరోపక్క ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబు అప్పుడే ఓటమి భయం పట్టుకుంది అందుకనే వాళ్ల మీద వీళ్ల మీద పడి ఏడుస్తున్నారు అంటూ వ్యంగ్యంగా చంద్రబాబుని విమర్శిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: