విభజన తర్వాత ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ మొన్నటి వరకు కల్లబొల్లి కబుర్లు చెప్పి తీరా ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని చెప్పింది.  అంతే కాదు ఏపిలో టీడీపీని పక్కన పెట్టి ప్రతిపక్ష పార్టీ వైసీపీ కొత్తగా ఏర్పాటు చేసిన జనసేన తో దోస్తీ కట్టి అధికార పార్టీపై కుయుక్తులు పన్నుతుంది.  ఇదిలా ఉంటే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు  ప్రత్యేక హోదా కోసం ఎన్డీయే నుంచి బయటకు వచ్చారు. రెండు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్‌కి అన్యాయం చేశాయని, రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ హేతుబద్ధత లేకుండా విడదీసిందని, బీజేపీ నమ్మక ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.


కర్నూలు జిల్లా జొన్నగిరిలో నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు పాల్గొన్నారు. వారం రోజుల పాటు కొనసాగనున్న ఈ దీక్షలో భాగంగా రెండో రోజయిన ఈరోజు నీటి భద్రత-కరవు రహిత రాష్ట్రం అనే అంశంపై అవగాహన కల్పించారు.  తాను ముఖ్యమంత్రిగా పదవిలోకి వచ్చిన తర్వాత రైతు సమస్యలు తెలుసుకొని వారికి అన్ని విధాలుగా ఆదుకుంటున్నానని..ఈ నాలుగు సంవత్సరాలు ప్రకృతి కూడా సహకరించి సకాలానికి వర్షాలు పడటంతో రైతులు సంతోషంలో ఉన్నారని అన్నారు. ఇవన్నీ ప్రతిపక్ష పార్టీలకు కనిపించడం లేదని..అధికార పార్టీపై విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విపక్షాలపై మండిపడ్డారు.


రాష్ట్రం మొత్తం నవనిర్మాణ దీక్ష చేపట్టామని అన్నారు. ఏపీకి అన్యాయం చేసిన వారు అసూయతో కుళ్లుకునేలా అభివృద్ధి సాధిస్తూ పని చేయాలని పిలుపునిచ్చారు. కాగా, కర్నూలు జిల్లాలో 68 చెరువులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు. అధికారంలోకి రాగానే కరెంటు కొరత లేకుండా చేశామని చెప్పారు.  ఏపీలో ఉపాధి హామీ, జనవనరుల శాఖలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని చంద్రబాబు తెలిపారు.

Image result for chandrababu

నీరు-చెట్టు కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున పనులు చేపట్టామని అన్నారు. పంట సంజీవని కింద 7.25 లక్షల పంట కుంటలు తవ్వామని అన్నారు. . గ్రామాల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే గ్రామదర్శిని, గ్రామ సభలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మంత్రులు కాల్వ శ్రీనివాసులు, దేవినేని ఉమామహేశ్వరరావులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: