తమిళ చిత్ర పరిశ్రమ దిగ్బ్రాంతికి గురయ్యే సంఘటన నేడు చోటుచేసుకుంది. వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తూ తమిళ నటి సంగీత బాలన్ అడ్డంగా బుక్కయింది. ఆమె ఉంటున్న ప్రాంతంలో దాడి చేసిన తమిళనాడు పోలీసులు వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్న ఆమెను, మరి కొంతమందిని అరెస్ట్ చేశారు. 


వివరాల్లోకివెళితే  చెన్నైలోని పనయూర్‌ ప్రాంతంలోగల ఓ ప్రైవేటు రిసార్ట్స్‌లో ఒక వ్యభిచార ముఠా అసాంఘిక చర్యలకు పాల్పడుతుందని సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ ఆకస్మిక దాడి చేసారు. ఈ దాడిలో సినీనటి సంగీత బాలన్‌ తో పాటు ఆమెకు సహకరిస్తున్న సురేష్ అని వ్యక్తిని మరియు కొందరు విటులను కూడా అరెస్టు చేశారు. 


ఈ దాడిలో విభిన్న రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను రక్షించిన పోలీసులు  వారిని పునరావాస కేంద్రానికి తరలించారు. దాడిలో పట్టుబడిన నిందితులు సినీనటి సంగీత బాలన్‌ మరియు సురేష్ అనే వ్యక్తిని ఎగ్మూర్ లోగల మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టగా ధర్మాసనం ఇద్దరికి కస్టడీ విధించింది. సంగీత ప్రస్తుతం తమిళనాడులో హిట్ సీరియల్ గా పేరుగాంచిన రాణీ-వాణీలో రాధికా శరత్ కుమార్‌తో కలిసి నటిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: