నరేంద్ర మోడీ 2019 లో ప్రధాన మంత్రి అయినప్పుడు అతని మీద దేశం చాలా ఆశలు పెట్టుకున్నది. దేశాన్ని మారుస్తాడని, ఉద్ధరిస్తాడని అందరు అనుకున్నారు కానీ ఇప్పడు మోడీ అస్సలు నిజ స్వరూపం బయట పడుతుంది. ఒక పక్క అనినీతి రహిత ఇండియా ను స్థాపించాలని పిలుపు ను ఇస్తాడు మరో పక్క అవినీతి అభ్యర్థులను ముఖ్య మంత్రి కాండిడేట్ లుగా నిలబెడుతాడు. మొన్న కర్ణాటక లో యడ్యూరప్ప అవినీతి నేత అని అందరికి తెలిసిన నిజమే..!

Image result for narendra modi

అయితే ఈ ఏడాదిలో మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో ఈ ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అయితే మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధర రాజెల మీద ప్రజల్లో భారీగా వ్యతిరేకత ఉన్నట్లు, వారి వలన పార్టీకి ఓటమి తప్పకపోవచ్చునని పార్టీలో అంచనాలు ఉన్నాయి. అయినా సరే.. వారినే మళ్లీ ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించి.. ఎన్నికల బరిలోకి వెళ్లాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించడం విశేషంగా కనిపిస్తోంది. ఇద్దరు అసమర్థ ముఖ్యమంత్రులుగా పేరు పడినప్పటికీ వారినే తిరిగి ముఖ్యమంత్రి అభ్యర్థులుగా ప్రకటించడం విశేషమే.

Image result for narendra modi

ఇందులో ఏదో మతలబు ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో చిన్న నష్టం వాటిల్లినా కూడా.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకోవడానికి ఇలాంటి ప్రయోగం ఉపయోగపడుతుందని వారు అనుకుంటూ ఉండవచ్చుననేది అంచనా. ఎందుకంటే.. వీరి నాయకత్వంలోనే వెళితే.. భాజపా మహా అయితే సీట్లను సంపాదించుకోగలదేమో గానీ.. అధికారంలోకి రావడం మాత్రం కష్టం అనేమాటే అందరూ అంటున్నారు. అవి పెద్దరాష్ట్రాలే కావడంతో ఆ రెండుచోట్ల తమ ప్రతిపక్షాలు ఈ ఏడాది అసెంబ్లీ గద్దెఎక్కితే.. నాలుగు నెలల్లోగా అంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోగా వారి పాలనను భ్రష్టుపట్టించి, లోక్ సభ ఎన్నికల్లో తాము లబ్ధి పొందగలమనేది భాజపా వ్యూహం అయి ఉండవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: