రాష్ట్రంలో పరిపాలన అటకెక్కింది. ధర్మపోరాటం నవనిర్మాణ పోరాటం అంటూ జిల్లాల వెంట పడ్ద ముఖ్యమంత్రిలో అధికారం ఊడుతోందన్న డిప్రెషన్ విపరీతంగా కనిపిస్తునంది. ముఖ్యంగా జగన్ అమరావతి ప్రాంత పర్యటన తరవాత చివరికి ముఖ్యమంత్రి స్వకులజనుల్లో కూడా చాలా మార్పువచ్చిన దాఖలాలు తీవ్రంగా కనిపిస్తు న్నాయి. వాళ్ళు ముఖ్యమంత్రి తీవ్ర వత్తిడికి గురి అవుతున్నది గుర్తించినట్లు కనిపిస్తుంది. 
Image result for టిడిపికి దూరమవనున్న కమ్మవారు
స్వతహాగా వారికి వారి స్వంత ప్రయోజనాలు, ముఖ్యంగా వ్యాపారాలు చాలా ముఖ్యం వాటి పరిరక్షణ చాలా అవసరం. కేంద్ర మంత్రిమండలి నుండి సుజనా చౌదరి వైదొలగిన తరవాత - కేంద్రంతో సిఎం కయ్యం పెట్టుకోవటం తద్వారా కేంద్ర రాష్ట్ర సంభందాలు అతి దుర్భరంగా తయారయ్యాయి. దీంతో ఈ ప్రణాళికా కాలమంతా రాష్ట్రాభివృద్ది బూడిదలో కలసినట్లే.    
Image result for టిడిపికి దూరమవనున్న కమ్మవారు
సినీ హీరో శివాజీ, మాదిరిగా ఆపరేషన్ గరుడ అంటూ తన స్థాయిని మరింత దిగజార్చుకోని ముఖ్యమంత్రి మాట్లాడటాన్ని బిజెపి ఎమ్మెల్సీ మాధవ్ ఎత్తి చూపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజనకు ముందు ఒక్కసారి కూడా పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఆ ప్రాజెక్టు ను గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన అన్నారు. 
Image result for dharma poratam deeksha
వైఎస్సార్‌ హయాంలోనే ప్రాజెక్టు ముందుకు కదిలిందని ఆయన శనివారం మీడియా సమావేశంలో చెప్పారు. పోలవరం జాప్యానికి టీడీపి వ్యవహార ధోరణియే కారణమని తప్పు పట్టారు. నవనిర్మాణ దీక్షను ప్రభుత్వ ఖర్చుతో చేస్తూ పార్టీ ప్రచారం కార్యక్రమంగా మార్చుకున్నారని అన్నారు. దీక్షల పేరుతో విరివిగ ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయటంలో దేశంలోనె ప్రధమ స్థానానికి ముఖ్యమంత్రి  చేరిపోయారని ప్రజాభిప్రాయాన్ని గుర్తుచేశారు. 
Image result for operation garuda
విభజన సమయంలో రెండు కళ్ల సిద్ధాంతంతో ఏపీకి ఏం కావాలో అడగని ఈ టీడీపీ నాయకులు అధినేత ఇప్పుడు రకరకాల దీక్షలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. నిరుద్యోగు లకు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది ఎన్నికల భృతి అని అన్నారు. చమురు సంబంధ ఉత్పత్తులు పెట్రోల్‌, డీజిల్‌ మొదలైనవాటిని వస్తు సేవల పన్ను(జీఎస్టీ) కింద కు తేవాలని తమ పార్టీ ఎపి శాఖ అధిష్టానాన్ని కోరినట్లు తెలిపారు. తద్వారా పెరుగుతున్న వస్తు సేవలను క్రిందికి దించవచ్చని అన్నారు. ఇలాటి వాటికి ముఖ్యమంత్రి ముందుకు రారని తెలుస్తుంది. 
Image result for nava nirmana deeksha
హీరో శివాజీ తెర మీదికి తెచ్చిన ఆపరేషన్ గరుడ పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా స్పందించారు.  ఆపరేషన్‌ గరుడ కుస్టోరీ, స్క్రీన్-ప్లే, డైరెక్షన్ & నిర్మాత చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు తాను రాసుకున్న స్క్రిప్టును నటుడు శివాజీ తో చెప్పించి, ఆపై  'ఆపరేషన్ గరుడ నిజం కావచ్చునని కూని రాగాలు తీయించటం ధారుణ రాజకీయ కుట్రలో భాగమే' నని ఆయన ట్విటర్ లో కామెంట్ చేశారు. 
Image result for operation garuda
"ఆపరేషన్‌ గరుడ నిజమవుతుందని అన్న మాటలకు చంద్రబాబు సమాధానం చెప్పగలరా? తాను రాసిన స్క్రిప్టును నటుడు శివాజీతో పలికించి, ఇప్పుడేమో నవ నిర్మాణ దీక్షలో అదే నిజమవుతుంది అనడంలో అంతరార్థం ఏమిటి?" అని ప్రశ్నించారు.  "ఆపరేషన్ గరుడ కు తమరే (చంద్రబాబే) నిర్మాత దర్శకులు రచయిత. ఒక నటుడిని ఎంపిక చేసి తమ మాటలు ఆయనచే పలికించారు. ఈ రోజు నవనిర్మాణ దీక్ష లో ఆ నటుడు చెప్పింది నిజమే కావచ్చనిసెలవిచ్చారు. ఏమి ఐడియా సర్‌జీ!! సాబ్జీ" ఐవైఆర్ అన్నారు. 

Image result for operation garuda

మరింత సమాచారం తెలుసుకోండి: