ఇంత‌లో ఎంత మార్పు ?  కేవ‌లం నాలుగేళ్ళ‌ల్లో జ‌నాలు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. పోయిన ఎన్నిక‌ల్లో వైసిపిని తీసిపారేసిన ఇదే జిల్లా జ‌నాలు తాజా ప‌ర్య‌ట‌న‌లో బ్ర‌హ్మాండ‌మంటున్నారు. 179వ రోజు ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గంలోని పెనుగొండ లో జ‌గ‌న్ ప‌ర్య‌టించారు. ప్ర‌జా సంక‌ల్ప‌యాత్రలో భాగంగా  వైసిపి అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తున్న పాద‌యాత్ర‌తో జిల్లా బ్ర‌హ్మ‌రథం ప‌డుతోంది. తాజాగా జ‌రుగుతున్న పాద‌యాత్ర దెబ్బ‌కు ఆచంట నియోజ‌క‌వ‌ర్గం ఊగిపోతోంది. ఊహించ‌ని స్ధాయిలో జ‌నాలు జ‌గ‌న్ యాత్ర‌కు స్పందిస్తున్నారు. దాంతో స‌హ‌జంగానే తెలుగుదేశంపార్టీ నేత‌లు క‌ల‌వ‌రానికి గుర‌వుతున్నారు. పోయిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డి నుండి టిడిపి అభ్య‌ర్ధిగా పోటీ చేసిన‌ పితాని స‌త్య‌నారాయ‌ణ గెలిచారు. ఈమ‌ధ్యే మంత్రి కూడా అయ్యారు. మంత్రి కాకముందు కానీ త‌ర్వాత గానీ నియోజ‌క‌వ‌ర్గంలో చెప్పుకోద‌గ్గ అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని స్ధానికులు జ‌గ‌న్ కు ఫిర్యాదు చేయ‌టం గ‌మ‌నార్హం. 


స‌మ‌స్య‌లు, అవినీతే ప్ర‌ధానం
ఒక‌వైపు చంద్ర‌బాబునాయుడును విమ‌ర్శిస్తూనే ఇంకోవైపు పేరుపెట్టి చెప్ప‌కుండానే  మంత్రి పితాని స‌త్య‌నారాయ‌ణ‌పై జ‌గ‌న్ ధ్వ‌జ‌మెత్తారు. ప్ర‌జాప్ర‌తినిధులు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం క‌న్నా స్వంత లాభాల కోస‌మే ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని ఉప‌యోగించుకుంటున్న‌ట్లు మండిప‌డిన‌పుడు జ‌నాలు బాగా స్పందించారు. ఆదాయ వ‌న‌రులుగా మిగితా జిల్లాలో దోచుకుంటున్న‌ట్లే సిద్ధాంతం, కోడేరు ఇసుక రీచుల‌ను దోచుకుంటున్న‌ట్లు తీవ్రంగా ఆరోపించారు. ఇక్క‌డి రీచుల దోపిడిలో చంద్ర‌బాబు, లోకేష్, క‌లెక్ట‌ర్ త‌దిత‌రుల‌కు వాటాలు అందుతున్న‌ట్లు చేసిన ఆరోప‌ణ‌ల‌కు జ‌నాలు పెద్ద ఎత్తున స్పందించారు. ప‌రిష్కారం కాని స్ధానిక స‌మ‌స్య‌ల‌తో పాటు అవినీతినే జ‌గ‌న్ ప్ర‌ధానంగా ప్ర‌స్తావించ‌టం గ‌మ‌నార్హం. 


చంద్ర‌బాబును త‌రిమేయండి 
అన్నీ రంగాల్లోనూ విఫ‌ల‌మైన చంద్ర‌బాబును వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలో నుండి త‌రిమేయాల‌ని పిల‌పిచ్చిన‌పుడు పెద్ద ఎత్తున కేరింత‌లు కొట్టారు. నిజానికి పోయిన ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్క‌టీ సంపూర్ణంగా నెర‌వేర‌క‌పోవ‌టం జ‌గ‌న్ కు బాగా క‌లిసి వ‌స్తోంది. రుణ‌మాఫీ, చివ‌ర‌కు డ్వాక్రా సంఘాల మ‌హిళ‌ల‌కిచ్చిన హామీ కూడా పూర్తి చేయ‌లేదు. ఉద్యోగాలివ్వ‌క‌పోగా నిరుద్యోగ‌భృతి కూడా చెల్లించ‌లేదు. దానికితోడు కాపుల‌ను బిసిల్లో చేర్చే హామీ కూడా ఫెయిలైంది. ఉభ‌య గోదావ‌రి జిల్లాల్లో కాపులెక్కువ అన్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే. ఇటువంటి అనేక కార‌ణాల‌తో గోదావ‌రి జిల్లా జ‌నాలు ఇపుడు జ‌గ‌న్ యాత్ర‌కు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోకి జ‌గ‌న్ అడుగుపెట్టిన ద‌గ్గ‌ర నుండి జ‌నాల స్పంద‌న ఇదే విధంగా ఉంది. అంటే జ‌గ‌న్ గొప్ప‌ద‌నం క‌న్నా చంద్ర‌బాబు ఫెయిల్యూర్ వ‌ల్లే జ‌నాలు వైసిపి వైపు ఆక‌ర్షితుల‌వుతున్న‌ట్లు అర్ధ‌మ‌వుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: