రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు..! వారు వీరు కావొచ్చు.. వీరు వారూ కావొచ్చు! మొత్తంగా రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గేందుకు అవ‌కాశం ఉంది. తాజాగా వైసీపీలో చేర‌తార‌ని భావిస్తున్న సినీ ద‌ర్శ‌కుడు, మాట‌ల ర‌చ‌యిత‌.. పోసాని కృష్ణ‌ముర‌ళికి సంబంధించి  ఓ హాట్ టాపిక్ ఇప్పుడు మీడియా వ‌ర్గాల్లో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క రోల్ పోషిస్తార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఆయ‌న వైసీపీ అధినేత జ‌గ‌న్‌తో భేటీ కావ‌డం, కొద్ది దూరం ఆయ‌న‌తో పాద‌యాత్ర‌లో పాల్గొన‌డం కూడా జ‌రిగింది. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న రెండు విష‌యాల్లో జ‌గ‌న్ నుంచి క్లారిటీ తీసుకున్నా రని అంటున్నారు. 
 
వీటిలో ఒక‌టి టికెట్ విష‌యం కాగా, రెండోది ఎన్నిక‌ల ప్ర‌చారం గురించి. జ‌గ‌న్ అనుమ‌తిస్తే.. పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారానికి తాను సిద్ధ‌మ‌ని ఆఫ్‌దిరికార్డుగా పోసాని మీడియాకు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. ఇక‌, టికెట్ విష‌యానికి వ‌స్తే.. గ‌తంలో గుంటూరు జిల్లా చిల‌కలూరి పేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోసాని పోటీ చేశారు. అయితే, అక్క‌డ టీడీపీ సీనియ‌ర్ నేత ప్ర‌త్తిపాటి పుల్లారావు హ‌వాతో ఆయ‌న ప‌రాజ‌యం పాల‌య్యారు.  దీంతో తిరిగి ఆయ‌న సినిమాల‌కు వెళ్లిపోయారు. ఇక‌, ఆ త‌ర్వాత రాజ‌కీయంగా సంచ‌ల‌న కామెంట్లు చేస్తూ.. మీడియాలో నిలుస్తూనే ఉన్నారు. 


ముఖ్యంగా చంద్ర‌బాబును, ఆయ‌న కుమారుడిని కూడా పోసాని టార్గెట్ చేయ‌డం తెలిసిందే. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌ను అనుభవం లేద‌ని చేస్తున్న వ్యాఖ్య‌ల‌ను సైతం పోసాని తిప్పికొట్టారు. ఇలా ఎప్ప‌టిక‌ప్పుడు ప్రత్య‌క్షంగా కాక‌పోయినా.. ప‌రోక్షంగా మాత్రం జగ‌న్‌కు అనుకూలంగా పోసాని మాట‌ల తూటాలు పేలుస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు టికెట్ ఇవ్వాల‌ని జ‌గ‌న్ కూడా నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. 


గుంటూరు జిల్లా చిలకలూరిపేట నుంచి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి బానే జరిగింది.  2009 లో 20 వేల ఓట్లతో, 2014 లో 10వేల ఓట్లతో అదే మర్రి రాజశేఖర్ మీద ప్రత్తిపాటి పుల్లారావు విజయం సాధించారు. అయితే ఇదే నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికల్లో పోసాని కృష్ణ మురళి ప్రజా రాజ్యం తరపున పోటీ చేసి కష్టపడి 14వేల ఓట్లు సాధించి మూడవ స్థానంలో నిలిచారు. 


ఇక‌, వ‌చ్చే ఎన్నిక‌ల‌పై దృష్టి పెట్టిన పోసాని.. క‌మ్మ సామాజిక వర్గం కావటంతో ప్ర‌తిపాటిపై పోసానినే బ‌రిలోకి దింపాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం. పోసానికి ఉన్న స్టార్ ఇమేజ్ దానికి హెల్ప్ అవుతుంది అని జగన్ భావిస్తున్నాడని తెలిసింది. మొత్తంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్తిపాటి పుల్లారావుకు చెక్ పెట్టాల‌నే జ‌గ‌న్ వ్యూహం ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో చూడాలి. 



మరింత సమాచారం తెలుసుకోండి: