తమిళ సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఈ ఇద్దరు హీరోలు మంచి స్నేహితులు..కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒకరి పై ఒకరు విమర్శించుకునే పరిస్థితి వచ్చింది. ఇంతకీ ఆ ఇద్దరు టాప్ హీరోలు ఎవరూ అనుకుంటున్నారా..సూపర్ స్టార్ రజినీకాంత్, విశ్వనటులు కమల్ హాసన్.  రాజకీయాల్లోకి వస్తూనే కమల్‌హాసన్- రజినీకాంత్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. తూత్తుకుడి ఘటనలో రజినీకాంత్ డిఫరెంట్‌గా మాట్లాడడంపై మండిపడ్డాడు కమల్. సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉందని రజినీకాంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశాడు కమల్. ఆందోళనకారులు సంఘ వ్యతిరేకులైతే.. తాను కూడా వాళ్లలో ఒకడినని కౌంటర్ ఇచ్చాడు.

తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కాపర్ ప్లాంట్ విస్తరణ పనులను నిలిపివేయాలని జరిగిన నిరసనలు ఉద్రిక్త రూపం దాల్చిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా కలకలం రేపిన తూత్తుకుడి కాల్పుల ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో ఆ ఘటనకు బాధ్యులైన తమిళనాడు సర్కార్ - పోలీసుల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.  ఆ ఫ్యాక్టరీ విస్తరణపనులను నిలిపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. కాగా,  ఈ ఘటనపై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందన వివాదాస్పదమైంది. సమస్యల పరిష్కారానికి ప్రజలు రోడ్లెక్కితే తమిళనాడు శ్మశానంలా మారుతుందని రజనీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

తాజాగా రజినీ వ్యాఖ్యలపై   'మక్కళ్ నీది మయ్యమ్` పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్....రజనీ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆందోళనలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం కావని అలా ఆందోళనలు చేస్తే తమిళనాడు శ్మశానమవుతుందని రజనీ వ్యాఖ్యానించడం పెను దుమారం రేపింది.  వారు కడుపు మండి ఆందోళన చేస్తే కొంత మంది సంఘవిద్రోహులు వారి ఉద్యమంలో చేరి నానా బీభత్సం సృష్టించారని..ప్రభుత్వం ఆస్తులు నాశనం చేశారని అందుకే అధికారులు అలా స్పందించారని ఆవేదన వ్యక్తం చేశారు కమల్. కావేరి జలాలపై సోమవారం కర్ణాటక సీఎం కుమారస్వామిని కలిసేముందు చెన్నై ఎయిర్‌పోర్టు వద్ద మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

పెద్ద పరిశ్రమలు తమిళనాడుకు రావాలని, అలాగని రాష్ట్ర నియమాలను అనుసరించాలని తెలిపాడు. మరోవైపు కమల్‌ వ్యాఖ్యలపై రజినీ అభిమానులు మండిపడుతున్నారు. మ సమస్యల పరిష్కారానికి లక్ష్య సాధనకు ప్రజలు ఉద్యమాలు చేస్తుంటారని అన్నారు. అయితే ఆందోళనల సందర్భంగా హింస జరిగే పరిస్థితులను నియంత్రించాలని హింసను తగ్గించాలని కోరాలే తప్ప అసలు ఉద్యమమే లేకుండా చేసేలా వ్యాఖ్యలు చేయకూడదన్నారు. మరి కమల్ వ్యాఖ్యలపై రజనీ స్పందన ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరంగా మారింది.



మరింత సమాచారం తెలుసుకోండి: