తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పై ఒకప్పుడు అత్యంత సన్నిహితుడు మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వడ్డె శోభనాద్రీశ్వరరావు షాకింగ్ కామెంట్స్ చేసారు . ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి  భూసేకరణ విషయంలో ఒకప్పుడు తీవ్రంగా విమర్శించిన వడ్డే శోభనాద్రీశ్వరరావు తాజాగా ఇటీవల భోగాపురం మండలంలో విమానాశ్రయం బాధిత గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు విమానాశ్రయం వద్దంటూ చేస్తున్న ఉద్యమం చేస్తున్న ప్రజల అరుపులు కేకలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వినపడడం లేదా అంటూ  వడ్డే విమర్శించారు.

Related image

కనీసం గ్రామానికి ఎర్రబస్సు లేని ఇక్కడ విమానాశ్రయం ఎందుకు అంటూ బాధితుల తరపున చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు..అంతేకాకుండా అక్కడున్న బాధితులకు తమ మద్దతు తెలిపారు. ఈసందర్భంగా అమరావతిలో మీడియాతో మాట్లాడిన వడ్డే అత్యంత పంటలు పండే సారవంతమైన సాగుభూమిని చంద్రబాబు ప్రభుత్వం అన్యాయంగా స్వలాభం కోసం ఆ భూమి కలిగి ఉన్న మనుషులను మోసం చేస్తోందని పేర్కొన్నారు.

Image result for chandrababu

ఎప్పటినుండో ఇక్కడే బ్రతుకుతున్న రైతుల భూములను లాక్కుని మన దేశం కాని ఇతర దేశస్థులైన సింగపూర్  అధికారులకు అప్పనంగా ఇవ్వడమేంటి అంటూ చంద్రబాబుపై తీవ్రంగా మండిపడ్డారు. అమరావతి ద్వారా లబ్ధి పొందేది సింగపూర్ దేశమేనని...సింగపూర్ కంపెనీలకు వేల కోట్ల రూపాయల విలువ చేసే భూములను కట్టబెడతారా? ప్లాట్లు వేసి అమ్మేందుకు సింగపూర్ కంపెనీలకు భూములివ్వాలా? అని వడ్డే శోభనాద్రీశ్వర రావు ప్రశ్నించారు.

Image result for Vadde Sobhanadreeswara Rao chandrababu

రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల వివరాలను ముఖ్యమంత్రి వెల్లడించాలని డిమాండ్ చేశారు. అమరావతి భూముల విషయంలో తేడా వస్తే సింగపూర్ కంపెనీలకు ఏమి భారత చట్టాలు వర్తించవు..దీంతో ఒకవేళ ఇదే పరిస్థితి దాపురిస్తే చంద్రబాబు సింగపూర్ పారిపోతారు అంటూ వడ్డే శోభనాద్రీశ్వరరావు ఎద్దేవా చేశారు. ఈ నేపద్యంలో సింగపూర్ కంపెనీలతో చంద్రబాబు చేసుకున్న ఒప్పందాలు అన్నిటిని బహిరంగంగా ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: