ఆంధ్రప్రదేశ్ లో ఒకప్పుడు అవినీతి పరుల గుండెల్లో సింహ స్వప్నంగా ఉన్న సీబీఐ మాజీ జాయింట్‌ డైరెక్టర్, మహారాష్ట్ర అదనపు డీజీపీ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రాబోతున్నారా? ఇందు కోసం తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) చేయనున్నారా? ఈ ప్రశ్నలకు ఔననే అంటున్నారు.  అయితే ఈయన ఏ పార్టీలో చేరబోతున్నారన్న విషయం పై ఇప్పటి వరకు స్పష్టత రాలేదు.  ఈ మద్య పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్న జేడీ అధికార పార్టీపై కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. 

తాజాగా ఆయన ఓ కార్యక్రమంలో పాల్గొని మాట్లడుతూ.. మరో వైపు అవినీతిపరులెవరు? నేతలా? లేక అధికారులా? సంక్షేమ పథకాల్లో అవకతవకలకు పాల్పడే అవకాశం వీరిలో ఎవరికుంటుంది? ఈ విషయంలో సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.  రాజకీయ అరంగేట్రానికి సన్నద్ధమవుతన్న  లక్ష్మీనారాయణ ఆంధ్రప్రదేశ్‌లో అమలవుతున్న సంక్షేమ పథకాల్లోని అవినీతిని టార్గెట్‌ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై అంతా షాక్ అవుతున్నారు.

రాష్ట్రంలో సంక్షేమ పథకాలన్నీ ఆన్‌లైన్‌లోనే అమలవుతున్నాయి. ఈ ప్రక్రియలో అధికారులకు, సిబ్బందికి తప్ప ప్రజాప్రతినిధులకు సంబంధం ఉండదు. ఒకవేళ అవినీతికి పాల్పడాలనుకున్నా కిందిస్థాయి సిబ్బందికి తప్ప మరొకరికి ఆ అవకాశం లేదు. ఒకవేళ తప్పులు చేయాలంటే ఖచ్చితంగా కింద స్థాయి మాత్రమే చేయాలి.

ఆ లెక్కన చూస్తే.. కిందిస్థాయి సిబ్బందే చేతులు చాస్తున్నారా? ప్రాజెక్టులు, నిర్మాణాల్లో కోట్లాది రూపాయల అవినీతి జరుగుతున్నట్టు ఆరోపణలున్నా ఆ జోలికి పోకుండా సంక్షేమ పథకాల్లో అవినీతి పెరిగిందంటూ లక్ష్మీనారాయణ ఆరోపించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: