ట్విట్ట‌ర్ లో చంద్ర‌బాబునాయుడుకు 40 ల‌క్ష‌ల మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారు. ఆ విష‌యాన్ని చంద్ర‌బాబే స్వ‌యంగా ట్విట్ట‌ర్ ద్వారా  చెప్పుకున్నారు. ఢిల్లీలో  ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడి ద‌గ్గ‌ర నుండి గ‌ల్లీలో ఉండే వారి దాకా చాలా మందికి ఏదో ఓ సోష‌ల్ మీడియాలో అకౌంట్ ఉంటోంది. అందులో ఫేస్ బుక్, ట్విట్ట‌ర్ ముందు వ‌ర‌స‌లో ఉంటున్నాయి. త‌మ ఫాలోయ‌ర్స్ కు కానీ పార్టీ మ‌ద్ద‌తుదార‌లతో కానీ ఏదైనా అంశాన్ని పంచుకోవాలంటే ట్విట్ట‌ర్ నే ప్ర‌ధాన వేదిక‌గా ఎంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. రాజకీయ నేత‌ల్లో అత్య‌ధికులు ట్విట్వ‌ర్ ను బాగా ఉప‌యోగించుకుంటున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. 

Image result for social media

ఢిల్లీ నుండి గ‌ల్లీ దాకా ట్విట్ట‌రే
అస‌లీరోజుల్లో సోషల్‌మీడియా గురించి తెలియని వాళ్ల సంఖ్య చాలా త‌క్కువ‌జ సోషల్ మీడియా ప్రభావం లేని వాళ్లుండరు. సోష‌ల్ మీడియా ద్వారానే స‌మాచారం కాలానికి కంటే చాలావేగంగా దూసుకుపోతోంది. సోషల్ మీడియాను రాజకీయనాయకులు కూడా అస్త్రంగా చేసుకుని తమ ప్రత్యర్థులపై సెటైర్లు, ఆరోపణలు చేయ‌టం మామూలైపోయింది.  అదే స‌మ‌యంలో చంద్ర‌బాబు ఎప్పటికప్పుడు సాంఘిక మాధ్యమాల ద్వారా తమ వ్యక్తిగత విశేషాలను రాజకీయ అంశాలను అందరితో పంచుకుంటున్నారు. మరోవైపు నెటిజన్లు కూడా ఈ మాధ్యమాల ద్వారా తమ స్పందనలు తెలుపుతూ సోషల్ మీడియా పట్ల ఆసక్తి చూపుతూ ఉత్సాహ పరుస్తున్నారు.

Image result for modi on social media

ట్విట్ట‌ర్లో చంద్ర‌బాబు య‌మా యాక్టివ్ 
ఇక టెక్నాలజీని కొత్త పుంతలు తొక్కించిన సీఎం చంద్రబాబు సోషల్ మీడియాను విస్తృతంగా ఉప‌యోగించుకుంటున్న విష‌యాన్ని అంద‌రూ చూస్తున్న‌దే. త‌న‌కు ట్విట్టర్లో 40 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నట్లు చెబుతున్న చంద్ర‌బాబు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇస్తూ స్పందిస్తున్న‌ వారందరికీ  ధన్యవాదాలు తెలిపారు. తాజాగా చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సందర్భంగా ట్విట్టర్‌ ద్వారా ‘చౌక దుకాణాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టి  500లకుపైగా నాణ్యమైన సరుకులు అందుబాటుధరల్లో అందించేందుకు రేషన్ షాపుల స్థానంలో చంద్రన్న విలేజ్ మాల్స్ ఏర్పాటు చేశాం’ అని ట్వీట్ చేశారు

Image result for chandrababu in twitter

మరింత సమాచారం తెలుసుకోండి: