ఆయ‌న అధికార పార్టీ ఎమ్మెల్యే.. గ‌తంలో ఎంపీగానూ గెలుపొందారు! టీడీపీలో ఉన్నా ఆయ‌న ఆలోచ‌న‌లన్నీ ఎప్పుడూ వైసీపీ పైనే ఉంటాయి. ఎమ్మెల్యే అయిన త‌ర్వాత‌.. ఆయ‌న వైసీపీలో చేరిపోతార‌నే ప్ర‌చారం జ‌రుగుతున్నా.. దానిని ఏనాడూ ఖండించ‌లేదు స‌రిక‌దా.. ఉన్న పార్టీపైనే సైటైర్లు వేసి ఆశ్చ‌ర్య‌ప‌రుస్తారు! అంతేగాక కాబోయే సీఎం జ‌గ‌న్ అంటూ త‌న జ‌గ‌న్‌పై ఉన్న త‌న వ‌ల్ల‌మాలిన అభిమానాన్ని ఎటువంటి భేష‌జాలు లేకుండా బ‌హిరంగంగానే ప్ర‌క‌టి స్తారు. గత ఎన్నిక‌ల్లోనే ఆయ‌న జ‌గ‌న్  చెంత‌కు చేరేందుకు సిద్ధ‌మైనా.. చివ‌రి నిమిషంలో డ్రాప్ అయిపోయారు. అప్ప‌టినుంచి సంద‌ర్భం దొరికిన ప్ర‌తిసారీ వైసీపీపై త‌న అభిమానాన్ని.. జ‌గ‌న్‌పై విధేయ‌త‌ను బ‌య‌ట‌పెడుతూనే ఉన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇస్తారో లేదో తెలియ‌క‌పోయినా.. తాను మాత్రం ఎంపీగా పోటీచేయ‌బోతున్నాన‌ని చెబుతుండ‌టంతో అంతా ఆశ్చ‌ర్యపోతున్నార‌ట‌. 

Image result for tdp

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి తీరు టీడీపీ నాయ‌కుల‌కు అంతుప‌ట్ట‌డం లేదు. ఆయ‌న టీడీపీలో ఉన్నా.. నిత్యం వైసీపీ నామం జ‌పిస్తుండటంతో వీరంతా అవాక్క‌వుతున్నార‌ట‌. 2009కి ముందు ఆయ‌న టీడీపీలో చేరారు. త‌ర్వాత నర్సరావుపేట ఎంపీగా విజయం సాధించారు. రాష్ట్ర విభజన సమయంలో లోక్‌సభలో హడావుడి చేసి అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించారు. త‌ర్వాత 2014 ఎన్నిక‌ల్లో గుంటూరు ప‌శ్చిమ‌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలోకి దిగి విజ‌యం సాధించారు. ఆయ‌న టీడీపీలో కొన‌సాగుతున్నా.. మ‌న‌సు మాత్రం జ‌గ‌న్ చుట్టూనే తిరుగుతోంద‌నే ప్ర‌చారం జోరందుకుంది. 2014 ఎన్నికలకు ముందు జగన్ ఎంపీ సీటు ఇస్తే వైసీపీలో చేరతానని మధ్యవర్తులతో క‌బురు పంపించారు. అక్క‌డి నుంచి తన సమీప బంధువు ఎంపీగా పోటీ చేస్తున్నారని తెలుసుకుని.. ఇక ఏమీ చేయలేక టీడీపీలో కొనసాగి ఆఖరి నిమిషంలో గుంటూరు-2 నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 

Image result for ys jagan

ఆయ‌న వైసీపీలో చేరిపోతార‌నే ప్ర‌చారం అటు సోష‌ల్ మీడియాతో పాటు వైసీపీ నేత‌ల్లోనూ ఊపందుకుంది. అయితే ఆయనకు ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఇవ్వాలనే దానిపై జగన్‌ తర్జనభర్జనలు పడుతున్నారనే లీకవుతున్నా. ఆయన ఏనాడూ దీనిని ఖండించలేదు. మనిషి టీడీపీలో ఉన్నా.. మనసు మాత్రం జగన్‌ వద్ద ఉందనే విమర్శలు కొని తెచ్చుకుంటున్నారు. ఇటీవల మోదుగుల బాహాటంగా మాట్లాడుతూ తాను మాచర్ల నుంచైనా పోటీ చేయడానికైనా సిద్ధమేనని, ఎంపీగా పోటీ చేస్తానని చెప్పడంలో ఆంతర్యం ఏమిటో అధికారపార్టీ వర్గాలకు అంతుబట్టడం లేదు. మోదుగుల విషయంలో ఎప్పుడు ఏమి జరుగుతుందోన‌ని టీడీపీ  నాయకులు కూడా చెప్పలేకపోతున్నారు.


ఇంకో విష‌య‌మేంటంటే.. ఆయనకు వై.ఎస్‌.జగన్‌ అన్నా సాక్షి పత్రికన్నా సాక్షి ఛానెల్‌ అన్నా అమితమైన ఇష్టమట. ఇంటి దగ్గర సాక్షి ఛానెల్‌ను చూస్తుంటారు. టౌన్‌కు వెళ్లినా అదే ఛానల్‌ చూస్తారట. అంతేగాక స‌న్నిహితుల వ‌ద్ద `జగన్ కాబోయే సీఎం` అని వ్యాఖ్యానిస్తారట. ఆయ‌న‌కు గుంటూరు-2 నుంచి మ‌ళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసే అవకాశం ఇవ్వరని తెలియడంతో వైసీపీపై ఉన్న అభిమానాన్ని బ‌హిరంగంగానే చాటుకుంటున్నార‌ట‌.  వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించినా వై.ఎస్‌.జగన్‌తో మంతనాలు జరిపి పార్టీలో చేరేందుకు సిద్ధమని చెప్పార‌నే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. జగన్‌ గెలుపు కోసం ఆయన ఆత్రంగా ఎదురు చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: