వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందుతాయా.. లేదా.. అనేదానిపైనే ఇప్పుడు ఏపీలో ఆసక్తి నెలకొంది. ఒకవేళ ఆమోదం పొందితే ఉపఎన్నికలు వస్తాయా అనేది మరో ఆసక్తికర అంశం. ఎన్నికలు వస్తాయో రావో తెలీదు కానీ ప్రధాన పార్టీలు మాత్రం కాలుదువ్వుకుంటున్నాయి.

Image result for ycp mps

          వైసీపీ ఎంపీల రాజీనామాల  చుట్టూ అధికార,  విపక్షాల మధ్య వార్ నడుస్తోంది. రాజీనామాలను  ఆమోదించుకుని వస్తే.. ఎవరి సత్తా ఏంటో తేలిపోతుందన్న చంద్రబాబు వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ రాజేస్తున్నాయి. ప్రత్యేకహోదా కోసం ఐదుగురు వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు.. రాజీనామాలు ఆమోదించే విషయం లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ దగ్గర పెండింగ్ లో ఉంది. స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈలోపే రెండు పార్టీలు ఉప ఎన్నికల కోసం కాలు దువ్వుతున్నాయి. ఉప ఎన్నికలు రావని తెలిసే రెండు పార్టీలు సవాళ్లు విసురుకుంటున్నాయి..

Image result for ycp mps

ప్రత్యేకహోదాపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారు. రాజీనామాల ఆమోదం స్పీకర్ దగ్గర పెండింగ్ లో ఉంది. అయితే  వైసీపీ ఎంపీల రాజీనామా  వ్యవహారం అంతా ఓ డ్రామా కొట్టిపారేస్తున్న తెలుగుదేశం నేతలు.. ఈ విషయంలో వైసీపీకి చిత్తశుద్ధి లేదని.. కేంద్రంతో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న వైసీపీ.. రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి చేయడం లేదని విమర్శిస్తున్నారు. కర్నూలు జిల్లా నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు ఏకంగా వైసీపీ ఎంపీలు రాజీనామాలు ఆమోదించుకుని ఉప ఎన్నికల బరిలోకి దిగాలని సవాల్ విసరడం పొలిటికల్ హీట్ రాజేసింది. ఉప ఎన్నికలతో వైసీపీ అడ్రస్ గల్లంతవడం ఖాయమంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. ఎన్నికలు రావనే వైసీపీ ఎంపీలు చెవిలో పూలు పెడుతున్నారని.. ఉప ఎన్నికల్లో  పోటీచేస్తే  బీజేపీకి పట్టిన గతే వైసీపీకి  పడుతోందన్నారు సీఎం చంద్రబాబు.

Image result for ycp mps

చంద్రబాబు సవాల్ పై అదే రేంజ్ లో స్పందించిన జగన్  ప్రత్యేక హోదా కోసం తమ ఎంపీలు రాజీనామా చేసిన రోజే టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. 25 మంది ఎంపీలు ఒకేసారి రాజీనామా చేసి ఉంటే అప్పుడే కేంద్రం దిగివచ్చేది కాదా అంటూ ప్రశ్నించారు. 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు వైసీపీ ఎంపీలను సంతలో పశువులను కొన్నట్టు కొన్న చంద్రబాబుకు తమ ఎంపీల చిత్తశుద్ధిని ప్రశ్నించే హక్కు లేదన్నారు. వైసీపీకి ఉపఎన్నికలంటే భయం లేదన్న జగన్.. ప్రజలే తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెబుతారని చెప్పారు.  

Image result for chandrababu on ycp mps

ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదిస్తారా లేదా అన్నది పక్కనబెడితే.. అధికార ప్రతిపక్షాలు ఉప ఎన్నికల కోసం కాలుదువ్వుతున్నాయి. రాష్ర్టంలో రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకునేందుకు ప్రయత్నిస్తున్న తెలుగుదేశం, వైసీపీలు ఉప ఎన్నికలంటూ వస్తే.. సత్తాచాటాలనుకుంటున్నాయి. ఇప్పటికే 2019 ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేసిన ఈ పార్టీలు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యా. 2019 ఎన్నికలు రెఫరెండమేనని చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: