ఈ విశ్వంలో మనకు కానరాని జీవరాశులు ఓక్కసారే ప్రత్యక్షమైతే..అవి కూడా భయంకరంగా దర్శనమిస్తే..గుండె గుభేల్ మంటుంది.  అయితే అప్పుడప్పుడు భూమిపై ఎలియన్స్ తిరుగుతున్నాయని..వాటి వల్ల మనుషులకు, పశు పక్షాదులకు అపాయం అని ప్రాణాలు తీస్తాయని రూమర్లు ఉన్నాయి. ఈ వివాదం ఇప్పటిది కాదు కొన్ని ఏళ్ల నుంచి కొనసాగుతూనే ఉంది.  ఆ మద్య విశాఖలో రెండు ఎలియన్స్ వచ్చాయని నానా హంగామా చేశారు..తీరా చూస్తే అవి గుడ్లగూభ జాతికి చెందిన పక్షులు అని అధికారులు తేల్చి చెప్పారు.
Related image
తాజాగా ఇలాంటి ఎలియన్ ఒకటి సంచరిస్తుందని కర్ణాటక రాష్ట్రంలో ఓ వీడియో వైరల్ అవుతుంది.  కర్ణాటక రాష్ట్రంలోని ఓ మారుమూల గ్రామంలో వింత జీవి సంచరిస్తోందని.. జనసంచారం తక్కువగా ఉన్న ప్రాంతంలో ఇది తిరుగుతూ ఉండగా, తొలుత ఏదో జంతువని అక్కడున్న ప్రజలు భావించారని, ఆపై ఓ పథకం ప్రకారం దాన్ని వేటగాళ్లు బంధించారని ఫేస్ బుక్ లో ఓ పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది.  ఈ వీడియోలో కనిపిస్తున్న ఆకారం చాలా విచిత్రంగా ఉంది.  ప్రముఖ దర్శకులు విఠలాచార్య సినిమాల్లో ఉన్న చిన్న దెయ్యంలా కనిపిస్తుంది. 

అయితే ఇది మాట్లాడటం లేదు.. తెల్లని ముఖం, పొడవైన జుట్టుతో కనిపిస్తోంది. చేతులు చిన్నగా ఉన్నాయి. కాళ్లు కనిపించడం లేదుగానీ, కళ్లు, ముక్కు, నోరు కూడా ఉన్నాయి. మరోవైపు  ఇదంతా ఫేక్ అంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు.

ఈ మద్య కొంత మంది ఆకతాయిలు ఇలాంటి జిమ్మిక్కులు చేసి ఫేస్ బుక్ లలో పోస్ట్ చేస్తూ ప్రజలను భయ బ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వీడియోలు తీసి ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని..దాడి జరిగిన పశువుల రక్తనమూనాలు తీసుకొని ల్యాబ్ కి పంపించామని రిపోర్టు వచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలో చెబుతామని అధికారులు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: