గత కొంత కాలంగా భారత్ దేశంపై పాకిస్థాన్ కుట్రపూరిత చర్యలకు పాల్పపడుతూనే ఉంది.  ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే ఉగ్రవాదులను రెచ్చగొడుతూ..భారత్ పై దాడులకు నిర్వహిస్తుంది.  ఇక నుంచి సరిహద్దుల వద్ద పదేపదే కాల్పుల విరమణకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని భారత రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ పాకిస్థాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము గౌరవిస్తున్నామని... ఇదే సమయంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా పాకిస్థాన్ కాల్పులకు తెగబడితే భారత జవాన్లు దీటుగా సమాధానమిస్తారని హెచ్చరించారు.
Image result for pakistan bharat border
రంజాన్‌ నేపథ్యంలో సరిహద్దు వ్యవహారంపై ఆమె మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా పాక్‌తో చర్చల అంశంపై ఆమె స్పందించారు. ఓవైపు సరిహద్దులో కవ్వింపు చర్యలకు పాల్పడుతూ‌.. మరోపక్క చర్చలంటే కుదిరే పని కాదు. ఉగ్రవాదం-చర్చలు ఒకేసారి కుదరవు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటించి శాంతి వాతావరణం నెలకొంటేనే చర్చలు. అలా కాదని ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే ధీటైన జవాబిస్తాం. సరిహద్దులను సురక్షితంగా ఉంచటం మా బాధ్యత. భారత్‌ కాల్పుల ఉల్లంఘన ఒప్పందానికి కట్టుబడి ఉందని అన్నారు. 
Image result for pakistan bharat border
చర్చలు, ఉగ్రవాదం రెండూ ఒకేసారి సాధ్యంకావని అన్నారు. భారత్ ను సురక్షితంగా ఉంచేందుకు తాము ఏమైనా చేస్తామని చెప్పారు. హెచ్చరికలు లేకుండా పాకిస్థాన్ ఉన్నట్టుండి కాల్పులు జరిపే సమయంలో కూడా అప్రమత్తంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.  జమ్ముకశ్మీర్ లో చొరబాట్లకు వ్యతిరేకంగా నిర్వహించే కార్యకలాపాలను నిలిపివేయాలని గత నెలలో భారత ప్రభుత్వం నిర్ణయించింది.

యూపీఏ హయాంలో ఆయుధాల కొరత ఉండేది. 2013-14 లో 87 వేల కోట్లకు గాను 79వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ, ప్రస్తుతం భద్రతా బలగాలకు ఆయుధాల కొరత లేదు. 2017-18లో 86488 కోట్ల కేటాయింపులకు గాను 90460 ఖర్చు చేశాం. అవసరమైన ఆయుధాలు కొనే అధికారాన్ని సులభతరం చేశాం’ అని ఆమె వివరించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: