భారత రాజకీయ రంగంలో ఇందిరా గాంధి తరవాత వ్యూహ ప్రతివ్యూహాలు రచించి నైతికత కొంతైనా తప్పకుండా రాజకీయాలు చేసిన కాంగ్రెస్ వాదులు ఇద్దరు మాత్రమే. అందులో ఒకరు పివి నరసింహారావు కాగా మరొకరు ప్రణబ్ ముఖర్జి. రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెసును నడిపించటంతోనే గడిపిన ప్రణబ్ ముఖర్జీ వారిచేతే కాదు దేశ ప్రజల చేత కూడా దాదా అనిపించుకున్నారు. 


కాంగ్రెసు ఆగర్భ శత్రువుగా భావించే ‘ఆర్ఎస్ఎస్’ శిక్షణ సమావేశానికి ఆయనకు ముఖ్యఅతిథిగా ఆహ్వానం అందగా ఆయన ఆ ఆహ్వానాన్ని మన్నించారు. ఎందుకు వెళు తున్నారు? ఆయన అంతరాంతరాల్లో ఏముంది? ఆయన  జీవన చరమాంకంలో తాను నమ్మిన విలువలకు తిలోదాలిచ్చేసి ఏం సాధించాలనుకుంటున్నారు? జూన్ ఏడో తేదీన ‘ఆర్ఎస్ఎస్’ శిక్షణ శిభిరంలో హాజరయ్యేందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అంగీకరించారని తెలిసినప్పట్నుంచీ తమ సమావేశానికి ప్రణబ్‌ రావడాన్ని ఆరెస్సెస్‌ వర్గాలు ఘన విజయంగా చెప్పుకొంటున్నాయి. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ అయితే సంఘ్‌ పట్ల ఇన్నాళ్లూ ఉన్న రాజకీయ అంటరానితనానికి ప్రణబ్‌ చరమగీతం పాడారని వ్యాఖ్యానించారు. 
Image result for pranab mukherjee
రాష్ట్రపతి పదవి నుంచి విరమణ చేసినప్పటికీ తానింకా క్రియాశీల రాజకీయాలకు దూరం కాలేదని ప్రణబ్‌ ముఖర్జీ, ఐదు దశాబ్దాలపాటు కాంగ్రెస్‌లో కీలకనేతగా వ్యవహరించిన తననుతాను ట్విటర్‌లో  “సిటిజన్‌ ముఖర్జీ” గా ప్రస్తావించుకుంటారు. తద్వారా తాను “స్వతంత్ర పౌరుడు” అనే సందేశాన్ని ఇస్తారు. ఈ సంకేతాలకు అనుగుణంగానే ఆయన తాజా చర్యలు ఉంటున్నట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.



ప్రధాని కావాలన్న తన ఆశలను ఆలోచనలను ప్రణబ్‌ ఏనాడూ దాచుకోలేదు. ‘‘భారత్‌కు ఆయన ప్రధాని కాని ప్రధాని’’ అని ఢిల్లీ రాజకీయవర్గాల్లో పేరుంది. యూపీఏ ప్రభుత్వానికి ప్రధాని మన్మోహన్‌ అయినప్పటికీ ఆ సంకీర్ణాన్ని విజయవంతంగా నడిపించింది ప్రణబ్‌ముఖర్జీయే. సంకీర్ణ రాజకీయాలపై రాసిన పుస్తకంలో ప్రణబ్‌ ఈ విషయాన్ని ఘనంగా చెప్పుకొన్నారు కూడా! 



యూపీఏ-2 ఏర్పాటైనప్పుడు సోనియాగాంధీ తనను ప్రధానిని చేస్తారని, మన్మోహన్‌ సింగ్‌ను రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తారని ఆశించినట్టు కూడా ప్రణబ్‌ తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం ఆయనకు అవకాశం ఇవ్వలేదు. దీంతో రాష్ట్రపతిగా పదవి విరమణ చేసిన ఈ తరుణంలో కూడా ఆయన తనలో 'పులుపు పలుకు' చావలేదనే అభిప్రాయంతో మరో ప్రయత్నం చేస్తున్నట్టు కాంగ్రెస్‌, బీజేపీ, తృణమూల్‌, బీజేడీకి సంబంధించిన రాజకీయ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి



ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయినట్లే ఇంకా ఎందుకీ తాపత్రయం? ఏఎ వయసులో అనే వాళ్ళు మాత్రం కాంగ్రెస్ వాళ్ళే! వాళ్ళ కింకా ప్రణబ్ జీ సేవలు కావాలి కాని ప్రధాని కాకూడదు. రాహుల్ గాంధిని ప్రధానిని చేసి ఆ కుటుంబా నికి ఆధారంగా ఉండాలి. అదే వారి ఆలోచన కావచ్చు. గత జనవరి 27న ,సుదర్శన్ గణేషన్ రచించిన చిత్రాలతో కూడిన బిజూ పట్నాయక్‌ జీవిత చరిత్ర’ పుస్తకావిష్కరణ సందర్భంగా, భువనేశ్వర్‌ లో ఒడిసా ముఖ్యమంత్రి, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌తో ప్రణబ్‌ ఒక విందు సమావేశం జరిపారు. అయితే, ఈ సమావేశానికి దేవెగౌడ, సీతారాం ఏచూరి, ఎల్‌కే ఆద్వాని  తదితరులు హాజరయ్యారు. పేరు కిది బిజూ పట్నాయక్‌ జీవితచరిత్ర ఆవిష్కరణ సమావేశమే అయినా నిజానికి మూడో ఫ్రంట్‌ ఏర్పాటుకు సంబంధించిన కీలక సందర్భం కూడా అని రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి.

దానికి కొద్దినెలల ముందు ప్రణబ్‌ ముఖర్జీ రాష్ట్రపతిగా ఉండగానే. నవీన్‌ పట్నాయక్‌కు రాష్ట్రపతి భవన్‌లో విందు ఇచ్చారు. అక్కడి నుంచే వారు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో సంభాషణలు జరిపారు. బెంగాల్‌ వాస్తవ్యులైన దాదాకు, దీదీకి మధ్య ఆది నుంచీ సత్సంబంధాలున్నాయి. సోనియా గాంధీ, శరద్‌ పవార్‌ ఇచ్చిన విందులాగా మీడియాలో దీనిపై ఎక్కడా హడావుడి జరగలేదు.

The statue of Biju Patnaik at Bhubaneswar airport

దేశంలోని అన్ని పార్టీల ఆమోద యోగ్యత ఉండడం ప్రణబ్ కు రాజకీయంగా కలిసొచ్చే అంశం. ‘‘ప్రణబ్‌ రాజనీతి దురంధరుడు. భారత రాజకీయ క్షేత్రంలో ప్రస్తుతం నరెంద్ర మోదీకి ధీటుగా సాటి రాగల స్థాయి ఉన్నది ప్రణబ్ ఒక్కరికే’’ అని బీజేపీ ఎంపీ ఒకరు వ్యాఖ్యానించారు. 2019 ఎన్నికల్లో బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కీలకపాత్ర పోషించడానికి ప్రణబ్‌ సిద్ధంగా ఉన్నారని ఆ ఎంపీ వివరించారు. బీజేపీ లేదా ఎన్డీయేకు మెజారిటీ రాని పక్షంలో కాంగ్రెసును  ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారంలోకి రానివ్వకూడదని “ఆరెస్సెస్‌” పట్టుదలగా ఉంది. మళ్లీ కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పాతుకుపోతుందన్నదనేది సంగ్ దాని భయం. అందుకే “ఆరెస్సెస్‌” సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ సంస్థ అధినేత మోహన్‌ భగవత్‌ ఆహ్వానం పంపటం దాన్ని ప్రణబ్‌ అంగీకరించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం తో పాటు ఆసక్తిని రేకెత్తించింది.

 

అయితే ఆరెస్సెస్‌ సమావేశానికి ప్రణబ్‌ హాజరు కావటం కాంగ్రెసుకు మింగుడు పడడం లేదు. దీనిపై ప్రశ్నించినప్పుడు కాంగ్రెస్‌ అధికార ప్రతినిధులు ‘నో కామెంట్‌’ అన్నారు. ప్రణబ్‌ నిర్ణయం కాంగ్రెస్‌ నేతలకు రుచించకపోయినా, ఆయనను కట్టడి చేసే పరిస్థితి లేదు. కాంగ్రెస్ మద్దతు బలంగా ఉన్నా ప్రధానమంత్రి పదవి ప్రణబ్‌కు దక్కే అవకాశం లేదు. ఎందుకంటే రాహుల్‌ గాంధి ని ఇప్పటికే ప్రధాని అభ్యర్థిగా వారు ప్రకటించుకున్నారు. 

 

ప్రణబ్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ ఆహ్వానాన్ని అంగీకరించి ఉండకూడదని మెజార్టీ కాంగ్రెసు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఆరు దశాబ్దాల రాజకీయ అనుభవాన్ని రంగరించుకున్న అతను అలా ఎందుకు? చేశారనేది ఎక్కువమందిని వేధిస్తున్న ప్రశ్న. అందులోనే సమాధానం కూడా దాగి ఉంది. ఆ అనుభవమే ఆయనను అటు వైపు నడిపించింది. యువకునిగా ఇందిరాగాంధీ కాలంలోనే తన వ్యూహ నైపుణ్యాన్ని నిరూపించుకున్న “సీజన్డ్ పొలిటీషియన్” అంటే అనుభవజ్ఞుడైన రాజకీయ దురంధరుడు. అరవయ్యో దశకంలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎనభైలనాటికి ఇందిరకు అత్యంత సన్నిహితమైన కీలక మంత్రిగా విశ్వాసపాత్రుడయ్యారు. 80లలో ప్రణబ్ ఆర్థికమంత్రిగా మాజీప్రధాని మన్మోహనసింగ్ ను రిజర్వు బ్యాంకు గవర్నరుగా నియమించారు. 

 

అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సకాలంలో అప్పులు చెల్లించి ఇందిర వద్ద అత్యంత సమర్ధునిగా మార్కులు పొందగలిగారు. నిజానికి ఆర్థిక సంస్కరణల ప్రస్థానం మొదలైందీ అప్పుడే. రాజీవ్ గాంధీ కంటే ప్రధాని పదవికి తానే సమర్థుడినని ప్రణబ్ భావించడంతో కష్టాలు మొదలయ్యాయి. కాంగ్రెసును వీడి 1986 “రాష్ట్రీయ సమాజ్ వాదీ కాంగ్రెసు” ను స్థాపించుకున్నారు. మూడేళ్లలో మళ్లీ మాతృసంస్థ కాంగ్రెసులో దానిని విలీనం చేశారు. 

 

(సశేషం)

తరువాయి భాగం క్రింది లింక్ అనుసరించండి 

https://www.apherald.com/Politics/ViewArticle/308896/national-news-pranab-daa-attending-rss-meeting-und/

మరింత సమాచారం తెలుసుకోండి: