ఈ మద్య ప్రజాప్రతినిధులు ఉచ్చనీచాలు మరిచి నోటికి ఏది వస్తే..అది మాట్లేడుస్తున్నారు.  గత కొంత కాలంగా బీజేపీ నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు విపరీతంగా చేస్తు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు.  తాజాగా యూపీకి చెందిన బీజేపీ నేత సురేంద్ర సింగ్ ప్రభుత్వ అధికారులపై ఘోరమైన మాటలు మాట్లాడి వార్తల్లోకి ఎక్కారు.  ప్రభుత్వ అధికారుల కంటే వేశ్యలేనయమని.. వారు డబ్బులు తీసుకొని పని చేస్తారన్నారు. స్టేజీలపై డ్యాన్స్ లు చేస్తూ ప్రజల్ని సంతోషపరుస్తారని.. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం అలా చేయరన్నారు.
Image result for yogi aditya nath
లంచం అడిగిన అధికారుల్ని అక్కడే చెప్పులతో కొట్టాలన్నారు. లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలు దెబ్బ తినే వ్యాఖ్యానించడంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వ అధికారులు మండి పడుతున్నారు. బైరియా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అత్యాచార ఘటనలు పెరగటానికి కారణం తల్లిదండ్రులేనని.. వారు పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వటంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నట్లుగా ఆయన వ్యాఖ్యానించారు. అంతే కాదు పదిహేనుళ్ల పిల్లలను వారి తల్లిదండ్రులు ఇళ్లల్లోనే ఉంచి కాపలా కాయాలన్నారు. అందుకు భిన్నంగా వారిని ఇష్టం వచ్చినట్లుగా గాలికి వదిలేస్తున్నారంటూ నోరు పారేసుకున్నారు.

కాగా, అధికారులపై సురేంద్రసింగ్ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో యోగి మంత్రివర్గంలోని కొందరు మంత్రుల్ని తీసి వేయాలని.. లేదంటే రాష్ట్రంలో పార్టీ పతనం ఖాయమని వార్నింగ్ ఇచ్చేశారు. కాగా, ఈ కార్యక్రమంలో భాగంగా లంచాలు అడిగిన అధికారుల వాయిస్ లను రికార్డు చేయాలన్నది ఆయన ఆదేశం. ప్రజల సంక్షేమం కోసమే తాను వ్యాఖ్యలు చేస్తానే తప్పించి.. మరో ఉద్దేశం తనకు లేదన్నారు. తను చేసిన వ్యాఖ్యలు తప్పంటే తాను జైలుకు వెళ్లటానికైనా సిద్ధమేనని వ్యాఖ్యానించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: