వైసీపీ ఎంపీల రాజీనామాలకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. రీకన్ఫర్మేషన్ లెటర్స్ అందగానే అవి పూర్తిగా ఆమోదం పొందనున్నాయి. దీంతో ఇప్పుడు ఏం జరగబోతోందనేది ఆసక్తిగా మారింది. ఎన్నికలు జరుగుతాయా... జరగవా.. జరిగితే ఎప్పుడు జరుగుతాయి.. జరగకపోతే ఏమవుతుంది.. లాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు ఆసక్తి కలిగిస్తున్న అంశాలు..!

Image result for ycp mps

          ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ వైసీపీ ఎంపీలు చేసిన రాజీనామాలకు స్పీకర్ ఆమోదం లభించింది. ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రంలోని బీజేపీ - టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లపాటు కాలయాపన చేసిందని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు. గత పార్లమెంటు సమావేశాలు ముగిసిన అనంతరం వైసీపీకి చెందిన ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వై.ఎస్.అవినాష్ రెడ్డి తదితరులు రాజీనామాలు చేశారు. అయితే వీరి రాజీనామాలపై వ్యక్తిగతంగా అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ భావించారు. పలు దఫాలుగా వారి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాత వారి రాజీనామాలకు ఆమోదం లభించింది.

Image result for ycp mps

          వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఉపఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఉపఎన్నికలు వస్తే తమ సత్తా చాటుతామని, ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించడంతో వీటిపై మరింత ఉత్కంఠ కలుగుతోంది. ఉపఎన్నికలు వస్తే సత్తా చాటేందుకు తామూ సిద్ధంగానే ఉన్నట్టు వైసీపీ ఎంపీలు చెప్తున్నారు. తప్పకుండా విజయం సాధిస్తామనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. తమతో పాటు పార్టీ ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపైన కూడా వేటు వేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని కోరుతున్నారు. ప్రస్తుతం టీడీపీతో బీజేపీ సంబంధాలు బెడిసికొట్టడంతో వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంది. మరి వారిపై వేటు పడితే వారి స్థానాలకు కూడా ఎన్నికలు అనివార్యం.

Image result for ycp mps

          సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కూడా సమయం లేదు. 2014 ఏప్రిలో లో ఎన్నికలు జరగ్గా.. మే నెలలో మోదీ ప్రభుత్వం ఏర్పడింది. ఏడాదిలోపే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇప్పుడు ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి కలిగిస్తున్న అంశం. వైసీపీ ఎంపీల కంటే ముందే రాజీనామాలు చేసిన వాళ్ల స్థానాల్లో ఎన్నికలు జరిపేందుకు ఎన్నికల సంఘం సిద్ధమవుతోంది. కర్నాటక సహా పలు స్థానాల్లో వచ్చే నెలలో ఈ ఎన్నికలు జరిగే అవకాశముంది. ఆ స్థానాలతోపాటే వైసీపీ ఎంపీల స్థానాల్లో కూడా ఎలక్షన్స్ జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా ఎన్నికల సంఘం విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది.

Image result for ycp mps

          ఒకవేళ ఎన్నికలు జరిగితే వైసీపీ మెడపై కత్తి ఉన్నట్టే.! ఒక ప్రత్యేక కారణంతో వాళ్లంతా రాజీనామాలు చేశారు. ప్రత్యేక హోదా నినాదంతో ఈ ఎన్నికలు జరగుతాయి. అప్పుడు అన్ని స్థానాల్లో తప్పకుండా విజయం సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక్క చోట ఫలితం తారుమారైనా అసెంబ్లీ ఎన్నికల ముందు రాంగ్ సిగ్నల్స్ వెళ్లే అవకాశముంది. అప్పుడు ఉపయోగం లేకపోగా అసెంబ్లీ ఎన్నికల ముందు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తంది. అలా కాకుండా అన్ని స్థానాల్లో గెలిస్తే అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీలో ఫుల్ జోష్ రావడం ఖాయం. అంతే కాక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలపై ప్రభావం చూపిస్తాయి. మరి ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది తేలాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: