కొద్ది రోజుల క్రితం కడపజిల్లా జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలో రాజకీయ విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. వైసీపీ నియోజకవర్గ సమన్వయ కార్యకర్త సుధీర్ రెడ్డి మరియు కడప ఎంపీ అవినాష్ రెడ్డి ని పెద్దదండ్లూరు గ్రామంలో గల వివాహ రిసెప్షన్ కు ఆహ్వానించడంతో క్రోపొదిక్తులయిన ఆది వర్గీయులు వైసీపీ నేతలను చితకబాదినట్లుగా వార్తలు వచ్చాయి. అంతేగాక టీడీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కూడా తన అనుచరులపై ఆది వర్గీయులు దాడి చేశారని విమర్శలు గుప్పించాడు.


ఈ దాడి వెనుక ఆది కుటుంబీకులే ముఖ్య భూమిక పోషించారని కూడా వార్తలు వచ్చాయి. కాగా జమ్మలమడుగులో నవనిర్మాణ దీక్షకు హాజరయిన మంత్రి ఆది ఆయన కుటుంబీకులపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు. ఆయన మాట్లాడుతూ- మొన్న జరిగిన ఘటనకు తన కుటుంబానికి ఏమీ సంబందం లేదని చెప్పారు. రాజకీయ లబ్ధికోసమే ఇంటువంటి ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. 


వైఎస్ రాజశేఖర్ రెడ్డి వల్ల తను గెలవలేదని చెప్పుకొచ్చారు. దేవగుడి చుట్టూ ఉన్న పది గ్రామాల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఏకపక్షమేనన్నారు. అప్పట్లో ఇక్కడి కొన్ని గ్రామాల్లో వైఎస్ కు తగిన ప్రాభల్యం లేకపోవడంతో తామే రంగంలోకి దిగి వైఎస్ ను భారీ మెజారిటీతోగెలిపించామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు తమని రెచ్చగొట్టాలని చూస్తే వచ్చే ఎన్నికల్లో వారు ఇక్కడ ఏజెంట్లను కూడా కూర్చోబెట్టుకోలేరని ప్రత్యర్థులకు ఆయన గట్టి వార్నింగ్ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: