వైసీపీ ఎంపీల రాజీనామాలు దాదాపు ఆమోదం పొందడంతో ఇప్పుడు ఏం జరుగుతుందోననే ఉత్కంఠ ఏపీని ఊపేస్తోంది.. ఎన్నికల వస్తాయా.. వస్తే ఏం జరుగుతుంది.. వైసీపీ గెలుస్తుందా..? టీడీపీ గెలుస్తుందా..? అనే ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఒకవేళ ఎన్నికలు అనివార్యమైతే టీడీపీకి గట్టి ట్విస్ట్ ఇచ్చేందుకు వైసీపీ సిద్ధమైనట్టు తాజా సమాచారం. ఏపీకి ప్రత్యేకహోదా కోసం ఏప్రిల్ 6న రాజీనామాలు చేసిన ఐదుగురు వైసీపీ ఎంపీల రాజీనామాలను స్పీకర్ దాదాపు ఆమోదించేశారు. స్పీకర్ కోరిన విధంగా ఎంపీలు రీకన్ఫర్మేషన్ లేఖలు కూడా అందించడంతో రాజీనామాల ఆమోదం దాదాపు పూర్తైనట్టే.. ఇక ఉప ఎన్నికలు వస్తాయా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది. ఏడాదిలోపు ఎన్నికలుండవని కొందరు,, రాజీనామాలు ఆమోదం పొందిన ఆరు నెలల్లోపు ఎన్నికలు నిర్వహించాలని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన తరుణంలో ఏపీలో ఉప సమరంపై హాట్ హాట్ చర్చ సాగుతోంది.

Image result for ycp mps

రాజీనామాలను ఆమోదింపజేసుకొని తెలుగుదేశం పార్టీకి సవాల్ విసిరిన వైసీపీ ఎంపీలు.. పార్టీ ఫిరాయించిన ముగ్గురు టీడీపీ ఎంపీలపైనా స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. అరకు ఎంపీ కొత్తపల్లిగీత, కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి ని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ కు ఫిర్యాదు చేశారు వైసీపీ ఎంపీలు. అంతేకాదు.. ఇన్నాళ్లు రాజీనామాలు డ్రామా అంటూ విమర్శించిన తెలుగుదేశం పార్టీ ఇరకాటంలోకి నెడుతున్నారు వైసీపీ ఎంపీలు.. ప్రత్యేకహోదా కోసం టీడీపీకి చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు 18 మంది ఎంపీలతోనూ రాజీనామా చేయించాలని సవాల్ విసురుతున్నారు. అయితే అది జరిగేపని కాదు.

Image result for ycp mps

సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉండడంతో ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా అనే విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. న్యాయనిపుణులు, రాజ్యాంగ నిపుణులు మాత్రం.. రాజీనామా చేసిన ఆర్నెళ్లలోపు ఉప ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటున్నారు. గతంలో  సుప్రీం కోర్టు ఓ తీర్పు సందర్భంగా మార్గదర్శకాలు అదే చెబుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కర్ణాటకలో రెండు లోక్ సభ స్థానాలతో .. దేశవ్యాప్తంగా మరికొన్ని స్థానాలు ఖాళీ కావడంతో ఎన్నికలు అనివార్యమయితే..దేశంలో ఖాళీగా ఉన్న  లోక్  స్థానాలకు ఒకేసారి ఎన్నిక జరుగుతుందని.. చెబుతున్నారు. అదే జరిగితే ఆగస్టులోపే ఉప ఎన్నికలుండే అవకాశం ఉంది. అయితే ఇది కన్ఫామ్ అని చెప్పలేం.

Image result for ycp mps

మొత్తం వైసీపీ ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందడంతో ఇక బంతి ఎన్నికల కమిషన్ చేతిలోకి వెళ్లింది. ఉప ఎన్నికలు జరుగుతాయా లేదా.. అనేది ఇంకా తేలకపోయినా.. అధికార, విపక్షాలు...అప్పుడే ఉప ఎన్నికల రణరంగానికి కాలు దువ్వుతున్నాయి. మరోవైపు హోదా కోసం కేంద్రంపై పోరాటం చేస్తున్నామంటోన్న తెలుగుదేశం ఒక వేళ ఉప ఎన్నికలంటూ వస్తే.. తెలుగుదేశం పార్టీ పోటీ నుంచి తప్పుకుని హోదాను గెలిపించాలనే వాదనను తెరపైకి తెస్తోంది. ప్రత్యేకహోదా కోసం పదవులు త్యాగం చేసిన వైసీపీ అభ్యర్ధులను ఏకగ్రీవంగా గెలిపించుకునేందుకు టీడీపీ సహకరించదా అంటూ ప్రశ్నిస్తుంది. వైసీపీ వ్యూహాత్మకంగా తీసుకొచ్చిన ఈ వాదన తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టింది. ఇదే జరిగితే టీడీపీ ఎలాంటి స్ట్రాటజీ అమలు చేస్తుందనేది ఆసక్తి కలిగించే అంశం.


మరింత సమాచారం తెలుసుకోండి: