బీజేపీతో రాష్ట్రంలో - కేంద్రంలో అధికారం పంచుకుని నాలుగేళ్లు కొనసాగిన తెలుగుదేశం పార్టీ ప్రత్యేకహోదా విషయం పక్కన పెట్టి ప్రత్యేక పాకేజీ వెంటపడింది. ఆ తరవాత ప్రతిపక్షం ప్రత్యేక హోదాతో ప్రజా క్షెత్రంలోకి వెళ్ళి కొంత ప్రజాభిమా నాన్ని పోగేసుకోవటం గమనించి – టిడిపి-భిజెపి పట్ల ప్రజల్లో పెల్లుభుకుతున్న  అసంతృప్తిని చూసి హఠాత్తుగా సంబంధాలు తెంచుకుని బయటకు వచ్చింది.

Image result for chandrababu & his media says BJP defeated in karnataka

ప్రత్యేకహోదా అక్కర్లేదు అదేమీ సంజీఅని కాదు అంటూ ప్రత్యేక ప్యాకేజీ చాలు అన్న చంద్రబాబు ఒక్కసారిగా బీజేపీ హోదా ఇవ్వకుండా మోసం చేసిందని కొత్తరాగం ఎత్తుకున్నాడు. అంతే కాదు పార్లమెంటు బయటా, లోపలా, ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ పార్టీ మీద అనేక ఆరోపణలు చేశారు. నాలుగేళ్ళు కాపురం చేసి సర్వప్రయోజనాలు అంభవించి చివరకు 2019 ఎన్నికలు గుర్తుకు రాగా  “రాష్ట్రం ప్రత్యేక హోదా హోరుతో గంగవెర్రులు ఎత్తుతుండగా” బయటకు వచ్చి ఏవో ధర్మ దీక్షలు, నవ నిర్మాణ దీక్షలతో ఈ సంవత్సరం గడిపేస్తున్నారు.

Image result for chandrababu & his media says BJP defeated in karnataka

అక్కడితో ఆగకుండా కర్ణాటక ఎన్నికల్లో బీజేపీని ఓడించాలని టీడీపీ నేతలతో ప్రచారం కూడా చేయించారు తండ్రి తనయులు. కర్ణాటక ఎన్నికల్లో ఛంద్ర బాబు పిలుపు బూమరాంగ్ కావడం - బీజేపీకి అత్యధిక స్థానాలు రావడం - అధికారం చేపట్టడం తో బలనిరూపణ కోసం బీజేపీ ఎమ్మెల్యేలను పశువుల్లా కొంటుందని - ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుందని ఆందోళనవ్యక్తం చేశాడు చంద్రబాబు & లోకెష్ బాబు ద్వయం.

Image result for chandrababu & his media says BJP defeated in karnataka

అక్కడ ‘బీజేపీ - కాంగ్రెస్ – జేడీఎస్’ పార్టీల నేతలకన్నా చంద్రబాబే ఎక్కువ ఆందోళన చెందడం, అన్నీ చంద్రబాబు అనుకూల మీడియా అదే వార్తలతో కార్యక్రమాలు రూపొందించి బిజెపిని మరీ ధారుణం గా చీల్చి చండాడారు. ఇదే అందరినీ ఆశ్చర్య పరచింది. విశ్వాసపరీక్షకు ముందే బీజేపీ దిగిపోవడంతో కర్ణాటకలో జేడీఎస్ - కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణస్వీకారానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు టీడీపీ బద్దశత్రువు అయిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆప్యాయంగా అలింగనం చేసుకోవడం, సోనియాకి వంగివంగి సలాములు చేయటం పెట్టడం అందరినీ ఆకర్షించింది.

Related image

అవన్నీ అక్కడితో వదిలేస్తే నిన్న కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు - కేసీఆర్ లు ఇచ్చిన సలహా మూలంగానే తాను బీజేపీతో జతకట్టకుండా కాంగ్రెస్ ను ఎంచుకున్నానని ప్రకటించాడు. బాబు అనుకూల మీడియా ఈ వార్తను తెలంగాణలో కేసీఆర్ సలహా అని రాసి - ఆంధ్రాలో చంద్ర బాబు నాయుడు మూలంగానే ఇలా జరిగిందని వార్తలు రాసి హైలెట్ చేశాయి.అయితే ఉన్నట్లుండి ఈ రోజు ఏమైందో? ఏమో?  గానీ కుమారస్వామి వ్యాఖ్యలను టీడీపీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ ఖండించాడు.

Image result for chandrababu & his media says BJP defeated in karnataka

కర్ణాటకలో కాంగ్రెస్ తో కలవమని కుమారస్వామికి చంద్రబాబు చెప్పలేదని ప్రకటించాడు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు. శాశ్వత మిత్రులు ఉండరని వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో ఎవరితో ముందుకు సాగాలో కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చాడు. టీడీపీ 2019లో కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తుందన్న ఊహాగానాల నేపథ్యంలో దాని మూలం గా లాభం కన్నా నష్టమే ఎక్కువని అంచనాకు వచ్చిన చంద్రబాబు కుమారస్వామి వ్యాఖ్యలతో విభేదించకుంటే, మొదటికే మోసం వస్తుందని ఈ ప్రకటన చేయించాడన్న వాదన వినిపిస్తుంది.

Image result for galla jayadev

దాంతో పాటు బీజేపీ చేతిలో చంద్రబాబు అవినీతి చిట్టా ఉందని, దానిలోని ఒక సర్పమే ఎయిర్ ఏషియా స్కాము రూపంలో బుసలు కొట్టగా - ఇప్పటికే పీకల్లోతు ఇబ్బందు ల్లో ఉన్న పరిస్థితు లలో ఇంకా ముందుకు వెళ్తే కొంపలు మునిగితే కష్టమేమో నన్న ఆలోచన కూడాఈ ప్రకటనకు కారణం అని ప్రజలు అంటున్నారు.      

మరింత సమాచారం తెలుసుకోండి: