విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.  తెలంగాణలో కాస్తో కూస్తో కాంగ్రెస్ తన ప్రభావాన్ని చూపిస్తున్నా..ఏపిలో మాత్రం అసలు ఉనికి కోల్పోయే పరిస్థితి నెలకొంది.  ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ నేతలు టీడీపీలో జంప్ అయ్యారు.  మరికొంత మంది వైసీపీలోకి జంప్ అయ్యారు. 

కొద్ది మంది సీనియర్ నేతలు ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో కొనసాగుతున్నారు. తాజాగా ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌చార్జిగా ఉమెన్‌చాందీ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
Image result for uman chandi
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ వ్యవహారాల బాధ్యత సవాళ్లతో కూడుకున్నదన్నారు. రాహుల్‌గాంధీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన తెలిపారు. ఏపీ ప్రజలు ఎప్పుడూ కాంగ్రెస్‌తోనే ఉన్నారన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ తిరిగి అధికారంలోకి వచ్చేలా పనిచేస్తామని ఉమెన్‌చాందీ స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: